< 5 Mojžišova 13 >
1 Povstal-li by u prostřed tebe prorok, aneb někdo, ješto by míval sny, a ukázal by tobě znamení aneb zázrak,
౧ప్రవక్త గానీ కలలు కనేవాడు గానీ మీ ఎదుట సూచక క్రియను లేక మహత్కార్యాన్ని చూపించి,
2 Byť se pak i stalo to znamení aneb zázrak, a mluvil by tobě, řka: Poďme, následujme bohů cizích, (kterýchž neznáš, ) a služme jim:
౨మీరు ఎరుగని “ఇతర దేవుళ్ళను అనుసరించి పూజిద్దాం రండి” అని చెబుతాడేమో.
3 Neuposlechneš slov proroka toho, ani snáře, nebo zkušuje vás Hospodin Bůh váš, aby známé bylo, milujete-li Hospodina Boha svého z celého srdce svého a z celé duše své.
౩అలా చెప్పినప్పుడు అతడు మీతో చెప్పిన సూచక క్రియ లేక మహత్కార్యం జరిగినా సరే, ఆ ప్రవక్త, లేక కలలు కనేవాడి మాటలు వినవద్దు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోడానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు.
4 Hospodina Boha svého následujte, a jeho se bojte, přikázaní jeho ostříhejte, hlasu jeho poslouchejte, jemu služte a jeho se přídržte.
౪మీరు మీ యెహోవా దేవునికి లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయననే హత్తుకుని ఉండాలి.
5 Prorok pak ten aneb snář zamordován bude, nebo mluvil to, čímž by odvrátil vás od Hospodina Boha vašeho, (kterýž vyvedl vás z země Egyptské, a vykoupil tě z domu služby, ) aby tě srazil s cesty, kterouž přikázal tobě Hospodin Bůh tvůj, abys chodil po ní; a tak odejmeš zlé z prostředku svého.
౫మీరు నడుచుకోవాలని మీ దేవుడు యెహోవా మీకాజ్ఞాపించిన మార్గం నుండి మిమ్మల్ని తొలగించి, ఐగుప్తు దేశం అనే బానిసల ఇంట్లో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించారు కాబట్టి ఆ ప్రవక్తకు, లేక కలలు కనేవాడికి మరణశిక్ష విధించాలి. ఆ విధంగా మీ మధ్య నుండి ఆ దుష్టత్వాన్ని పరిహరించాలి.
6 Jestliže by tě tajně nabádal bratr tvůj, syn matky tvé, aneb syn tvůj, aneb dcera tvá, aneb manželka, kteráž jest v lůně tvém, aneb přítel tvůj, kterýžť by milý byl jako duše tvá, řka: Poďme a služme bohům cizím, (kterýchž jsi neznal ty ani otcové tvoji, )
౬మీ తల్లి కొడుకు, మీ సోదరుడు, మీ కొడుకు, మీ కూతురు, మీ భార్య, ప్రాణస్నేహితుడు,
7 Z bohů pohanských, kteříž vůkol vás jsou, buď blízko aneb daleko od tebe, od jednoho konce země až do druhého konce jejího,
౭ఎవరైనా సరే, భూమి ఈ చివరి నుండి ఆ చివర వరకూ మీకు దగ్గరైనా, దూరమైనా, మీరు, మీ పూర్వీకులు ఎరగని మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్ళను పూజిద్దాం రమ్మని రహస్యంగా మిమ్మల్ని ప్రేరేపిస్తే
8 Nepovoluj jemu, aniž ho poslouchej; neodpustíť mu oko tvé, aniž se slituješ, aniž zatajíš ho,
౮వారి మాటకు ఒప్పుకోవద్దు. వారి మాట వినవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారి మీద దయ చూపవద్దు. వారిని తప్పించడానికి ప్రయత్నించకుండా వారిని తప్పకుండా చంపాలి.
9 Ale bez milosti zabiješ jej; ruka tvá nejprv na něj bude vztažena, abys ho zabil, a potom ruce všeho lidu.
౯వారిని చంపడానికి ప్రజలందరి కంటే ముందుగా మీ చెయ్యి వారి మీద పడాలి.
10 A ukamenuješ jej až do smrti, nebo chtěl odvésti tebe od Hospodina Boha tvého, kterýž tě vyvedl z země Egyptské, z domu služby,
౧౦రాళ్లతో వారిని చావగొట్టాలి. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి బానిసల ఇంటి నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వారు ప్రయత్నించారు.
11 Aby všecken lid Izraelský, uslyšíce to, báli se, a nečinili více něco podobného věci této nejhorší u prostřed tebe.
౧౧అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా అది విని భయపడి, మళ్ళీ అలాంటి చెడ్డ పని మీ మధ్య చేయరు.
12 Uslyšel-li bys o některém městě svém, kteréž Hospodin Bůh tvůj dá tobě, abys tam bydlil, ani praví:
౧౨మీరు నివసించడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న వాటిలో ఏదైనా ఒక పట్టణంలో
13 Vyšli muži, lidé nešlechetní z prostředku tvého, kteříž svedli spoluobyvatele své, řkouce: Poďme, služme bohům cizím, kterýchž neznáte:
౧౩దుష్టులైన కొందరు మీరు ఎరుగని ఇతర దేవుళ్ళను పూజిద్దాం రండని తమ పట్టణ ప్రజలను ప్రేరేపించారని వింటే, మీరు ఆ సంగతిని బాగా పరీక్షించి విచారించాలి.
14 Tedy vyhledej a vyzvěz a dobře se na to vyptej, a jestliže jest pravda a jistá věc, že ohavnost se stala u prostřed tebe,
౧౪అది నిజమైతే, అంటే అలాంటి హేయమైన పని మీ మధ్య జరిగి ఉంటే
15 Zbiješ obyvatele města toho mečem, a jako věc proklatou zkazíš je i všecko, což by v něm bylo, hovada také jeho mečem pobiješ.
౧౫ఆ పట్టణస్తులను తప్పకుండా కత్తితో చంపి, దానినీ దానిలో ఉన్న సమస్తాన్నీ దాని పశువులనూ కత్తితో చంపివేయాలి.
16 A všecky kořisti jeho shromáždíš u prostřed ulice jeho, a spálíš ohněm to město i všecky kořisti jeho docela Hospodinu Bohu svému, aby byla hromada rumu věčná; a nebude více staveno.
౧౬దానిలో దోచుకున్న సొమ్మంతటినీ దాని వీధిలో పోగుచేసి, మీ దేవుడు యెహోవా పేరున ఆ పట్టణాన్ని, దాని సొత్తునీ పూర్తిగా కాల్చివేయాలి. దాన్ని ఇక ఎన్నటికీ తిరిగి కట్టకూడదు, అది పాడుదిబ్బలాగా ఉండిపోవాలి.
17 A nevezmeš ničehož z věcí proklatých, aby Hospodin odvrátil se od hněvu prchlivosti své, a učinil tobě milosrdenství svá, a smiloval se nad tebou, i rozmnožil tě, jakož s přísahou zaslíbil otcům tvým.
౧౭ఈ రోజు నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ
18 Protož poslouchati budeš hlasu Hospodina Boha svého, ostříhaje všech přikázaní jeho, kteráž já dnes přikazuji tobě, abys činil, což pravého jest, před očima Hospodina Boha svého.
౧౮మీ దేవుడైన యెహోవా దృష్టికి సరైన దాన్ని చేస్తూ, ఆయన మాట వినాలి. యెహోవా తన కోపం నుండి మళ్లుకుని మిమ్మల్ని కనికరించి, దయ చూపి మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన విధంగా మిమ్మల్ని విస్తరింపజేయాలంటే నాశనం చేయాల్సిన దానిలో కొంచెమైనా మీ దగ్గర ఉంచుకోకూడదు.