< 2 Mojžišova 27 >
1 Uděláš také oltář z dříví setim pěti loket zdýlí a pěti loket zšíří; čtverhranatý bude oltář, a tří loket zvýší bude.
౧“నీవు తుమ్మచెక్కతో ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠం చెయ్యాలి. ఆ బలిపీఠం నలుచదరంగా ఉండాలి. దాని యెత్తు మూడు మూరలు.
2 A zděláš mu rohy na čtyřech úhlech jeho; z něho budou rohové jeho; a obložíš jej mědí.
౨దాని నాలుగు మూలలా దానికి కొమ్ములు చెయ్యాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి. దానికి ఇత్తడి రేకు పొదిగించాలి.
3 Naděláš také k němu hrnců, do kterýchž by popel bral, a lopat a kotlíku, a vidliček a nádob k uhlí. Všecka nádobí jeho z mědi uděláš.
౩దాని బూడిద ఎత్తడానికి కుండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అగ్నిపాత్రలను చెయ్యాలి. ఈ ఉపకారణాలన్నిటినీ ఇత్తడితో చెయ్యాలి.
4 Uděláš mu i rošt mřežovaný měděný, a u té mříže čtyři kruhy měděné na čtyřech rozích jejích.
౪దానికి వలలాంటి ఇత్తడి జల్లెడ చెయ్యాలి.
5 A dáš ji pod okolek oltáře do vnitřku; a bude ta mříže až do polu oltáře.
౫ఆ వల మీద దాని నాలుగు మూలలా నాలుగు ఇత్తడి రింగులు చేసి ఆ వల బలిపీఠం మధ్యకి చేరేలా కిందిభాగంలో బలిపీఠం గట్టు కింద దాన్ని ఉంచాలి.
6 Uděláš k tomu oltáři i sochory z dříví setim, a mědí je okuješ.
౬బలిపీఠం కోసం మోతకర్రలను చెయ్యాలి. ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగించాలి.
7 A ti sochorové provlečeni budou skrze ty kruhy; a budou sochorové ti na obou stranách oltáře, když nošen bude.
౭ఆ మోతకర్రలను ఆ రింగుల్లో చొప్పించాలి. బలిపీఠం మోయడానికి ఆ మోతకర్రలు దాని రెండువైపులా ఉండాలి.
8 Uděláš jej z desk, aby byl vnitř prázdný; jakž ukázáno tobě na hoře, tak udělají.
౮పలకలతో గుల్లగా దాన్ని చెయ్యాలి. కొండ మీద నీకు చూపించిన నమూనా ప్రకారం దాన్ని చెయ్యాలి.
9 Uděláš také síň příbytku k straně polední; koltry síně té očkovaté budou z bílého hedbáví soukaného; sto loket zdélí ať má kraj jeden.
౯నీవు మందిరానికి ఆవరణం ఏర్పాటు చెయ్యాలి. కుడివైపున, అంటే దక్షిణ దిక్కున ఆవరణం నూరు మూరల పొడవు ఉండాలి. పేనిన సన్న నార తెరలు ఒక వైపుకు ఉండాలి.
10 Sloupů pak bude k nim dvadcet, a podstavků k nim měděných dvadcet; háky na sloupích a přepásaní jich stříbrné.
౧౦దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి.
11 A tak i strana půlnoční na dýl ať má koltry očkovaté sto loket zdýlí, a sloupů svých dvadceti, a podstavků k nim měděných dvadceti; háky na sloupích a přepásaní jich stříbrné.
౧౧అలాగే పొడవులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడవు గల తెరలు ఉండాలి. దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి.
12 Na šíř pak té síně k straně západní budou koltry očkovaté padesáti loktů zdýlí, a sloupů k nim deset, a podstavků jejich deset.
౧౨పడమటి దిక్కున ఆవరణం వెడల్పులో ఏభై మూరల తెరలు ఉండాలి. వాటి స్తంభాలు పది. వాటి దిమ్మలు పది.
13 A širokost síně v straně přední na východ bude padesáti loktů.
౧౩తూర్పు వైపున, అంటే తూర్పు దిక్కున ఆవరణం వెడల్పు ఏభై మూరలు.
14 Patnácti loktů budou koltry očkovaté k straně jedné, sloupové k nim tři, a podstavkové jejich tři.
౧౪ఒక వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
15 A k straně druhé patnácti loktů zdýlí budou koltry očkovaté, sloupové jejich tři, a podstavkové jejich tři.
౧౫రెండవ వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
16 K bráně pak té síně uděláno bude zastření dvadcíti loktů z postavce modrého a šarlatu, a z červce dvakrát barveného, a bílého hedbáví soukaného, dílem krumpéřským, sloupové k němu čtyři, a podstavkové jejich čtyři.
౧౬ఆవరణ ద్వారానికి నీల ధూమ్ర రక్త వర్ణాల తెరలు ఇరవై మూడు ఉండాలి. అవి పేనిన సన్ననారతో కళాకారుని పనిగా ఉండాలి. వాటి స్తంభాలు నాలుగు, వాటి దిమ్మలు నాలుగు.
17 Všickni sloupové síně vůkol přepásaní budou stříbrem; hákové pak jejich budou stříbrní, a podstavkové jejich mědění.
౧౭ఆవరణం చుట్టూ ఉన్న స్తంభాలన్నీ వెండి పెండెబద్దలు కలవి. వాటి కొక్కేలు వెండివి. వాటి దిమ్మలు ఇత్తడివి.
18 Dlouhost síně bude sto loket, a širokost padesáte, všudy jednostejná, vysokost pak pěti loktů, z bílého hedbáví soukaného, a podstavkové budou mědění.
౧౮ఆవరణం పొడవు నూరు మూరలు. దాని వెడల్పు ఏభై మూరలు. దాని ఎత్తు ఐదు మూరలు. అవి పేనిన సన్ననారతో చేశారు. వాటి దిమ్మలు ఇత్తడివి.
19 Všecka nádobí příbytku, ke vší službě jeho, a všickni kolíkové jeho, i všickni kolíkové síně z mědi budou.
౧౯మందిరంలో వాడే ఉపకరణాలన్నీ ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై యుండాలి.
20 Ty také přikaž synům Izraelským, ať nanesou oleje olivového čistého, vytlačeného k svícení, aby lampy vždycky rozsvěcovány byly.
౨౦దీపం నిత్యం వెలుగుతుండేలా ప్రమిదలకు దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.
21 V stánku úmluvy před oponou, kteráž zastírati bude svědectví, spravovati je budou Aron a synové jeho od večera až do jitra před Hospodinem. Toť bude řád věčný, kterýž zachovávati budou potomci jejich mezi syny Izraelskými.
౨౧సాక్ష్యపు మందసం ఎదుట ఉన్న తెర బయట ప్రత్యక్ష గుడారంలో అహరోను, అతని కుమారులు సాయంకాలం మొదలు ఉదయం దాకా యెహోవా సన్నిధిలో దాన్ని సవరిస్తూ ఉండాలి. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరాల వరకూ నిత్య శాసనం.”