< Ester 7 >
1 A tak přišel král i Aman, aby hodovali s Ester královnou.
౧రాజు, హామాను రెండవ రోజు ఎస్తేరు రాణి దగ్గరికి విందుకు వచ్చారు.
2 I řekl král k Ester opět druhého dne, napiv se vína: Jaká jest žádost tvá, Ester královno? A budeť dáno. Aneb jaká jest prosba tvá? Až do polovice království staneť se.
౨రాజు “ఎస్తేరు రాణీ, నీ విన్నపం ఏమిటి? అది నెరవేరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే నీకు ఇస్తాను” అని ద్రాక్షారసం పోస్తూ ఉండగా ఎస్తేరుతో అన్నాడు.
3 Tedy odpověděla Ester královna a řekla: Jestliže jsem nalezla milost před očima tvýma, ó králi, a jestliže se králi za dobré vidí, nechť mi jest darován život můj k mé žádosti, a národu mému k prosbě mé.
౩అప్పుడు ఎస్తేరు రాణి ఇలా జవాబిచ్చింది “రాజా, నీ అనుగ్రహానికి నేను నోచుకుంటే రాజువైన తమకు అంగీకారం అయితే, నా ప్రాణం నిలిచేలా చేయండి. ఇదే నా నివేదన. నా జాతి ప్రజల ప్రాణాల విషయంలో కూడా నేను వేడుకుంటున్నాను.
4 Nebo prodáni jsme, já i národ můj, abychom zbiti, pomordováni a vyhlazeni byli, ješto kdybychom za služebníky a děvky prodáni byli, mlčela bych, ač by i tak ten nepřítel nijakž nemohl nahraditi králi té škody.
౪నేను, నా జాతి ప్రజలు, సమూల నాశనానికి, సంహారానికి, తుడిచి పెట్టి వేయడానికి అమ్ముడుబోయాము. మేమంతా ఆడ, మగ బానిసలుగా అమ్ముడుబోయినట్టైతే నేను నోరు విప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆ మాత్రం ఇబ్బందికి రాజువైన మీకు బాధ ఇవ్వడం భావ్యం కాదు గదా.”
5 Opět odpovídaje král Asverus, řekl Ester královně: I kdož jest to ten, a kde jest ten, jehož srdce tak jest naduté, aby to činil?
౫అందుకు రాజైన అహష్వేరోషు “వాడెవడు? ఈ పని చేయడానికి సాహసించిన వాడెక్కడ?” అని ఎస్తేరు రాణిని అడిగాడు.
6 I řekla Ester: Muž protivník a nepřítel nejhorší jest Aman tento. Takž Aman zhrozil se před oblíčejem krále a královny.
౬ఎస్తేరు “మా విరోధి అయిన ఆ శత్రువు, దుష్టుడైన ఈ హామానే” అంది. అప్పుడు రాజు, రాణి ముందు హమానుకు ముచ్చెమటలు పోశాయి.
7 Tedy král vstal v prchlivosti své od pití vína, a vyšel na zahradu při paláci. Aman pak pozůstal tu, aby prosil za život svůj Estery královny; nebo viděl, že jest o něm zle uloženo od krále.
౭రాజు పట్టరాని కోపంతో ద్రాక్షారసం విందును విడిచి చరచరా అంతఃపురం తోటలోకి వెళ్ళాడు. అయితే రాజు తనను సర్వనాశనం చేసే ఆలోచన చేస్తున్నాడని హమాను భయపడ్డాడు. అతడు తన ప్రాణాలు కాపాడమని ఎస్తేరు రాణిని ప్రాధేయ పడసాగాడు.
8 Potom král navrátil se z zahrady palácu do domu, kdež pil víno, a Aman padl na lůžko, na kterémž seděla Ester. I řekl král: Což ještě násilé učiniti chce královně u mne v domě? A hned jakž slovo to vyšlo z úst krále, tvář Amanovu zakryli.
౮అంతఃపురం తోటలోనుండి ద్రాక్షారసం విందు స్థలానికి రాజు తిరిగి వచ్చి ఎస్తేరు కూర్చున్న తల్పం మీద హామాను పడి ఉండడం చూశాడు. “వీడు నా ఇంట్లో నేను చూస్తుండగానే రాణిని బలాత్కారం చేస్తాడా?” అన్నాడు. ఆ మాట రాజు నోట రాగానే సైనికులు హామాను ముఖానికి ముసుకు వేశారు.
9 Mezi tím řekl Charbona, jeden z komorníků, před králem: Aj, ještě šibenice, kterouž připravil Aman Mardocheovi, kterýž mluvil králi k dobrému, stojí při domě Amanově, zvýší padesáti loket. I řekl král: Oběstež ho na ní.
౯రాజు సముఖంలో ఉన్న అధికారుల్లో హర్బోనా అనే వాడు “అయ్యా, రాజు ప్రాణాలు కాపాడేందుకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయాలని ఈ హామాను 50 మూరల ఎత్తున్న ఉరి కొయ్య ఒకటి చేయించాడు. అది హామాను ఇంటి దగ్గర ఉంది” అని చెప్పాడు. వెంటనే రాజు “దాని మీద వీడిని ఉరి తీయండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
10 Tedy oběsili Amana na té šibenici, kterouž byl připravil Mardocheovi. A tak prchlivost královská ukojila se.
౧౦ఆ విధంగా హామాను మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వాళ్ళు అతడినే ఉరి తీశారు. అప్పుడు రాజు ఆగ్రహం చల్లారింది.