< Job 11 >
1 Sofar iz Naama progovori tad i reče:
౧అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు ఇచ్చాడు,
2 “Zar na riječi mnoge da se ne odvrati? Zar će se brbljavac još i opravdati?
౨ప్రవాహంలాగా బయటకు వస్తున్న నీ మాటలకు జవాబు చెప్పాలి గదా. వదరుబోతును నిర్దోషి అని ఎంచడం జరుగుతుందా?
3 Zar će tvoje trice ušutkati ljude, zar će ruganje ostat' neizrugano?
౩నీ పొగరుబోతు మాటలు విని మనుషులు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండాలా? నీ మాటలను బట్టి ఎవ్వరూ నిన్ను మందలించకూడదా?
4 Rekao si: 'Nauk moj je neporočan, u očima tvojim čist sam i bez ljage.'
౪నువ్వు దేవునితో “నేను అనుసరించేది సక్రమం, నీ దృష్టిలో నేను పవిత్రంగా ఉన్నాను” అంటున్నావు గదా.
5 Ali kada bi Bog htio progovorit' i otvorit usta da ti odgovori
౫నువ్వు దేవునితో మాట్లాడితే మంచిది. ఆయనే నీతో వాదులాటకు దిగితే బాగుంటుంది.
6 kada bi ti tajne mudrosti otkrio koje um nijedan ne može doumit', znao bi da ti za grijehe račun ište.
౬ఆయనే నీకు జ్ఞాన రహస్యాలు తెలియజేయాలి. ఆయన జ్ఞాన పూర్ణుడు. నువ్వు చేసిన దోషాలకు తగినదాని కంటే తక్కువ సంజాయిషీయే దేవుడు నీ నుండి కోరుతున్నాడని తెలుసుకో.
7 Možeš li dubine Božje proniknuti, dokučiti savršenstvo Svesilnoga?
౭దేవుని నిగూఢ సత్యాలు నువ్వు తెలుసుకోగలవా? సర్వశక్తుడైన దేవుణ్ణి గూర్చిన పరిపూర్ణ జ్ఞానం నీకు ఉంటుందా?
8 Od neba je više: što još da učiniš? Od Šeola dublje: što još da mudruješ? (Sheol )
౮నువ్వు ఏమి చేయగలవు? అది ఆకాశ విశాలం కంటే ఉన్నతమైనది. నీకేం తెలుసు? అది పాతాళంకంటే లోతుగా ఉన్నది. (Sheol )
9 Duže je od zemlje - šire je od mora!
౯దాని కొలత భూమికంటే పొడవు, దాని వెడల్పు సముద్రంకన్నా విశాలం.
10 Ako se povuče, ako te pograbi, ako na sud preda, tko će mu braniti?
౧౦ఆయన సంచారం చేస్తూ ఒకణ్ణి బంధించి, తీర్పులో విచారణ జరిగిస్తే ఆయనకు ఎదురు చెప్పగలిగేవాడు ఎవరు?
11 Jer on u čovjeku prozire prijevaru, vidi opačinu ako i ne gleda.
౧౧పనికిమాలిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. ఎక్కడ పాపం జరుగుతుందో ఆయన ఇట్టే కనిపెట్టగలడు.
12 Čovjek se bezuman obraća k pameti i divlji magarac uzdi se pokori.
౧౨అయితే అడవి గాడిదపిల్ల మనిషిగా పుట్టగలిగితే బుద్ధిహీనుడు తెలివిగలవాడు కావచ్చు.
13 Ako li srce svoje ti uspraviš i ruke svoje pružiš prema njemu,
౧౩నువ్వు నీ హృదయాన్ని సవ్యంగా ఉంచుకో. నీ చేతులు ఆయన వైపు చాపు.
14 ako li zloću iz ruku odbaciš i u šatoru svom ne daš zlu stana,
౧౪నీ చేతిలో చెడుతనం ఉందని గ్రహించి దాన్ని విడిచిపెట్టు. నీ గుడారంలో ఉన్న అక్రమాన్ని పూర్తిగా తొలగించు.
15 čisto ćeš čelo moći tad podići, čvrst ćeš biti i bojati se nećeš.
౧౫అలా చేస్తే నువ్వు తప్పకుండా ఎలాంటి కళంకం లేనివాడవై నిర్భయంగా, స్థిరంగా, సంతోషంగా ఉంటావు.
16 Svojih se kušnja nećeš sjećat' više kao ni vode koja je protekla.
౧౬తప్పకుండా నువ్వు నీ గడ్డుకాలాన్ని మరచిపోతావు. ప్రవహిస్తూ దాటిపోయిన నీటిని గుర్తు పెట్టుకున్నట్టు నువ్వు దాన్ని గుర్తు చేసుకుంటావు.
17 Jasnije će tvoj život sjat' no podne, tmina će se obratit' u svanuće.
౧౭అప్పుడు నీ జీవితం మధ్యాహ్నం ఉండే ఎండ కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. చీకటి ఆవరించినా అది సూర్యోదయపు వెలుగులాగా కనిపిస్తుంది.
18 U uzdanju svom živjet ćeš sigurno i zaštićen počivat ćeš u miru.
౧౮నీ నమ్మకానికి ఒక ఆధారం దొరుకుతుంది. కనుక నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ ఇల్లు మొత్తం కలయజూసి క్షేమంగా విశ్రాంతి తీసుకుంటావు.
19 Kad legneš, nitko te buniti neće; mnogi će tvoju tražiti naklonost.
౧౯ఎవరి భయమూ లేకుండా నువ్వు నిద్రపోతావు. అనేకమంది నీ సహాయం కోరుకుంటారు.
20 A zlikovcima ugasnut će oči, neće im više biti utočišta: izdahnut', bit će jedina im nada.”
౨౦దుర్మార్గుల కంటిచూపు మందగిస్తుంది. వాళ్లకు ఎలాంటి ఆశ్రయమూ దొరకదు. తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.