< Psalmi 129 >
1 Hodočasnička pjesma. “Mnogo su me od mladosti tlačili” - neka rekne sad Izrael!
౧యాత్రల కీర్తన ఇశ్రాయేలు ఇలా చెప్పాలి. నా యవ్వన ప్రాయం నుంచి శత్రువులు నాపై దాడి చేశారు.
2 “Mnogo su me od mladosti tlačili, ali me ne svladaše.
౨నా బాల్యం నుండి నాపై యుద్ధం చేస్తూ వచ్చారు. అయినా వాళ్ళు నన్ను ఓడించలేకపోయారు.
3 Po leđima su mojim orači orali, duge brazde povlačili.
౩భూమిని దున్నినట్టు వాళ్ళు నా వీపును దున్నారు. నాకు నాగటి చాళ్ళవంటి గాయాలు చేశారు.
4 Al' Jahve pravedni isiječe užeta zlikovcima!”
౪యెహోవా న్యాయవంతుడు. దుర్మార్గుల తాళ్ళను ఆయన తెంపివేశాడు.
5 Nek' se postide i uzmaknu svi koji mrze Sion!
౫సీయోనును ద్వేషించే వాళ్ళంతా సిగ్గుపడి, వెనుకడుగు వేస్తారు గాక.
6 Nek' budu k'o trava na krovu što povene prije nego je počupaju.
౬వాళ్ళు ఇంటికప్పుపై మొలకెత్తే గడ్డిమొక్కలవలె ఉంటారు గాక. అవి ఎదిగీ ఎదగక ముందే వాడిపోతాయి.
7 Žetelac njome ne napuni ruku ni naručje onaj koji veže snopove.
౭కోసేవాడి గుప్పిలిలోకైనా ఆ గడ్డి చాలదు. పనలు కట్టేవాడు దానితో తన ఒడిని నింపుకోడానికి అది చాలదు.
8 A prolaznici nek' ne reknu: “Blagoslov Jahvin nad vama! Blagoslivljamo vas imenom Jahvinim!”
౮ఆ దారిన పోయే వాళ్ళు, యెహోవా దీవెన మీపై ఉండు గాక, యెహోవా నామంలో మిమ్మల్ని దీవిస్తున్నాము అనరు గాక.