< 1 Kronická 7 >
1 Synové pak Izacharovi: Tola, Fua, Jasub a Simron, čtyři.
౧ఇశ్శాఖారుకి నలుగురు కొడుకులున్నారు. వాళ్ళు, తోలా, పువ్వా, యాషూబూ, షిమ్రోనూ అనేవాళ్ళు.
2 Synové pak Tolovi: Uzi, Refaia, Jeriel, Jachmai, Jipsam, Samuel, knížata po domích otců jejich, pošlí od Toly, muži udatní v pokoleních svých. Počet jejich ve dnech Davidových byl dvamecítma tisíců a šest set.
౨తోలాకి ఉజ్జీ, రెఫాయా, యెరీయేలూ, యహ్మయీ, యిబ్శామూ, షెమూయేలూ పుట్టారు. తోలా కొడుకులైన వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. వీళ్ళు బలిష్టులు. ధైర్యవంతులు. దావీదు పరిపాలించిన కాలంలో వీళ్ళ సంఖ్య ఇరవై రెండు వేల ఆరు వందలు.
3 Synové Uzovi: Izrachiáš. Synové pak Izrachiášovi: Michael, Abdiáš, Joel a Isia, všech pět knížat.
౩ఉజ్జీ కొడుకుల్లో ఒకడి పేరు ఇజ్రహయా. ఇజ్రహయా కొడుకుల పేర్లు, మిఖాయేలు ఓబద్యా, యోవేలూ, ఇష్షీయా అనేవాళ్ళు. వీళ్ళు ఐదు గురూ తమ తెగల నాయకులు.
4 A s nimi v pokoleních jejich, po čeledech jejich otcovských, mužů válečných třidceti šest tisíců; nebo mnoho měli žen a synů.
౪వాళ్ళకి అనేకమంది భార్యలూ, పిల్లలూ ఉన్నారు. అందుచేత వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వాళ్ళ వంశాల నుండి సైన్యంలో ముప్ఫై ఆరు వేల మంది ఉన్నారు.
5 Bratří také jejich po všech čeledech Izachar, mužů udatných osmdesáte sedm tisíců, všech vyčtených.
౫ఇశ్శాఖారు వంశాల్లో వాళ్ళ బంధువుల నుండి తమ వంశావళి లెక్కల ప్రకారం యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎనభై ఏడువేలమంది ఉన్నారు.
6 Synové Beniaminovi: Béla, Becher, Jediael, tři.
౬బెన్యామీనుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వాళ్ళు బెలా, బేకరు, యెదీయవేలూ అనేవాళ్ళు.
7 Synové pak Bélovi: Ezbon, Uzi, Uziel, Jerimot a Iri, pět knížat čeledí otcovských, muži udatní; načteno jich dvamecítma tisíců, třidceti a čtyři.
౭బెలకు ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు, ఎస్బోనూ, ఉజ్జీ, ఉజ్జీయేలూ, యెరీమోతూ, ఈరీ అనేవాళ్ళు. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై రెండు వేల ముప్ఫై నల్గురు యుద్ధం చేసే వాళ్ళున్నారు.
8 Potom synové Becherovi: Zemira, Joas, Eliezer, Elioenai, Amri, Jeremot, Abiáš, Anatot a Alemet, všickni synové Becherovi.
౮బేకరు కొడుకులు జెమీరా, యోవాషు, ఎలీయెజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు అనేవాళ్ళు. వీళ్ళంతా బేకరు కొడుకులు.
9 Kterýchž počet po pokoleních jejich, a po knížatech v domě čeledí otcovských, mužů udatných, dvadceti tisíců a dvě stě.
౯తమ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై వేల రెండు వందలమంది కుటుంబ నాయకులున్నారు. వీళ్ళంతా శూరులు.
10 Synové také Jediaelovi: Bilan. Synové pak Bilanovi: Jeus, Beniamin, Ahod, Kenan, Zetan, Tarsis a Achisachar.
౧౦యెదీయవేలు కొడుకుల్లో ఒకడు బిల్హాను. బిల్హాను కొడుకులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు.
11 Všech těch synů Jediaelových po knížatech čeledí, mužů udatných, sedmnáct tisíc a dvě stě, vycházejících na vojnu k bitvě,
౧౧యెదీయవేలు కొడుకులైన వీళ్ళంతా తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వీళ్ళలో యుద్ధానికి వెళ్ళగలిగిన శూరులు పదిహేను వేల రెండు వందలమంది ఉన్నారు.
12 Kromě Suppim a Chuppim, synů doma zrozených, a Chusim, synů vně zplozených.
౧౨ఈరుకి షుప్పీము, హుప్పీము అనే ఇద్దరు కొడుకులున్నారు. అహేరు కొడుకుల్లో హుషీము ఉన్నాడు.
13 Synové Neftalímovi: Jasiel, Guni, Jezer a Sallum, synové Bály.
౧౩బిల్హా కొడుకు నఫ్తాలీ. నఫ్తాలీ కొడుకులు యహజియేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవాళ్ళు.
14 Synové Manassesovi: Asriel, kteréhož mu manželka porodila. (Ženina též jeho Syrská porodila Machira, otce Galád.
౧౪మనష్షే కొడుకుల్లో అశ్రీయేలు అనే వాడున్నాడు. వాడు అతని ఉంపుడుగత్తె వల్ల పుట్టాడు. ఈ ఉంపుడుగత్తె ఒక అరామీయురాలు. ఈమే గిలాదుకి నాయకుడైన మాకీరుకి కూడా జన్మనిచ్చింది.
15 Machir pak vzal manželku Chuppimovu a Suppimovu, a jméno sestry jeho Maacha.) Jméno pak druhého Salfad, a měl Salfad dcery.
౧౫మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె సోదరి పేరు మయకా. మనష్షే రెండో కొడుకు పేరు సెలోపెహాదు. ఈ సెలోపెహాదుకి కూతుళ్ళు మాత్రమే పుట్టారు.
16 Porodila pak Maacha manželka Machirova syna, kteréhož nazvala Fáres, a jméno bratra jeho Sáres, synové pak jeho Ulam a Rekem.
౧౬మాకీరు భార్య మయకాకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు పెరెషు. ఇతని సోదరుడి పేరు షెరెషు. షెరెషు కొడుకులు ఊలాము, రాకెము.
17 Synové pak Ulamovi: Bedan. Tiť jsou synové Galád syna Machirova, syna Manassesova.
౧౭ఊలాము కొడుకు బెదాను. వీరంతా మనష్షే కొడుకు మాకీరుకి పుట్టిన గిలాదు సంతానం.
18 Sestra pak jeho Molechet porodila Ishoda a Abiezera a Machla.
౧౮మాకీరు సోదరి అయిన హమ్మోలెకెతు. ఈ మెకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు.
19 Byli pak synové Semidovi: Achian, Sechem, Likchi a Aniam.
౧౯షెమీదా కొడుకులు అహెయాను, షెకెము, లికీ, అనీయాము.
20 Synové pak Efraimovi: Sutelach, a Bered syn jeho, Tachat syn jeho, Elada syn jeho, Tachat syn jeho,
౨౦ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. ఎఫ్రాయిము కొడుకు షూతలహు. షూతలహు కొడుకు బెరెదు. బెరెదు కొడుకు తాహతు. తాహతు కొడుకు ఎలాదా. ఎలాదా కొడుకు తాహతు.
21 Též Zabad syn jeho, Sutelach syn jeho, Ezer a Elad. I zbili je muži Gát, kteříž zrozeni byli v zemi té; nebo sstoupili byli, aby zajali dobytky jejich.
౨౧తాహతు కొడుకు జాబాదు. ఇతనికి షూతలహూ, ఏజెరూ, ఎల్యాదూ అనేవాళ్ళు పుట్టారు. వాళ్ళు అక్కడ స్థానికులైన గాతు ప్రజల పశువులను దొంగతనం చేయడానికి వెళ్ళారు. దాంతో గాతు ప్రజలు వాళ్ళను పట్టుకుని చంపివేశారు.
22 Protož kvílil Efraim otec jejich za mnohé dny, a přišli bratří jeho, aby ho těšili.
౨౨వాళ్ళ తండ్రియైన ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. అప్పుడు అతని సోదరులు వచ్చి అతణ్ణి పరామర్శించారు.
23 Potom všel k manželce své, kteráž počala a porodila syna, a nazval jméno jeho Beria, že byl v zámutku pro rodinu svou.
౨౩తరువాత అతడు తన భార్యను కూడగా ఆమె గర్భం ధరించి ఒక కొడుక్కి జన్మనిచ్చింది. తన ఇంట్లో కలిగిన విషాదాన్నిబట్టి ఎఫ్రాయిము తన కొడుక్కి బెరీయా అనే పేరు పెట్టాడు.
24 Dceru také Seeru, kteráž vystavěla Betoron dolní i horní, a Uzen Seera.
౨౪అతని కుమార్తె పేరు షెయెరా. ఈమె ఉత్తర బేత్ హోరోను, దక్షిణ బేత్ హోరోను, ఉజ్జెన్ షెయెరా పట్టణాలను నిర్మించింది.
25 A Refacha syna jeho, Resefa, Telecha, a Tachana syna jeho,
౨౫వాని కొడుకులు రెపహూ, రెషెపులు. రెపహు కొడుకు తెలహు, తెలహు కొడుకు తహను,
26 Ladana syna jeho, Amiuda syna jeho, Elisama syna jeho,
౨౬తహను కొడుకు లద్దాను, లద్దాను కొడుకు అమీహూదు, అమీహూదు కొడుకు ఎలీషామా,
27 Non syna jeho, Jozue syna jeho.
౨౭ఎలీషామా కొడుకు నూను, నూను కొడుకు యెహోషువ.
28 Vládařství pak jejich a bydlení jejich Bethel s vesnicemi svými, a k východu Náran, a k západu Gázer a vesnice jeho, Sichem s vesnicemi svými, až do Gázy a vesnic jeho.
౨౮వాళ్ళు స్వాస్థ్యంగా పొందిన వారి నివాస స్థలాలు ఏవంటే, బేతేలూ దాని చుట్టూ ఉన్న గ్రామాలు. ఇంకా తూర్పువైపు ఉన్న నహరానూ, పడమటి వైపు ఉన్న గెజెరు, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, షెకెము, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, గాజా, దాని చుట్టూ ఉన్న గ్రామాల వరకూ వారి నివాస స్థలాలు వ్యాపించాయి.
29 A v místech naproti synům Manassesovým: Betsan s vesnicemi svými, Tanach s vesnicemi svými, Mageddo s vesnicemi svými, Dor s vesnicemi svými. V těch bydlili synové Jozefa syna Izraelova.
౨౯అలాగే మనష్షీయుల సరిహద్దు ప్రాంతాల్లోని బేత్షెయాను, దాని గ్రామాలు, తానాకు, దాని గ్రామాలు, మెగిద్దో, దాని గ్రామాలు, దోరు, దాని గ్రామాలు వాళ్ళకున్నాయి. ఇశ్రాయేలు కొడుకైన యోసేపు వారసులు ఈ ఊళ్ళలోనే నివాసమున్నారు.
30 Synové Asser: Jemna, Jesua, Jesui, Beria, a Serach sestra jejich.
౩౦ఆషేరు కొడుకులు ఎవరంటే ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా అనేవాళ్ళు. వీళ్ళ సోదరి పేరు శెరహు.
31 Synové pak Beriovi: Heber, Melchiel. Onť jest otec Birzavitův.
౩౧బెరీయా కొడుకులు హెబెరూ, మల్కీయేలూ. మల్కీయేలు కొడుకు బిర్జాయీతు.
32 Heber pak zplodil Jafleta, Somera, Chotama, a Suu sestru jejich.
౩౨హెబెరు కొడుకులు యప్లేటు, షోమేరూ, హోతాములు. వీళ్ళ సోదరి పేరు షూయా.
33 Synové pak Jafletovi: Pasach, Bimhal, a Asvat. Ti jsou synové Jafletovi.
౩౩యప్లేటు కొడుకులు ఎవరంటే పాసకు, బింహాలు, అష్వాతు. వీళ్ళు యప్లేటు కొడుకులు.
34 Synové pak Somerovi: Achi, Rohaga, Jehubba a Aram.
౩౪అతని సోదరుడైన షోమేరుకు అహీ, రోగా, యెహుబ్బా, అరాము అనే కొడుకులున్నారు.
35 Synové pak Helema, bratra jeho: Zofach, Jimna, Seles a Amal.
౩౫అతని సోదరుడైన హేలెముకు జోపహు, ఇమ్నా, షెలెశు, ఆమాలు అనే కొడుకులున్నారు.
36 Synové Zofachovi: Suach, Charnefer, Sual, Beri a Jimra,
౩౬జోపహు కొడుకులు సూయా, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,
37 Bezer, Hod, Samma, Silsa, Jitran a Béra.
౩౭బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేరు అనేవాళ్ళు.
38 Synové Jeterovi: Jefunne, Fispa a Ara.
౩౮ఎతెరు కొడుకులు యెఫున్నె, పిస్పా, అరా.
39 Synové pak Ulla: Arach, Haniel a Riziáš.
౩౯ఉల్లా కొడుకులు ఆరహు, హన్నియేలు, రిజెయాలు.
40 Všickni ti synové Asser, knížata domů otcovských, vybraní, udatní, přední z knížat, kteříž vyčteni do vojska k bitvě, v počtu šest a dvadceti tisíc mužů.
౪౦వీళ్ళంతా ఆషేరు సంతానం. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు ప్రఖ్యాతి చెందిన శూరులుగానూ, నాయకుల్లో ప్రముఖులుగానూ ఉన్నారు. ఈ వంశానికి చెందిన వాళ్ళలో ఇరవై ఆరు వేలమంది యుద్ధానికి వెళ్లదగిన వాళ్ళున్నారు.