< Ester 1 >
1 Stalo se pak za času krále Asvera, (to jest ten Asverus, jenž kraloval od Indie až k Mouřenínské zemi nad sto dvadcíti a sedmi krajinami),
౧ఇండియా నుండి ఇతియోపియా వరకూ గల 127 సంస్థానాలను పరిపాలించిన అహష్వేరోషు కాలంలో జరిగిన విషయాలు ఇవి.
2 Že toho času, když seděl král Asverus na stolici království svého, jenž byla v Susan, městě královském,
౨ఆ కాలంలో అహష్వేరోషు రాజు షూషను కోటలో నుండి పరిపాలన సాగిస్తున్నాడు.
3 Léta třetího kralování svého, učinil u sebe hody všechněm knížatům svým a služebníkům svým, nejznamenitějším Perským a Médským, hejtmanům a vládařům nad krajinami,
౩తన పరిపాలన మూడో సంవత్సరంలో అతడు తన అధిపతులకు, సేవకులకు విందు చేశాడు. పర్షియా, మాదీయ శూరులూ రాజవంశికులూ సంస్థానాల అధిపతులూ అతని సముఖంలో ఉన్నారు.
4 Ukazuje bohatství, slávu království svého a čest, i ozdobu důstojnosti své za mnoho dnů, totiž za sto a osmdesáte dnů.
౪అతడు తన మహిమగల రాజ్య వైభవ ఐశ్వర్యాలనూ, తన విశిష్టత తాలూకు ఘనత ప్రతిష్టలనూ చాలా రోజులపాటు, అంటే 180 రోజులపాటు వారి ఎదుట ప్రదర్శించాడు.
5 (A když se vyplnili dnové ti, učinil král všemu lidu, což ho koli bylo v Susan městě královském, od největšího až do nejmenšího, hody za sedm dní na paláci v zahradě při domě královském.)
౫ఆ రోజులు గడిచిన తరువాత రాజు ఏడు రోజుల పాటు విందు ఏర్పాటు చేయించాడు. అది షూషను కోటలో ఉన్న వారందరికీ, అంటే గొప్పవారు మొదలుకుని కొద్ది వారి వరకూ అందరికీ. అది రాజభవనం ఆవరణంలోని ఉద్యానవనంలో జరిగింది.
6 Též čalouny bílé, zelené a z postavce modrého, zavěšené na provázcích kmentových a šarlatových u kroužků stříbrných, na sloupích mramorových, lůžka zlatá a stříbrná na podlaze porfyretové a mramorové, pariové a socharetové.
౬ఆ ఉద్యానవనం ఆవరణలో పాలరాతి స్తంభాలకు ఉన్న వెండి రింగులకు ముదురు కెంపు రంగు నార తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్లకు తెలుపు, నేరేడు వర్ణాల తెరలు వేలాడుతున్నాయి. వేరు వేరు రంగుల పాల రాయి పరచిన నేల మీద జలతారు కప్పి ఉన్న వెండి బంగారు తల్పాలు ఉన్నాయి.
7 Nápoj pak dávali v nádobách zlatých, a to v nádobách jiných a jiných, i vína královského v hojnosti, jakž slušelo na krále.
౭అతిథులకు బంగారు పాత్రల్లో తాగేందుకు పోశారు. ప్రతి పాత్రా దేనికదే వేరుగా ఉంది. రాజు ఇష్టంగా ద్రాక్షారసాన్ని ధారాళంగా పోయించాడు.
8 Ale ku pití, podlé nařízení, žádný nenutil. Nebo tak poručil král všechněm správcům domu svého, aby činili podlé vůle jednoho každého.
౮ఆ విందు పానం “ఎవరికీ ఎలాంటి నిర్బంధమూ లేదు” అన్న రాజాజ్ఞ ప్రకారం జరిగింది. ఏ అతిథి కోరినట్టు అతనికి చెయ్యాలని రాజు ముందుగానే తన అంతఃపుర సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు.
9 Také i královna Vasti učinila hody ženám v domě královském krále Asvera.
౯వష్తి రాణి కూడా అహష్వేరోషు రాజ భవనంలో స్త్రీలకు విందు చేసింది.
10 Dne pak sedmého, když se podveselil král vínem, rozkázal Mehumanovi, Biztovi, Charbonovi, Bigtovi a Abagtovi, Zetarovi a Karkasovi, sedmi komorníkům, kteříž sloužili před oblíčejem krále Asvera,
౧౦ఏడో రోజున రాజు ద్రాక్షారసం సేవించి ఉల్లాసంగా మత్తెక్కి ఉన్న సమయంలో తన ముందు సేవాధర్మం జరిగించే మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
11 Aby přivedli Vasti královnu před oblíčej krále v koruně královské, aby okázal národům i knížatům krásu její; nebo velmi krásná byla.
౧౧అక్కడ సమావేశమైన ప్రజానీకానికి, అధిపతులకు వష్తి రాణి తన అందాన్ని ప్రదర్శించాలని, ఆమె రాజ కిరీటం ధరించుకుని తన సన్నిధికి రావాలని చెప్పి పంపాడు. ఆమె అసమాన సౌందర్య రాశి.
12 Ale odepřela královna Vasti přijíti k rozkazu královskému, skrze ty komorníky vzkázanému. Pročež král rozhněval se velmi a rozpálil se hněvem sám v sobě.
౧౨వష్తి రాణి నపుంసకులు వినిపించిన రాజాజ్ఞ ప్రకారం రావడానికి ఒప్పుకోలేదు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలి పోయాడు.
13 I řekl král mudrcům znajícím časy, (nebo tak každé věci podával král na všecky zběhlé v právích a soudech),
౧౩కాబట్టి జ్ఞానులుగా పేరు పొందిన వారితో కాలం పోకడలను ఎరిగిన వారితో అతడు సంప్రదించాడు. చట్టం, రాజ్యధర్మం తెలిసిన వారి సలహా తీసుకోవడం రాజుకు వాడుక.
14 A nejbližšímu sebe Charsenovi, Setarovi, Admatovi, Tarsisovi, Meresovi, Marsenovi, Memuchanovi, sedmi vývodám Perským a Médským, jenž vídali tvář královskou, a sedali první po králi:
౧౪కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెను, మర్సెనా, మెమూకాను అనే ఏడుగురు అతనికి సన్నిహితంగా ఉండిన వారు. వీరికి రాజు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. రాజ్యంలో అత్యున్నత అధికార స్థానాల్లో ఉన్న పారసీకుల, మాదీయుల ఏడుగురు ప్రధానులు వీరే.
15 Co se má podlé práva státi s královnou Vasti, proto že nevyplnila rozkazu krále Asvera, stalého skrze komorníky?
౧౫రాజు “రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు వష్తి రాణి లోబడ లేదు కాబట్టి చట్ట పరిధిలో ఆమెను ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు.
16 Tedy řekl Memuchan před králem i knížaty: Ne proti samému králi zavinila královna Vasti, ale proti všechněm knížatům, a proti všechněm národům všech krajin Asvera krále.
౧౬మెమూకాను రాజు ఎదుటా ప్రధానుల ఎదుటా ఇలా జవాబిచ్చాడు. “వష్తి రాణి రాజుకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, రాజైన అహష్వేరోషు పాలనలోని సంస్థానాలన్నిటిలోని అధిపతులందరికీ, ప్రజలందరికీ వ్యతిరేకంగా తప్పు చేసింది.
17 Nebo když se donese to, co učinila královna, všech žen, zlehčí sobě muže své a řeknou: An král Asverus rozkázal přivésti královnu Vasti před oblíčej svůj, a však nepřišla.
౧౭స్త్రీలందరికీ ఈ విషయం తెలుస్తుంది. వారంతా తమ పురుషులను చులకన చేస్తారు. ఎలాగంటే, ‘అహష్వేరోషు రాజు తన రాణి వష్తిని తన సన్నిధికి పిలుచుకు రావాలని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు’ అంటారు.
18 Nýbrž ještě tohoto dne budou to mluviti kněžny Perské a Médské, (kteréž slyšely, co učinila královna), všechněm knížatům královským, i naplodí se hojně pýchy a zpoury.
౧౮పారసీక, మాదీయ అధిపతుల భార్యలు రాణి చేసినది విని, రాణి పలికినట్టే ఈ రోజు రాజు అధిపతులందరితో పలుకుతారు. దీని వలన చాలా తిరస్కారం, కోపం కలుగుతాయి.
19 Jestliže se tedy králi za dobré vidí, nechť se stane výpověď královská od oblíčeje jeho, a nechť jest vepsána mezi práva Perská a Médská, kteráž by nemohla změněna býti, že nechtěla přijíti Vasti před oblíčej krále Asvera, pročež království její dá král jiné, lepší nežli ona.
౧౯రాజుగారికి అంగీకారం అయితే రాజైన అహష్వేరోషు సమక్షంలోకి వష్తి రాణి ఇక ఎన్నడూ రాకూడదని మీరు ఆజ్ఞ ఇవ్వాలి. ఈ శాసనం స్థానంలో మరొకటి ఎన్నటికీ రాకుండేలా పారసీకుల, మాదీయుల చట్ట ప్రకారం దాన్ని రాయాలి. రాజు వష్తి కంటే యోగ్యురాలికి రాణి పదవి ఇవ్వాలి.
20 Tak když uslyší výpověd královskou, kterouž vyhlásiti dá po všem království svém, jakkoli veliké jest, všecky ženy v poctivosti míti budou manžely své, od největšího až do nejmenšího.
౨౦రాజు చేసే నిర్ణయం విశాలమైన మీ రాజ్యమంతటా ప్రకటించినట్టయితే, ఘనురాలు గానీ అల్పురాలు గానీ స్త్రీలందరూ తమ పురుషులను గౌరవిస్తారు.”
21 I líbila se ta rada králi i knížatům, a učinil král podlé rady Memuchanovy.
౨౧ఈ సలహా రాజుకీ అధికారులకీ నచ్చింది. కాబట్టి అతడు మెమూకాను మాట ప్రకారం చేశాడు.
22 A rozeslal listy do všech krajin královských, do jedné každé krajiny písmem jejím, a do každého národu jazykem jeho, aby každý muž byl pánem domu svého. Což oznámil každý hejtman lidu jazykem jeho.
౨౨ప్రతి మగ వాడు తన ఇంట్లో అధికారిగా ఉండాలని శాసించాడు. ప్రతి రాజ సంస్థానానికి దాని రాత లిపి ప్రకారం, ప్రతి జాతికీ దాని భాష ప్రకారం ఆదేశాలు వెళ్ళాయి. ఈ శాసనం సామ్రాజ్యం అంతటా రాజు వివిధ ప్రజల భాషల్లో రాసి పంపించాడు.