< Ester 6 >
1 Té noci král nemoha spáti, rozkázal přinésti knihy pamětné, kroniky, kteréž čteny byly před králem.
౧ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. అతడు తన పరిపాలన విశేషాలు రాసి ఉండే గ్రంథం తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు తెచ్చి దాన్ని రాజుకు చదివి వినిపించారు.
2 I našli zapsáno, že pověděl Mardocheus na Bigtana a Teresa, dva komorníky královské z těch, jenž ostříhali prahu, že ukládali vztáhnouti ruku na krále Asvera.
౨ద్వారపాలకులు బిగ్తాను, తెరెషు అనే ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపడానికి కుట్ర పన్నిన సంగతి మొర్దెకై బయట పెట్టి తెలియజేసినట్టు అందులో రాసి ఉంది.
3 Tedy řekl král: Čím jest poctěn, neb jak zveleben Mardocheus za to? Odpověděli služebníci královští, dvořané jeho: Není jemu nic dáno.
౩రాజు ఆ సంగతి విని “మరి దీని కోసం మొర్దెకైకి సన్మానంగా, గుర్తింపుగా ఏదైనా చేశామా?” అని అడిగాడు. రాజు సేవకులు “అతనికేమీ చేయలేదు” అని జవాబిచ్చారు.
4 I řekl král: Kdo jest v síni? (Aman pak byl přišel do síně domu královského zevnitřní, mluviti s králem, aby oběšen byl Mardocheus na šibenici, kterouž jemu připravil.)
౪అప్పుడు “ఆవరణంలో ఉన్నది ఎవరు?” అని రాజు అడిగాడు. అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయించడానికి రాజు అనుమతి అడగడానికి రాజ భవంతి ఆవరణంలోకి వచ్చి ఉన్నాడు.
5 Odpověděli králi služebníci jeho: Aj, Aman stojí v síni. Řekl král: Nechť vejde sem.
౫రాజ సేవకులు “అయ్యా, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడు” అని రాజుతో చెప్పారు. రాజు “అతన్ని రానియ్యండి” అన్నాడు. హామాను లోపలికి వచ్చాడు.
6 Takž všel Aman. Jemuž řekl král: Co sluší učiniti muži tomu, kteréhož by chtěl král ctíti? (Aman řekl sám v sobě: Kohož by jiného chtěl král více ctíti, nežli mne?)
౬“రాజు ఎవరినైనా గొప్ప చేసి సత్కరించాలనుకుంటే ఏమి చేయాలి?” అని రాజు అతన్ని అడిగాడు. హామాను “నన్ను గాక రాజు మరి ఇంకెవరిని గొప్ప చేయాలనుకుంటాడు?” అని తనలో తాను అనుకుని రాజుతో ఇలా అన్నాడు,
7 Odpověděl Aman králi: Muži tomu, jehož král ctíti chce,
౭“రాజు సత్కరించాలని కోరిన వాడికి ఇలా చెయ్యాలి.
8 Ať přinesou roucho královské, do kteréhož se král obláčí, a přivedou koně, na kterémž jezdí král, a vstaví korunu královskou na hlavu jeho.
౮రాజు ధరించుకునే రాజవస్త్రాలను, రాజు ఎక్కే గుర్రాన్ని, రాజు తన తలపై పెట్టుకునే రాజకిరీటాన్ని తేవాలి.
9 A dadouce roucho to i koně toho v ruku některého z nejznamenitějších knížat královských, ať oblekou muže toho, jehož král chce ctíti, a ať jej vodí na koni po ulici města, a volají před ním: Tak se má státi muži tomu, jehož král ctíti chce.
౯ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీరాజు ఉన్నతాధికారుల్లో ఒకడికి అప్పగించాలి. రాజు గొప్ప చేయాలని కోరుకున్న వ్యక్తికి ఆ వస్త్రాలు తొడిగి ఆ గుర్రం మీద అతణ్ణి ఎక్కించి రాజవీధిలో ఊరేగిస్తూ ‘రాజు గొప్ప చేయాలని కోరిన వాడికి ఈ విధంగా చేస్తారు’ అని అతని ముందు నడుస్తూ చాటించాలి.”
10 Tedy řekl král Amanovi: Pospěš, vezmi to roucho a koně, jakž jsi řekl, a učiň to Mardocheovi Židu, kterýž sedí v bráně královské. Nepomíjejž ničeho ze všeho toho, což jsi mluvil.
౧౦వెంటనే రాజు “అయితే తొందరగా వెళ్లి నువ్వు చెప్పినట్టే ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీ తీసుకుని రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి ఆ విధంగా చెయ్యి. నువ్వు చెప్పిన వాటిలో ఏదీ తక్కువ కానియ్యకుండా అంతా చెయ్యి” అని హామానుకు ఆజ్ఞాపించాడు.
11 Protož vzav Aman roucho i koně, oblékl Mardochea, a vedl jej na koni po ulici města, volaje před ním: Tak se má státi muži tomu, jehož král ctíti chce.
౧౧హామాను ఆ వస్త్రాలను, గుర్రాన్నీ తెచ్చి మొర్దెకైకి ఆ బట్టలు తొడిగి ఆ గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి రాజ వీధిలో నడిపిస్తూ “రాజు గొప్ప చేయాలని కోరే వాడికి ఇలా జరుగుతుంది” అని అతని ముందర నడుస్తూ చాటించాడు.
12 Potom navrátil se Mardocheus k bráně královské. Aman pak rychle pospíšil do domu svého, smuten jsa, s zakrytou hlavou.
౧౨తరువాత మొర్దెకై రాజు ద్వారం దగ్గరికి తిరిగి వచ్చాడు. హామాను మాత్రం తలపై గుడ్డ కప్పుకుని హతాశుడై గబగబా ఇంటికి వెళ్లి పోయాడు.
13 I vypravoval Aman Zeres ženě své a všechněm přátelům svým všecko, což se mu přihodilo. I řekli jemu mudrci jeho i Zeres žena jeho: Poněvadž z národu Židovského jest Mardocheus, před jehož oblíčejem počal jsi klesati, neodoláš jemu, ale jistě padneš před oblíčejem jeho.
౧౩హామాను తనకు పట్టిన గతి తన భార్య జెరెషుకు, తన స్నేహితులందరికీ చెప్పాడు. అతని దగ్గర ఉన్న జ్ఞానులు, అతని భార్య జెరెషు “ఎవరి ఎదుట నీవు పడిపోవడం మొదలయిందో ఆ మొర్దెకై యూదు జాతివాడైతే గనక అతన్ని నీవు ఓడించలేవు. అతని చేతుల్లో నీకు పతనం తప్పదు” అని అతనితో అన్నారు.
14 A když oni ještě mluvili s ním, komorníci královští přišli, a rychle vzali Amana na hody, kteréž připravila Ester.
౧౪వారు ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజుగారి ఉద్యోగులు వచ్చి ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు రమ్మని హామానును తొందర పెట్టారు.