< Psalmi 24 >

1 Psalam. Davidov. Jahvina je zemlja i sve na njoj, svijet i svi koji na njemu žive.
దావీదు కీర్తన. భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.
2 On ga na morima utemelji i na rijekama učvrsti.
ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.
3 Tko će uzići na Goru Jahvinu, tko će stajati na svetom mjestu njegovu?
యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు?
4 Onaj u koga su ruke čiste i srce nedužno: duša mu se ne predaje ispraznosti, i ne kune se varavo.
అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.
5 On blagoslov prima od Jahve i nagradu od Boga, Spasitelja svoga.
అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు.
6 Takav je naraštaj onih koji traže njega, koji traže lice Boga Jakovljeva.
ఆయనను కోరుకున్న తరం, యాకోబు దేవుని సన్నిధిని కోరుకున్నవాళ్ళు అలాంటివాళ్ళే. (సెలా)
7 “Podignite, vrata, nadvratnike svoje, dižite se, dveri vječne, da uniđe Kralj slave!”
మహిమ కలిగిన రాజు లోపలి వచ్చేలా, ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి.
8 “Tko je taj Kralj slave?” “Jahve silan i junačan, Jahve silan u boju!”
మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యాలు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా.
9 “Podignite, vrata, nadvratnike svoje dižite se, dveri vječne, da uniđe Kralj slave!”
మహిమగల రాజు లోపలికి వచ్చేలా ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి.
10 “Tko je taj Kralj slave?” “Jahve nad Vojskama - on je Kralj slave!”
౧౦మహిమగల ఈ రాజు ఎవరు? దూతల సైన్యాలకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. (సెలా)

< Psalmi 24 >