< Suci 1 >

1 Poslije smrti Jošuine upitaše Izraelci Jahvu: “Tko će od nas prvi poći na Kanaance da se protiv njih bori?”
యెహోషువ చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చెయ్యడానికి తమలో ఎవరు ముందుగా వాళ్ళ మీదికి వెళ్ళాలో యెహోవా తమకు తెలపాలని ప్రార్థన చేశారు.
2 A Jahve odgovori: “Neka Juda prvi pođe; u njegove ruke stavljam zemlju.”
యెహోవా “ఆ దేశాన్ని యూదాజాతి వారికి ఇచ్చాను, వాళ్ళే ముందు వెళ్ళాలి” అని చెప్పాడు.
3 Tada Juda reče svome bratu Šimunu: “Pođi sa mnom u zemlju koja mi je dosuđena u baštinu; borit ćemo se protiv Kanaanaca, a potom ću se ja uza te boriti na tvojoj zemlji.” I Šimun ode s njim.
అప్పుడు యూదా జాతి వాళ్ళు తమ సహోదరులైన షిమ్యోను జాతివారితో “మనం కనానీయులతో యుద్ధం చెయ్యడానికి మా వాటా భూమిలోకి మాతో కలిసి రండి, మేము కూడా మీతో కలిసి మీ వాటా భూమిలోకి వస్తాం” అని చెప్పారు. షిమ్యోనీయులు వాళ్ళతో కలిసి వెళ్ళారు.
4 Ode Juda i Jahve im predade u ruke Kanaance i Perižane te pobiše u Bezeku deset tisuća ljudi.
కనానీయుల మీదికి యూదావారు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీయులను వారికి అప్పగించాడు గనుక వాళ్ళు బెజెకు ప్రాంతంలో పదివేలమందిని హతం చేశారు.
5 U Bezeku zatekoše Adoni-Sedeka, udariše na nj i poraziše Kanaance i Perižane.
వాళ్ళు బెజెకు దగ్గర అదోనీ రాజు బెజెకును చూసి అతనితో యుద్ధం చేసి కనానీయులను, పెరిజ్జీయులను, హతం చేశారు.
6 Kad je Adoni-Sedek nagnuo u bijeg, gonili su ga, uhvatili ga i odsjekli mu palce na rukama i nogama.
అదోనీ బెజెకు పారిపోయినప్పుడు వాళ్ళు అతణ్ణి తరిమి పట్టుకుని అతని కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోసేశారు
7 Tada reče Adoni-Sedek: “Sedamdeset kraljeva odsječenih palaca na rukama i na nogama kupilo je mrvice pod mojim stolom. Kako sam činio, tako mi Bog vraća.” Odveli su ga u Jeruzalem i ondje je umro.
అప్పుడు అదోనీ బెజెకు “ఇలా కాళ్లు, చేతుల బొటన వేళ్ళు కోసిన డెభ్భైమంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకోనేవాళ్ళు. నేను చేసినదానికి దేవుడు నాకు ప్రతిఫలమిచ్చాడు” అన్నాడు. వాళ్ళు అతణ్ణి యెరూషలేముకు తీసుకొచ్చారు. అతడు అక్కడ చనిపోయాడు.
8 Zatim Judini sinovi udariše na Jeruzalem, osvojiše ga, posjekoše mačem žitelje i spališe grad.
యూదావంశం వారు యెరూషలేముపై కూడా యుద్ధం చేసి దాన్ని పట్టుకుని కొల్లగొట్టి ఆ పట్టణాన్ని కాల్చివేశారు.
9 Poslije toga krenuše Judini sinovi da se bore protiv Kanaanaca koji su živjeli u Gorju, Negebu i u Šefeli.
తరువాత యూదా వంశంవారు అరణ్య ప్రాంతాల్లో, దక్షిణదేశంలో లోయలో ఉన్న కనానీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు.
10 Onda Juda ode na Kanaance koji su živjeli u Hebronu - Hebronu bijaše nekoć ime Kirjat Arba - i ondje potuče Šešaja, Ahimana i Talmaja.
౧౦ఇంకా యూదా వంశం వారు హెబ్రోనులో ఉన్న కనానీయుల మీదికి వెళ్లి, షేషయిని, అహీమానుని, తల్మయిని హతం చేశారు.
11 Odatle krenu na stanovnike Debira, koji se nekoć zvao Kirjat Sefer.
౧౧వారు హెబ్రోనులొ ఉండి దెబీరులో నివాసం ఉంటున్న వాళ్ళ మీదికి యుద్ధానికి వెళ్ళారు. హెబ్రోనుకు అంతకుముందు పేరు కిర్యతర్బా. అక్కడ షేషయి, ఆహీమాను, తల్మయి అనే వాళ్ళని హతమార్చారు. అక్కడినుండి వారు దెబీరులో కాపురం ఉంటున్నవారిని హతమార్చారు. దెబీరును పూర్వం కిర్యత్ సేఫెరు అనే వారు.
12 Tada reče Kaleb: “Tko pokori i zauzme Kirjat Sefer, dat ću mu svoju kćer Aksu za ženu.”
౧౨“కిర్యత్ సేఫెరును కొల్లగొట్టిన వాడికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను” అని కాలేబు ప్రకటించినప్పుడు
13 Zauze ga Otniel, sin Kenaza, mlađeg brata Kalebova, i Kaleb mu dade svoju kćer Aksu za ženu.
౧౩కాలేబు తమ్ముడు కనజు కొడుకు ఒత్నీయేలు దాన్ని పట్టుకున్నాడు గనుక కాలేబు తన కుమార్తె అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసాడు.
14 Kad je prišla mužu, on je nagovori da u svoga oca ište polje. Siđe ona s magarca, a Kaleb je upita: “Što hoćeš?”
౧౪ఆమె తన భర్త ఇంటికి వచ్చాక తన తండ్రిని కొంత పొలం అడగమని అతణ్ణి ప్రేరేపించింది. ఆమె గాడిద దిగినప్పుడు కాలేబు “నీకేం కావాలి?” అని అడిగాడు.
15 Ona mu odgovori: “Daj mi blagoslov! Kad si mi dao kraj u Negebu, daj mi onda i koji izvor vode.” I Kaleb joj dade Gornje i Donje izvore.
౧౫అందుకు ఆమె “నాకు దీవెన ఇవ్వు. నాకు దక్షిణ భూమి ఇచ్చావు, నీటి మడుగులు కూడా నాకు ఇవ్వు” అంది. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులు, పల్లపు మడుగులు ఇచ్చాడు.
16 Sinovi Hobaba Kenijca, tasta Mojsijeva, odoše iz Palmova grada s Judinim sinovima u Judinu pustinju, koja je u Negebu, na jugu od Arada. Tu se nastaniše među Amalečanima.
౧౬మోషే మామ అయిన కేయిను వారసులు యూదావంశం వారితో కలిసి ఖర్జూరచెట్ల పట్టణంలోనుంచి అరాదుకు దక్షిణంవైపు ఉన్న యూదా అరణ్యానికి వెళ్లి అక్కడ ఆ జనంతో కలిసి నివసించారు.
17 Potom ode Juda s bratom Šimunom i pobiše Kanaance koji su živjeli u Sefatu i grad izručiše “heremu”, prokletstvu. Zbog toga se grad prozva Horma.
౧౭యూదావంశం వారు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కలిసి వెళ్లి జెఫతులో ఉంటున్న కనానీయులను హతం చేసి ఆ పట్టణాన్ని నాశనం చేసి, ఆ పట్టణానికి హోర్మా అనే పేరు పెట్టారు.
18 Ali Juda nije uspio zauzeti Gaze s njenim područjem, ni Aškelona s njegovim područjem, ni Ekrona s njegovim područjem.
౧౮యూదావంశం వారు గాజాను, దాని ప్రాంతాన్ని, అష్కెలోనును దాని ప్రాంతాన్ని, ఎక్రోనును దాని ప్రాంతాన్ని ఆక్రమించారు.
19 Jahve bijaše s njim te on osvoji gorje, ali ne mogaše potjerati onih u nizini jer imahu željezna kola.
౧౯యెహోవా యూదావంశం వారికి తోడుగా ఉన్నాడు కనుక వాళ్ళు కొండ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మైదాన ప్రాంతాల్లో ఉంటున్నవాళ్లకు ఇనుప రథాలు ఉన్న కారణంగా వాళ్ళను తరిమివేయలేక పోయారు.
20 Kao što bijaše odredio Mojsije, dadoše Hebron Kalebu, koji iz njega otjera tri sina Anakova.
౨౦మోషే మాట ప్రకారం హెబ్రోనును కాలేబుకు ఇచ్చినప్పుడు, అతడు ముగ్గురు అనాకు వంశీకులను అక్కడనుంచి పారద్రోలి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
21 A Benjaminovi sinovi ne uspješe otjerati Jebusejaca koji su živjeli u Jeruzalemu i tako Jebusejci ostadoše u Jeruzalemu s Benjaminovim sinovima do dana današnjega.
౨౧కాని, బెన్యామీనీయులు యెరూషలేములో ఉంటున్న యెబూసీయులను వెళ్లగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో నేటివరకూ యెరూషలేములో కలిసి నివసిస్తున్నారు.
22 Krenu i pleme Josipovo na Betel i Jahve bijaše s njima.
౨౨యోసేపు సంతతివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.
23 I pleme Josipovo uze izviđati Betel. Grad se nekoć zvao Luz.
౨౩పూర్వకాలంలో లూజు అనే పేరుగల బేతేలును వేగు చూడడానికి యోసేపు గోత్రికులు దూతలను పంపినప్పుడు
24 Uhode opaziše čovjeka gdje izlazi iz grada i rekoše mu: “Pokaži nam kuda se može u grad, pa ćemo ti biti milostivi.”
౨౪ఆ గూఢచారులు, ఆ పట్టణంలోనుంచి ఒకడు రావడం చూసి “దయచేసి ఈ పట్టణంలోకి వెళ్ళే దారి మాకు చూపిస్తే మేము నీకు ఉపకారం చేస్తాం” అని చెప్పారు.
25 On im pokaza kuda mogu u grad. I sve u gradu isjekoše mačem, a onoga čovjeka sa svom njegovom obitelji pustiše da ode.
౨౫అతడు ఆ పట్టణంలోకి వెళ్ళే దారి వాళ్లకు చూపించినప్పుడు, వాళ్ళు ఆ పట్టణంలోని వారిని కత్తివాత హతం చేశారు. అయితే, ఆ వ్యక్తిని, అతని కుటుంబంలోని వాళ్ళందరినీ వదిలేశారు.
26 Čovjek je otišao u zemlju Hetita i ondje sagradio grad i prozvao ga Luz. Tako se zove još i danas.
౨౬ఆ వ్యక్తి, హిత్తీయ దేశానికి వెళ్లి ఒక పట్టణం కట్టించి దానికి లూజు అనే పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ దాని పేరు అదే.
27 Manaše nije osvojio Bet-Šeana i njegovih sela ni Tanaka i njegovih sela. Nije potjerao ni stanovnika iz Dora i njegovih sela, ni stanovnika Jibleama i njegovih sela, ni stanovnika Megida i njegovih sela. Tako su Kanaanci ostali i živjeli u toj zemlji.
౨౭మనష్షె గోత్రంవారు బేత్షెయానును, తయినాకును, దోరును, ఇబ్లెయామును, మెగిద్దో పట్టణాలను, వాటి పల్లెలను వశం చేసుకోలేదు. ఎందుకంటే కనానీయులు ఆ ప్రదేశంలోనే ఉండాలని తెగించి పోరాడారు.
28 Kad je Izrael ojačao, nametnuo je Kanaancima tlaku, ali ih nije mogao otjerati.
౨౮ఇశ్రాయేలీయులు బలం పుంజుకున్న తరువాత కనానీయులతో వెట్టిపనులు చేయించుకున్నారు గాని వాళ్ళను పూర్తిగా వెళ్ళగొట్టలేదు.
29 Ni Efrajim nije otjerao Kanaanaca koji su živjeli u Gezeru, tako te su Kanaanci tu živjeli među njima.
౨౯ఎఫ్రాయిమీయులు గెజెరులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు. గెజెరులో కనానీయులు వాళ్ళ మధ్యే నివాసం ఉన్నారు.
30 Zebulun nije otjerao stanovnika Kitrona ni stanovnika Nahalola. Tako su Kanaanci ostali usred Zebulunovih sinova, ali im bijaše nametnuta tlaka.
౩౦జెబూలూనీయులు కిత్రోనులో ఉన్నవాళ్ళను, నహలోలు నివాసులను వెళ్లగొట్ట లేదు. కనానీయులు వారి మధ్యే ఉంటూ వాళ్లకు వెట్టిపనులు చేసేవాళ్ళుగా ఉన్నారు.
31 Ni Ašer nije otjerao stanovnika Akona, ni stanovnika Sidona, ni onih iz Mahalaba, Akziba, Helbe, Afika i Rehoba.
౩౧ఆషేరీయులు అక్కోలో ఉన్నవాళ్ళను, సీదోనులో ఉన్నవాళ్ళను, అహ్లాబు వారిని, అక్జీబు వారిని, హెల్బావారిని, అఫెకు వారిని, రెహోబు వారిని,
32 Ašerovci su ostali tako među Kanaancima, stanovnicima te zemlje, jer ih nisu otjerali.
౩౨ఆ ప్రదేశంలో ఉన్న కనానీయులను వెళ్లగొట్టకుండా వాళ్ళ మధ్యనే నివాసం ఉండనిచ్చారు. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని బేతనాతు వారిని వెళ్లగొట్ట లేదు,
33 Naftali nije otjerao stanovnika Bet-Šemeša i Bet-Anata, nego je živio među Kanaancima koji su nastavali tu zemlju, ali je stanovnicima Bet-Šemeša i Bet-Anata nametnuta tlaka.
౩౩బేత్షెమెషులో ఉన్న వాళ్ళ చేత, బేతనాతులో ఉన్నవాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకున్నారు.
34 Amorejci su potisnuli Danove sinove u goru i nisu ih puštali da siđu u ravnicu.
౩౪అమోరీయులు దానీయులను మైదాన ప్రాంతానికి రానివ్వకుండా కొండ ప్రదేశానికి వెళ్ళగొట్టారు.
35 Amorejci su se zadržali u Har-Heresu, Ajalonu i Šaalbimu, ali kad je ruka Josipova doma ojačala, bila im je nametnuta tlaka.
౩౫అమోరీయులు హెరేసు కొండలో అయ్యాలోనులో, షయల్బీములో నివాసం ఉండాలని గట్టి పట్టు పట్టినప్పుడు యోసేపు గోత్రికులు బలవంతులు గనుక వాళ్ళ చేత వెట్టిపనులు చేయించుకున్నారు.
36 Područje Edomaca pruža se od Akrabimskog uspona do Stijene pa naviše.
౩౬అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకుని హస్సెలా వరకూ వ్యాపించింది.

< Suci 1 >