< Mudre Izreke 2 >

1 Sine moj, ako primiš moje riječi i pohraniš u sebi moje zapovijedi,
కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది.
2 i uhom svojim osluhneš mudrost i obratiš svoje srce razboru;
జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు,
3 jest, ako prizoveš razum i zavapiš za razborom;
తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు,
4 ako ga potražiš kao srebro i tragaš za njim kao za skrivenim blagom -
పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు,
5 tada ćeš shvatiti strah Gospodnji i naći ćeš Božje znanje.
యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.
6 Jer Jahve daje mudrost, iz njegovih usta dolazi znanje i razboritost.
యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి.
7 On pravednicima pruža svoju pomoć, štit je onih koji hode u bezazlenosti.
యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన రక్షణ కలుగజేస్తాడు.
8 Jer on štiti staze pravde i čuva pute svojih pobožnika.
న్యాయ ప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు.
9 Tada ćeš shvatiti pravdu, pravicu, pravednost i sve staze dobra,
అప్పుడు నీతి, న్యాయం, యథార్థత అనే మంచి మార్గాలు నువ్వు తెలుసుకుంటావు.
10 jer će mudrost ući u tvoje srce i spoznaja će obradovati tvoju dušu.
౧౦జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది.
11 Oprez će paziti na te i razboritost će te čuvati:
౧౧తెలివితేటలు నిన్ను కాపాడతాయి. వివేకం నీకు కాపలా కాస్తుంది.
12 da te izbavi od zla puta, od varava čovjeka,
౧౨అది దుష్టులు నడిచే మార్గాల నుండి, మూర్ఖపు మాటలు మాట్లాడే వారి బారి నుండి నిన్ను కాపాడుతుంది.
13 od onih koji ostavljaju staze poštenja te idu mračnim putovima;
౧౩దుష్టులు చీకటి మార్గాల్లో నడవడం కోసం యథార్థమైన మార్గాలను విడిచిపెడతారు.
14 koji se vesele čineći zlo i likuju u opačinama zloće;
౧౪కీడు చేసేవాళ్ళు తమ పనుల వల్ల సంతోషిస్తారు. తీవ్రమైన మూర్ఖత్వంతో ప్రవర్తించే వాళ్ళను చూసి ఆనందిస్తారు.
15 kojih su staze krive i koji su opaki na svojim putovima;
౧౫తమ దుష్ట మార్గాలగుండా పయనిస్తారు. వాళ్ళు కపటంతో ఉంటారు.
16 da te izbavi od preljubnice i od tuđinke koja laska riječima;
౧౬వ్యభిచారి వలలో పడకుండా, తియ్యగా మాట్లాడి మోసపుచ్చే వేశ్య బారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.
17 koja ostavlja prijatelja svoje mladosti i zaboravlja zavjet svoga Boga
౧౭అలాంటి స్త్రీ తన యవ్వనకాలంలో తన భర్తను విడిచిపెట్టి తన దేవుని నిబంధన పెడచెవిన పెడుతుంది.
18 jer joj kuća tone u smrt i njezini putovi vode mrtvima.
౧౮ఆ స్త్రీ ఇల్లు మరణానికి నడిపిస్తుంది. ఆ స్త్రీ నడిచే మార్గం శవాల దగ్గరికి చేరుతుంది.
19 Tko god zalazi k njoj ne vraća se nikad i ne nalazi više putove života.
౧౯ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరిగిరారు. వాళ్ళు జీవమార్గం చేరుకోలేరు.
20 Zato idi putem čestitih i drži se staza pravedničkih!
౨౦నేను చెప్పే మాటలు విని ఆ విధంగా నడుచుకుంటే నువ్వు యథార్థవంతులు నడిచే మార్గంలో నడుచుకుంటావు. నీతిమంతుల ప్రవర్తన అనుసరిస్తావు.
21 Jer samo će pravedni nastavati zemlju i bezazleni će ostati na njoj.
౨౧నిజాయితీపరులు దేశంలో కాపురం ఉంటారు. సత్యవర్తనులు దేశంలో స్థిరంగా ఉంటారు.
22 A opake će zbrisati sa zemlje i bogohulnike iščupati iz nje.
౨౨చెడ్డ పనులు చేసేవారు నిర్మూలం అవుతారు. నమ్మకద్రోహులు దేశంలో లేకుండా పోతారు.

< Mudre Izreke 2 >