< Psalmi 115 >
1 Ne nama, o Jahve, ne nama, već svom imenu slavu daj zbog ljubavi i vjernosti svoje.
౧దావీదు కీర్తన మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ నిబంధన విశ్వాస్యత, అధారపడ దగిన నీ గుణాన్ని బట్టి నీ నామానికే మహిమ కలుగు గాక.
2 Zašto da govore pogani: “TÓa gdje je Bog njihov?”
౨వారి దేవుడు ఎక్కడ, అని అన్యజాతులు ఎందుకు చెప్పుకుంటున్నారు?
3 Naš je Bog na nebesima, sve što mu se svidi to učini.
౩మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు. తన ఇష్టప్రకారం సమస్తాన్నీ ఆయన చేస్తున్నాడు
4 Idoli su njihovi srebro i zlato, ljudskih su ruku djelo.
౪వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు.
5 Usta imaju, a ne govore, oči imaju, a ne vide.
౫వాటికి నోరుండి కూడా పలకవు. కళ్ళుండి కూడా చూడవు.
6 Uši imaju, a ne čuju, nosnice, a ne mirišu.
౬చెవులుండి కూడా వినవు. ముక్కులుండి కూడా వాసన చూడవు.
7 Ruke imaju, a ne hvataju, noge imaju, a ne hodaju; glas im iz grla ne izlazi.
౭చేతులుండి కూడా ముట్టుకోవు. పాదాలుండి కూడా నడవవు. గొంతుకతో మాటలాడవు.
8 Takvi su i oni koji ih napraviše i svi koji se u njih uzdaju.
౮వాటిని చేసే వారు, వాటిపై నమ్మిక ఉంచే వారు వాటివంటి వారే.
9 Dome Izraelov, u Jahvu se uzdaj! - On je štit i pomoćnik njihov.
౯ఇశ్రాయేలీయులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి కవచం.
10 Dome Aronov, u Jahvu se uzdaj! - On je štit i pomoćnik njihov.
౧౦అహరోను వంశస్థులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారి కవచం.
11 Štovatelji Jahvini, u Jahvu se uzdajte! - On je štit i pomoćnik njihov.
౧౧యెహోవా పట్ల భయభక్తులున్న వారంతా యెహోవాపై నమ్మిక ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి డాలు.
12 Jahve će se nas spomenut' i on će nas blagoslovit': blagoslovit će dom Izraelov, blagoslovit će dom Aronov,
౧౨యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులనాశీర్వదిస్తాడు.
13 blagoslovit će one koji se Jahve boje - i male i velike.
౧౩పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు.
14 Umnožio vas Jahve, vas i vaše sinove!
౧౪యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు.
15 Blagoslovio vas Jahve koji stvori nebo i zemlju!
౧౫భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా చేత మీరు దీవెన పొందారు.
16 Nebo je nebo Jahvino, a zemlju dade sinovima čovječjim.
౧౬ఆకాశాలు యెహోవా వశం. భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు.
17 Ne, Jahvu mrtvi ne hvale, nitko od onih što siđu u Podzemlje.
౧౭మృతులు, మౌనస్థితిలోకి దిగిపోయే వారు యెహోవాను స్తుతించరు.
18 Mi živi, mi Jahvu slavimo sada i dovijeka. Aleluja.
౧౮మేమైతే ఇప్పటినుండి నిత్యం యెహోవాను స్తుతిస్తాము. యెహోవాను స్తుతించండి.