< Izlazak 19 >
1 Tri mjeseca nakon izlaska iz zemlje egipatske, istoga dana, stignu Izraelci u Sinajsku pustinju.
౧ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెల మొదటి రోజున సీనాయి ఎడారి ప్రాంతానికి వచ్చారు.
2 Idući od Refidima, dođu u Sinajsku pustinju i utabore se u pustinji. Postave Izraelci tabor tu pred brdom,
౨వాళ్ళు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు.
3 a Mojsije se popne k Bogu. Jahve ga zovne s brda pa mu rekne: “Ovako kaži domu Jakovljevu, proglasi djeci Izraelovoj:
౩మోషే యెహోవా సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా ఆ కొండపై నుండి అతణ్ణి పిలిచాడు. యెహోవా మోషేతో “నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు.
4 'Vi ste vidjeli što sam učinio Egipćanima; kako sam vas nosio na orlovskim krilima i k sebi vas doveo.
౪‘నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు.
5 Stoga, budete li mi se vjerno pokoravali i držali moj Savez, vi ćete mi biti predraga svojina mimo sve narode - tÓa moj je sav svijet! -
౫ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా.
6 vi ćete mi biti kraljevstvo svećenika, narod svet.' Tim riječima oslovi Izraelce.”
౬మీరు యాజక రాజ్యంగా పవిత్రప్రజగా ఉంటారు.’ నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే” అన్నాడు.
7 Mojsije se vrati i sazva narodne starješine te im izloži sve što mu je Jahve naredio.
౭మోషే కొండ దిగి వచ్చి ప్రజల పెద్దలను పిలిపించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి తెలియజేశాడు.
8 A sav narod uzvrati jednoglasno: “Vršit ćemo sve što je Jahve naredio.” Onda Mojsije prenese odgovor naroda Jahvi.
౮అందుకు ప్రజలంతా “యెహోవా చెప్పినదంతా మేము చేస్తాం” అని ముక్తకంఠంతో జవాబిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజలు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేశాడు.
9 Nato Jahve reče Mojsiju: “Ja ću, evo, doći k tebi u gustom oblaku da narod čuje kad budem s tobom govorio i da ti zauvijek vjeruje.” Tako je Mojsije prenio Jahvi odgovor naroda.
౯యెహోవా మోషేతో “ఇదిగో నేను కారుమబ్బులో నీ దగ్గరికి వస్తున్నాను. నేను నీతో మాట్లాడుతూ ఉండగా ప్రజలు విని ఎప్పటికీ నీ మీద నమ్మకం ఉంచుతారు” అన్నాడు. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పాడు.
10 “Pođi k narodu”, reče Jahve Mojsiju, “i posvećuj ga danas i sutra. Neka opere svoju odjeću;
౧౦అప్పుడు యెహోవా మోషేతో “నీవు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ రోజూ రేపూ వాళ్ళను పవిత్రపరచు. నా రాక కోసం వాళ్ళు సిద్ధం చెయ్యి. వాళ్ళు తమ బట్టలు ఉతుక్కుని
11 neka bude gotov prekosutra, jer će prekosutra sići Jahve na brdo Sinaj naočigled svega puka.
౧౧మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండాలి. మూడవ రోజు యెహోవా అనే నేను ప్రజలందరి కళ్ళెదుట సీనాయి కొండ పైకి దిగివస్తాను.
12 Postavi naokolo granicu za narod i izdaj naredbu: 'Pripazite da se na brdo ne penjete; da se ni podnožja ne dotičete! Tko se god brda dotakne, smrt će ga snaći.
౧౨నువ్వు కొండ చుట్టూ హద్దు ఏర్పాటు చెయ్యి. ప్రజలతో, ‘మీరు ఈ కొండ ఎక్కకూడదు. దాని అంచును కూడా ముట్టుకోకూడదు. జాగ్రత్త. ఈ కొండను ముట్టుకున్న ప్రతివాడూ మరణశిక్షకు లోనవుతాడు.
13 Nikakva ruka neka ga se ne dotakne, nego neka bude kamenjem zasut ili strijelom ustrijeljen: bio čovjek ili živinče, neka na životu ne ostane.' Na otegnuti zvuk trube neka se na brdo penju.”
౧౩ఎవ్వరూ తమ చేతులతో ముట్టుకున్న వాణ్ణి తాకకూడదు. రాళ్ళతో గానీ బాణాలతో గానీ కచ్చితంగా అతణ్ణి చంపెయ్యాలి. మనిషైనా జంతువైనా మరణ శిక్ష విధించాల్సిందే. సుదీర్ఘమైన బూర శబ్దం వినినప్పుడు వాళ్ళు కొండ పాదానికి చేరుకోవాలి’ అని చెప్పు” అన్నాడు.
14 Mojsije siđe s brda k narodu i poče posvećivati narod. Oni operu svoju odjeću.
౧౪అప్పుడు మోషే కొండ దిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను పవిత్ర పరిచాడు. ప్రజలు తమ బట్టలు ఉతుక్కున్నారు.
15 “Budite gotovi za prekosutra!” - rekne Mojsije narodu. “Ne primičite se ženi!”
౧౫అప్పుడు మోషే “మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండండి. మీ భార్యల దగ్గరికి వెళ్లొద్దు.” అని చెప్పాడు.
16 A prekosutra, u osvit dana, prolomi se grmljavina, munje zasijevaše, a gust se oblak nadvi nad brdo. Gromko zaječa truba, zadrhta sav puk koji bijaše u taboru.
౧౬మూడవ రోజు తెల్లవారగానే ఆ కొండ మీద దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులు వచ్చాయి. భీకరమైన బూర శబ్దం వినిపించినప్పుడు శిబిరంలోని ప్రజలంతా భయంతో వణకిపోయారు.
17 Mojsije povede puk iz tabora u susret Bogu. Stadoše na podnožju brda.
౧౭దేవుణ్ణి ఎదుర్కొనడానికి మోషే శిబిరంలో నుండి ప్రజలను బయటకు రప్పించాడు. ప్రజలంతా కొండ పాదం దగ్గర నిలబడ్డారు.
18 Brdo Sinaj zavilo se u dim jer je Jahve u obliku ognja sišao na nj. Dizao se dim kao dim iz peći. Sve se brdo silno treslo.
౧౮మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. ఆ కొండంతా తీవ్రంగా కంపించింది.
19 Zvuk trube bivao sve jači. Mojsije je govorio, a Bog mu grmljavinom odgovarao.
౧౯ఆ బూర శబ్దం మరింత పెరుగుతూ ఉండగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉరుములాంటి కంఠ స్వరంతో అతనికి జవాబిస్తున్నాడు.
20 Jahve siđe na Sinajsko brdo, na vrhunac, i pozva Jahve Mojsija na vrhunac brda. Mojsije se uspe.
౨౦యెహోవా సీనాయి కొండ శిఖరం మీదికి దిగి వచ్చాడు. కొండ శిఖరం మీదికి రమ్మని మోషేను పిలిచినప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు.
21 Sad Jahve reče Mojsiju: “Siđi i opomeni narod da ne bi provalio prema Jahvi da ga vidi. Mnogo bi ih poginulo.
౨౧అప్పుడు యెహోవా మోషేతో “ఈ ప్రజలు యెహోవాను చూద్దామని హద్దు మీరి వచ్చి వారిలో చాలా మంది నశించిపోకుండేలా నువ్వు కొండ దిగి వెళ్లి వాళ్లను కచ్చితంగా హెచ్చరించు.
22 I sami svećenici, koji dolaze blizu Jahvi, moraju se očistiti, da ih Jahve ne uništi.”
౨౨ఇంకా నన్ను సమీపించే యాజకులు సిద్ధపడి నేను వారిని చంపకుండేలా తమను తాము పవిత్ర పరుచుకోవాలని చెప్పు” అన్నాడు.
23 “Narod se ne može popeti na brdo Sinaj”, odgovori Mojsije Jahvi, “jer si nas sam ti opomenuo: 'Postavi granice naokolo brda i proglasi ga svetim.'”
౨౩అందుకు మోషే యెహోవాతో “ప్రజలు సీనాయి కొండ ఎక్కలేరు. నువ్వు కొండకు హద్దులు ఏర్పాటు చేసి దాన్ని పవిత్రంగా ఉంచాలని మాకు కచ్చితంగా ఆజ్ఞాపించావు గదా” అన్నాడు.
24 “Siđi pa se opet popni zajedno s Aronom”, odgovori mu Jahve. “Ali neka svećenici i narod ne navaljuju da se popnu prema Jahvi da ne izginu.”
౨౪అప్పుడు యెహోవా “నువ్వు కిందకు దిగి వెళ్లు. నువ్వు అహరోనును వెంటబెట్టుకుని తిరిగి రావాలి. అయితే యెహోవా వారి మీద పడకుండా ఉండేలా యాజకులు, ప్రజలు హద్దు మీరి ఆయన దగ్గరికి ఎక్కి రాకూడదు” అని చెప్పాడు.
25 Mojsije siđe k narodu i sve mu kaza.
౨౫మోషే ప్రజల దగ్గరికి వెళ్లి ఆ మాట వాళ్ళతో చెప్పాడు.