< Psalmi 47 >
1 Zborovođi. Sinova Korahovih. Psalam. Narodi svi, plješćite rukama, kličite Bogu glasom radosnim.
౧ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. జాతులన్నీ చప్పట్లు కొట్టండి. విజయోత్సాహంతో ఆనంద ధ్వనులు చేయండి.
2 Jer Jahve je to - svevišnji, strašan, kralj velik nad zemljom svom.
౨అత్యున్నతుడైన యెహోవా భయంకరమైనవాడు. భూమి అంతటికీ ఆయన మహారాజు.
3 Narode je nama podložio, pogane stavio pod noge naše,
౩ఆయన జాతులను మనకు లోబరుస్తాడు. దేశాలను మన కాళ్ళ కిందకు తీసుకువస్తాడు.
4 baštinu nam odabrao - ponos Jakova, svoga ljubimca.
౪మన వారసత్వాన్ని ఎంపిక చేస్తాడు. అది తాను ప్రేమించిన యాకోబు కీర్తి ప్రతిష్టల వారసత్వం.
5 Uzlazi Bog uz klicanje, Jahve uza zvuke trublje.
౫దేవుడు గొప్ప ధ్వనితో ఆరోహణం అయ్యాడు. బాకా శబ్దంతో యెహోవా ఆరోహణం అయ్యాడు.
6 Pjevajte Bogu, pjevajte, pjevajte kralju našemu, pjevajte!
౬దేవునికి స్తుతులు పాడండి. స్తుతించండి. మన రాజుకు స్తుతులు పాడండి, స్తుతులు పాడండి.
7 Jer on je kralj nad zemljom svom, pjevajte Bogu, pjevači vrsni!
౭ఎందుకంటే మన దేవుడు భూమి అంతటికీ రాజు. అవగాహనతో స్తుతులు పాడండి.
8 Bog kraljuje nad narodima, stoluje Bog na svetom prijestolju.
౮దేవుడు అన్ని జాతులల పైనా పరిపాలన చేస్తున్నాడు. ఆయన తన పవిత్ర సింహాసనంపై కూర్చుని ఉన్నాడు.
9 Prvaci se pribiru poganski k narodu Boga Abrahamova. Božji su svi vlastodršci zemlje, nad svima on je uzvišen.
౯జాతుల అధిపతులు అబ్రాహము దేవుని ప్రజలతో కూడి ఉన్నారు. భూమిపై రక్షణ డాళ్ళు దేవునికే చెందుతాయి. భూమిపై అత్యున్నత స్థానం ఆయనదే.