< Marko 1 >

1 Početak Evanđelja Isusa Krista Sina Božjega.
దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం.
2 Pisano je u Izaiji proroku: Evo šaljem glasnika svoga pred licem tvojim da ti pripravi put.
యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు.
3 Glas viče u pustinji: Pripravite put Gospodinu, poravnite mu staze!
‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి’ అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.”
4 Tako se pojavi Ivan: krstio je u pustinji i propovijedao krst obraćenja na otpuštenje grijeha.
యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు.
5 Grnula k njemu sva judejska zemlja i svi Jeruzalemci: primali su od njega krštenje u rijeci Jordanu ispovijedajući svoje grijehe.
యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు.
6 Ivan bijaše odjeven u devinu dlaku, s kožnatim pojasom oko bokova; hranio se skakavcima i divljim medom.
యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం.
7 I propovijedao je: “Nakon mene dolazi jači od mene. Ja nisam dostojan sagnuti se i odriješiti mu remenje na obući.
యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు.
8 Ja vas krstim vodom, a on će vas krstiti Duhom Svetim.”
“నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.
9 Onih dana dođe Isus iz Nazareta galilejskoga i primi u Jordanu krštenje od Ivana.
యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు.
10 I odmah, čim izađe iz vode, ugleda otvorena nebesa i Duha poput goluba gdje silazi na nj,
౧౦యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు.
11 a glas se zaori s nebesa: Ti si Sin moj, Ljubljeni! U tebi mi sva milina!
౧౧అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.”
12 I odmah ga Duh nagna u pustinju.
౧౨వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు.
13 I bijaše u pustinji četrdeset dana, gdje ga je iskušavao Sotona; bijaše sa zvijerima, a anđeli mu služahu.
౧౩ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.
14 A pošto Ivan bijaše predan, otiđe Isus u Galileju. Propovijedao je evanđelje Božje:
౧౪యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ,
15 “Ispunilo se vrijeme, približilo se kraljevstvo Božje! Obratite se i vjerujte evanđelju!”
౧౫“కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు.
16 I prolazeći uz Galilejsko more, ugleda Šimuna i Andriju, brata Šimunova, gdje ribare na moru; bijahu ribari.
౧౬ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు.
17 I reče im Isus: “Hajdete za mnom i učinit ću vas ribarima ljudi!”
౧౭యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు.
18 Oni odmah ostaviše mreže i pođoše za njim.
౧౮వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
19 Pošavši malo naprijed, ugleda Jakova Zebedejeva i njegova brata Ivana: u lađi su krpali mreže.
౧౯ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు.
20 Odmah pozva i njih. Oni ostave oca Zebedeja u lađi s nadničarima i otiđu za njim.
౨౦వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.
21 I stignu u Kafarnaum. Odmah u subotu uđe on u sinagogu i poče naučavati.
౨౧తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు.
22 Bijahu zaneseni njegovim naukom. Ta učio ih je kao onaj koji ima vlast, a ne kao pismoznanci.
౨౨ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు.
23 A u njihovoj se sinagogi upravo zatekao čovjek opsjednut nečistim duhom. On povika:
౨౩అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు.
24 “Što ti imaš s nama, Isuse Nazarećanine? Došao si da nas uništiš? Znam tko si: Svetac Božji!”
౨౪వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు.
25 Isus mu zaprijeti: “Umukni i iziđi iz njega!”
౨౫యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు.
26 Nato nečisti duh potrese njime pa povika iz svega glasa i iziđe iz njega.
౨౬ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
27 Svi se zaprepastiše te se zapitkivahu: “Što li je ovo? Nova li i snažna nauka! Pa i samim nečistim dusima zapovijeda, i pokoravaju mu se.”
౨౭ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు.
28 I pročulo se odmah o njemu posvuda, po svoj okolici galilejskoj.
౨౮ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.
29 I odmah pošto iziđoše iz sinagoge, uđe s Jakovom i Ivanom u kuću Šimunovu i Andrijinu.
౨౯సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు.
30 A punica Šimunova ležala u ognjici. I odmah mu kažu za nju.
౩౦సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు.
31 On pristupi, prihvati je za ruku i podiže. I pusti je ognjica. I posluživaše im.
౩౧ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది.
32 Uvečer, kad sunce zađe, donošahu preda nj sve bolesne i opsjednute.
౩౨సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు.
33 I sav je grad nagrnuo k vratima.
౩౩ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు.
34 I on ozdravi bolesnike - a bijahu mnogi i razne im bolesti - i zloduhe mnoge izagna. I ne dopusti zlodusima govoriti jer su ga znali.
౩౪రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
35 Rano ujutro, još za mraka, ustane, iziđe i povuče se na samotno mjesto i ondje se moljaše.
౩౫ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు.
36 Potražiše ga Šimun i njegovi drugovi.
౩౬సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు.
37 Kad ga nađoše, rekoše mu: “Svi te traže.”
౩౭ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు.
38 Kaže im: “Hajdemo drugamo, u obližnja mjesta, da i ondje propovijedam! Ta zato sam došao.”
౩౮ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు.
39 I prođe svom Galilejom: propovijedao je u njihovim sinagogama i zloduhe izgonio.
౩౯ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
40 I dođe k njemu neki gubavac, klekne i zamoli: “Ako hoćeš, možeš me očistiti!”
౪౦ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు.
41 Isus ganut pruži ruku, dotače ga se pa će mu: “Hoću, budi čist!”
౪౧యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు.
42 I odmah nesta s njega gube i očisti se.
౪౨వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.
43 Isus se otrese na nj i odmah ga otpravi
౪౩ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి,
44 riječima: “Pazi, nikomu ništa ne kazuj, nego idi, pokaži se svećeniku i prinesi za svoje očišćenje što propisa Mojsije, njima za svjedočanstvo.”
౪౪“నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు.
45 Ali čim iziđe, stane on uvelike pripovijedati i razglašavati događaj tako da Isus više nije mogao javno ući u grad, nego se zadržavao vani na samotnim mjestima. I dolažahu k njemu odasvud.
౪౫కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.

< Marko 1 >