< Postanak 17 >

1 Kad je Abramu bilo devedeset i devet godina, ukaza mu se Jahve pa mu reče: “Ja sam El Šadaj - Bog Svesilni, Mojim hodi putem i neporočan budi.
అబ్రాముకు తొంభై తొమ్మిది ఏళ్ల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై “నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నా సముఖంలో మెలగుతూ నిందారహితుడిగా ఉండు.
2 A Savez svoj ja sklapam s tobom i silno ću te razmnožiti.”
అప్పుడు నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనను నేను స్థిరం చేస్తాను. నీ సంతానాన్ని అత్యధికంగా విస్తరింపజేస్తాను” అని చెప్పాడు.
3 Abram pade ničice dok mu Bog govoraše dalje:
అబ్రాము సాష్టాంగపడి తన ముఖాన్ని నేలకు వంచుకుని ఉన్నాడు. దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడు, నేను నీతో నిబంధన చేశాను.
4 “A ovo je Savez moj s tobom: postat ćeš ocem mnogim narodima;
నువ్వు అనేక జాతులకు మూల పురుషుడివి అవుతావు.
5 i nećeš se više zvati Abram - već Abraham će ti ime biti, jer naroda mnogih ocem ja te postavljam.
ఇకపైన నీ పేరు అబ్రాము కాదు. నిన్ను అనేక జాతులకు తండ్రిగా నియమిస్తున్నాను కనుక ఇకనుండి నీ పేరు అబ్రాహాము అవుతుంది.
6 Silno ću te rodnim učiniti; narode ću iz tebe izvesti; i kraljevi će od tebe izaći.
నిన్ను అత్యధికంగా ఫలింపజేస్తాను. నీ సంతానం అనేక జాతులుఅయ్యేలా చేస్తాను. నీ సంతానంలో రాజులు జన్మిస్తారు.
7 Savez svoj sklapam između sebe i tebe i tvoga potomstva poslije tebe - Savez svoj za vjekove: ja ću biti Bogom tvojim i tvoga potomstva poslije tebe.
నేను నీకూ నీ తరువాత నీ సంతానానికీ దేవుడిగా ఉండే విధంగా నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నాకూ నీ సంతానానికీ మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.
8 Tebi i tvome potomstvu poslije tebe dajem zemlju u kojoj boraviš kao pridošlica - svu zemlju kanaansku - u vjekovni posjed; a ja ću biti njihov Bog.”
నీకూ నీ తరువాత నీ సంతానానికీ ప్రస్తుతం నువ్వు పరదేశిగా ఉన్న భూమిని, అంటే కనాను దేశాన్నంతా ఇస్తాను. దాన్ని శాశ్వత సంపదగా ఇచ్చి వారికి దేవుడిగా ఉంటాను.”
9 Još reče Bog Abrahamu: “A ti Savez čuvaj moj - ti i tvoje potomstvo poslije tebe u sve vijeke.
దేవుడు మళ్ళీ అబ్రాహాముతో ఇలా చెప్పాడు. “నీ వరకూ నువ్వు నా నిబంధన పాటించాలి. నువ్వు మాత్రమే గాక, నీ తరువాత నీ సంతానం తమ తరతరాల్లో నా నిబంధన పాటించాలి.
10 A ovo je Savez moj s tobom i tvojim potomstvom poslije tebe koji ćeš vršiti: svako muško među vama neka bude obrezano.
౧౦నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నీ సంతానానికీ మధ్య ఉన్న నిబంధన ఇదే. మీలో ప్రతి మగవాడూ సున్నతి పాటించాలి.
11 Obrezujte se, i to neka bude znak Saveza između mene i vas.
౧౧అంటే మీరు మీ మర్మాంగం పైచర్మపు కొన కత్తిరించాలి. అది నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉంటుంది.
12 Svako muško među vama, kroz vaša pokoljenja, kad mu se navrši osam dana, neka bude obrezano; i rob, rođen u vašem domu, i onaj što bude kupljen od stranca, koji ne bude od vaše krvi.
౧౨నీ ప్రజల తరాలన్నిటిలో ప్రతి మగవాడికీ ఎనిమిది రోజున సున్నతి జరగాలి. ఇది నీ ఇంట్లో పుట్టిన వాడికీ, నీ సంతానం కాకుండా మీరు వెల ఇచ్చి ఏ విదేశీయుడి దగ్గరైనా కొనుక్కున్న వాడికీ వర్తిస్తుంది.
13 Da, i rob rođen u tvome domu ili za novac kupljen mora se obrezati! Tako će moj Savez na vašem tijelu ostati vječnim Savezom.
౧౩నీ ఇంట్లో పుట్టిన వారికీ, మీరు వెల పెట్టి కొనుక్కున్న వారికీ తప్పకుండా సున్నతి జరగాలి. ఆ విధంగా నా నిబంధన మీ శరీరంలో శాశ్వత నిబంధన గా ఉంటుంది.
14 Muško koje se ne bi obrezalo neka se odstrani od svoga roda: takav je prekršio moj Savez.”
౧౪సున్నతి పొందని మగవాడు, అంటే ఎవరి మర్మాంగం పై చర్మం సున్నతి కాలేదో అలాంటివాడిని అతని జాతిలోనుండి బహిష్కరించాలి. అతడు నా నిబంధనను భంగం చేశాడు.”
15 Još reče Bog Abrahamu: “Tvojoj ženi Saraji nije više ime Saraja: Sara će joj ime biti.
౧౫దేవుడు అబ్రాహాముతో ఇంకా ఇలా అన్నాడు. “నీ భార్య అయిన శారయిని ఇకనుండి శారయి అని పిలువవద్దు. ఇకనుండి ఆమె పేరు శారా
16 Nju ću ja blagosloviti i od nje ti dati sina; blagoslov ću na nju izliti te će se narodi od nje razviti; kraljevi će narodima od nje poteći.”
౧౬నేను ఆమెను ఆశీర్వదించి, ఆమె ద్వారా నీకు కొడుకుని ఇస్తాను. ఆమె అనేక జాతులకు తల్లి అవుతుంది. ఆమె నుండి అనేక జాతుల రాజులు వస్తారు.”
17 Abraham pade ničice pa se nasmija i reče u sebi: “Onome komu je stotinu godina, zar se može roditi dijete? Zar će Sara u devedesetoj rod rađati!”
౧౭అప్పుడు అబ్రాహాము తన ముఖాన్ని నేలకు వంచి తన హృదయంలో నవ్వుకుని “ఒక మనిషికి నూరేళ్ళ వయస్సులో పిల్లలు పుడతారా? తొంభై ఏళ్ల శారా పిల్ల వాణ్ని కంటుందా?” అని మనస్సులో అనుకున్నాడు.
18 Abraham reče Bogu: “Neka tvojom milošću Jišmael poživi!”
౧౮అబ్రాహాము “నీవు ఇష్మాయేలును చల్లగా చూస్తే నాకదే పదివేలు” అని దేవునితో అన్నాడు.
19 A Bog reče: “Ipak će ti tvoja žena Sara roditi sina; nadjeni mu ime Izak. Savez svoj s njime ću sklopiti, Savez vječni s njime i s njegovim potomstvom poslije njega.
౧౯అప్పుడు దేవుడు ఇలా అన్నాడు. “అలా కాదు. నీ భార్య అయిన శారా కచ్చితంగా నీకు కొడుకుని కంటుంది. అతనికి నువ్వు ఇస్సాకు అనే పేరు పెడతావు. అతనితో నా నిబంధనను స్థిరం చేస్తాను. అతని తరువాత అతని వారసులందరికీ అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.
20 I za Jišmaela uslišah te. Evo ga blagoslivljam: rodnim ću ga učiniti i silno ga razmnožiti; dvanaest će knezova od njega postati i u velik će narod izrasti.
౨౦ఇష్మాయేలును గూర్చి నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను. చూడు, నేను అతణ్ణి ఆశీర్వదిస్తాను. అతని సంతానాన్ని అత్యధికం చేస్తాను. అతడు అత్యధికంగా విస్తరిచేలా చేస్తాను. అతడు పన్నెండు జాతుల రాజులకు మూలపురుషుడు అవుతాడు. అతణ్ణి ఒక గొప్ప జాతిగా చేస్తాను.
21 Ali ću držati svoj Savez s Izakom, koga će ti roditi Sara dogodine u ovo doba.”
౨౧కాని వచ్చే సంవత్సరం ఈ సమయానికి శారా ద్వారా నీకు పుట్టబోయే ఇస్సాకుతో నా నిబంధననను స్థిరపరుస్తాను.”
22 Kad je završio razgovor s njim, od Abrahama Bog se podiže.
౨౨అబ్రాహాముతో మాట్లాడటం ముగిసిన తరువాత దేవుడు అతని దగ్గరనుండి పైకి వెళ్ళిపోయాడు.
23 Uzme zatim Abraham svoga sina Jišmaela i sve robove koji su bili rođeni u njegovu domu i sve koje je kupio novcem - sve muške ukućane - pa ih toga istog dana obreže, kako mu je Bog rekao.
౨౩అప్పుడు అబ్రాహాము అదే రోజు తన కుమారుడు ఇష్మాయేలునూ, తన ఇంట్లో పుట్టిన వారినందర్నీ, అలాగే తాను వెల ఇచ్చి కొన్న వారందరినీ తన ఇంట్లోని ప్రతి మగవాణ్ణీ తీసుకుని వారందరికీ వారి మర్మాంగం పైచర్మాన్ని సున్నతి చేశాడు.
24 Abrahamu bijaše devedeset i devet godina kad se obrezao,
౨౪అబ్రాహాము మర్మాంగం పైచర్మానికి సున్నతి జరిగినప్పుడు అతని వయస్సు తొంభై తొమ్మిది ఏళ్ళు.
25 a njegovu sinu Jišmaelu bijaše trinaest godina kad ga obreza.
౨౫అతని కుమారుడు ఇష్మాయేలుకు సున్నతి జరిగినప్పుడు అతనికి పదమూడేళ్ళు.
26 Tako su toga istog dana bili obrezani Abraham i njegov sin Jišmael;
౨౬అబ్రాహామూ అతని కుమారుడు ఇష్మాయేలూ ఒక్కరోజే సున్నతి పొందారు.
27 i svi muškarci njegova doma, rođeni u njegovoj kući ili za novac kupljeni od stranca - svi s njim bijahu obrezani.
౨౭అతని ఇంట్లో పుట్టినవారూ, విదేశీయుల దగ్గర వెల ఇచ్చి కొన్నవారూ, ఇంకా అతని ఇంట్లో మగవాళ్ళంతా సున్నతి పొందారు.

< Postanak 17 >