< 1 Kraljevima 14 >
1 U ono se vrijeme razbolje Abija, sin Jeroboamov,
౧అదే రోజుల్లో యరొబాము కొడుకు అబీయాకు జబ్బు చేసింది.
2 i Jeroboam reče svojoj ženi: “Ustani i preobuci se da te ne bi prepoznali da si žena Jeroboamova; i idi u Šilo. Ondje je prorok Ahija: onaj koji mi je prorokovao da ću biti kraljem ovoga naroda.
౨యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు. “నీవు లేచి యరొబాము భార్యవని ఎవరికీ తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహు వెళ్ళు. ఈ ప్రజల మీద నేను రాజునవుతానని నాకు చెప్పిన ప్రవక్త అహీయా అక్కడున్నాడు.
3 I ponesi deset hljebova, kolača i posudu meda i otiđi k njemu! On će ti reći što će biti s dječakom.”
౩కాబట్టి నీవు పది రొట్టెలూ కొన్ని తీపి రొట్టెలు, ఒక సీసా నిండా తేనె తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. అబ్బాయికి ఏమవుతుందో అతడు నీకు చెబుతాడు.”
4 I učini tako žena Jeroboamova: ustade, ode u Šilo i uđe u kuću Ahijinu. A on nije više vidio, oslabile mu oči od duboke starosti.
౪యరొబాము భార్య అలానే చేసింది. ఆమె షిలోహులోని అహీయా ఇంటికి వెళ్ళింది. ముసలితనం వలన అహీయా కళ్ళు కనిపించడం లేదు.
5 Ali mu je Jahve rekao: “Evo dolazi žena Jeroboamova da od tebe traži savjeta za svoga sina jer je bolestan; a ti ćeš joj reći tako i tako. Kad bude ulazila, pretvarat će se kao da je druga.”
౫యెహోవా అహీయాతో “యరొబాము కొడుకు జబ్బుగా ఉన్నాడు కాబట్టి అతని గురించి నీ దగ్గర సలహా కోసం యరొబాము భార్య వస్తూ ఉంది. ఆమె మారువేషం వేసుకుని మరొక స్త్రీలాగా నటిస్తుంది. నేను నీకు చెప్పేది నీవు ఆమెతో చెప్పాలి” అన్నాడు.
6 Kad Ahija ču šum njenih koraka na vratima, reče joj: “Uđi, ženo Jeroboamova! Što se pretvaraš da si druga, kad imam tešku vijest za tebe?
౬గుమ్మం గుండా ఆమె వస్తున్న కాలి చప్పుడు విని అహీయా ఆమెతో ఇలా అన్నాడు. “యరొబాము భార్యా, లోపలికి రా! నీవు వేషం వేసుకుని రావడం ఎందుకు? కఠినమైన మాటలు నీకు చెప్పాలని దేవుడు నాకు చెప్పాడు.
7 Idi, reci Jeroboamu: 'Ovako kaže Jahve, Bog Izraelov: Podigao sam te isred naroda i učinio sam te knezom nad mojim narodom Izraelom,
౭నీవు వెళ్లి యరొబాముతో ఇలా చెప్పు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, ‘నేను నిన్ను ప్రజల్లో నుంచి హెచ్చించి నా ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను అధికారిగా నియమించాను.
8 istrgnuo sam kraljevstvo iz kuće Davidove i dao ga tebi. Ali ti nisi bio kao moj sluga David, koji je držao moje zapovijedi i koji me slijedio svim srcem svojim i činio samo ono što je pravedno u mojim očima.
౮దావీదు వంశం నుంచి రాజ్యాన్ని తీసి నీకిచ్చాను. అయినా నీవు నా సేవకుడైన దావీదు చేసినట్టు చేయలేదు. అతడు హృదయపూర్వకంగా నన్ను అనుసరించి, నా ఆజ్ఞలు గైకొని నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేశాడు.
9 Ti si radio kudikamo gore od svojih prethodnika, otišao si i načinio sebi druge bogove, salio si im likove da me dražiš, mene si bacio za leđa.
౯దానికి బదులు నీవు నీకు ముందున్న వారందరికంటే ఎక్కువ దుర్మార్గం చేశావు. నన్ను పూర్తిగా వదిలేశావు. నీ కోసం ఇతర దేవుళ్ళను చేయించుకున్నావు, పోత విగ్రహాలను పెట్టించుకుని నాకు కోపం పుట్టించావు.
10 Zato, evo, puštam zlo na kuću Jeroboamovu, istrijebit ću iz obitelji Jeroboamove sve što mokri uza zid, robove i slobodnjake u Izraelu; ja ću netragom pomesti kuću Jeroboamovu kao što se mete nečist, da ga ništa ne ostane.
౧౦కాబట్టి నీ కుటుంబం మీదకు నేను కీడు రప్పిస్తాను. ఇశ్రాయేలు వారిలో చిన్నవారనీ పెద్దవారనీ తేడా లేకుండా చెత్తనంతా పూర్తిగా కాల్చినట్టు మగపిల్లలందరినీ నిర్మూలం చేస్తాను.
11 One koji iz Jeroboamove obitelji umru u gradu, proždrijet će psi, a one koji umru u polju, pojest će ptice nebeske.' - Eto tako je Jahve rekao.
౧౧పట్టణంలో చనిపోయే నీ కుటుంబానికి చెందిన వారిని కుక్కలు తింటాయి. బయట పొలంలో చనిపోయే వారిని రాబందులు తింటాయి. ఈ మాటలు చెప్పేది, యెహోవానైన నేనే.’
12 A ti ustani i pođi svome domu: tek što nogama stupiš u grad, dječak će umrijeti.
౧౨కాబట్టి నీవు లేచి నీ ఇంటికి వెళ్ళు, నీవు పట్టణంలో అడుగుపెట్టగానే నీ బిడ్డ చనిపోతాడు.
13 Sav će ga Izrael oplakati i pokopat će ga. On će biti jedini iz obitelji Jeroboamove položen u grob, jer se jedino na njemu našlo nešto što se u kući Jeroboamovoj svidjelo Jahvi, Bogu Izraelovu.
౧౩అతని కోసం ఇశ్రాయేలు వారంతా దుఃఖిస్తూ అతన్ని సమాధి చేస్తారు. ఇతన్ని మాత్రమే సమాధి చేస్తారు, ఎందుకంటే యరొబాము వంశంలో ఇతడొక్కడిలోనే ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కొంచెం మంచి కనిపించింది.
14 Jahve će sebi postaviti kralja nad Izraelom i taj će istrijebiti kuću Jeroboamovu. Evo dana! Što? Čak i trenutka!
౧౪అంతేకాక యెహోవా ఇశ్రాయేలు వారి మీద ఒక రాజును నియమించబోతున్నాడు. ఆ రోజునే అతడు యరొబాము వంశాన్ని నాశనం చేస్తాడు. ఇదే ఆ రోజు.
15 Jahve će udariti Izraela te će se njihati kao trska u vodi. Iščupat će Izraela iz ove dobre zemlje koju je dao njihovim ocima i rasijat će ih s onu stranu Rijeke, jer su načinili sebi ašere koje srde Jahvu.
౧౫ఇశ్రాయేలువారు అషేరా దేవతా స్తంభాలను నిలబెట్టి యెహోవాకు కోపం పుట్టించారు, కాబట్టి నీళ్ళల్లో రెల్లు ఊగుతున్నట్టు యెహోవా ఇశ్రాయేలు వారిని ఊపేస్తాడు. వారి పూర్వీకులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని ఊడబెరికి, వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొడతాడు.
16 Odbacit će Izraela kao smeće, zbog grijeha što ih je učinio Jeroboam i na koje je navodio Izraela.”
౧౬తానే పాపం చేసి ఇశ్రాయేలువారు పాపం చేయడానికి కారణమైన యరొబాము పాపాలను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని శిక్షించబోతున్నాడు.”
17 Žena Jeroboamova ustade i ode. Stigla je u Tirsu, a kad je prelazila kućni prag, dječak bijaše mrtav.
౧౭అప్పుడు యరొబాము భార్య లేచి, తిర్సా పట్టణానికి వెళ్లిపోయింది. ఆమె వాకిట్లో అడుగు పెట్టడంతోనే ఆమె కొడుకు చనిపోయాడు.
18 Pokopali su ga i sav ga je Izrael oplakao prema riječi koju je Jahve rekao po sluzi svome proroku Ahiji.
౧౮యెహోవా తన సేవకుడు అహీయా ప్రవక్త ద్వారా చెప్పినట్టు ఇశ్రాయేలు వారంతా అతన్ని సమాధి చేసి అతని కోసం దుఖించారు.
19 Ostala povijest Jeroboamova, kako je ratovao i kraljevao, to je zapisano u knjizi Ljetopisa kraljeva izraelskih.
౧౯యరొబాము గురించిన ఇతర విషయాలను, అతడు చేసిన యుద్ధాలను గురించి, పరిపాలన గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.
20 Jeroboamovo kraljevanje trajalo je dvadeset i dvije godine, zatim je Jeroboam počinuo kraj otaca svojih, a sin mu Nadab zakraljio se mjesto njega.
౨౦యరొబాము 22 ఏళ్ళు పాలించాడు. అతడు చనిపోయినప్పుడు అతన్ని పూర్వీకుల సరసన పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు నాదాబు రాజయ్యాడు.
21 Roboam, sin Salomonov, bio je kralj Judejaca; bijaše mu četrdeset i jedna godina kad je postao kraljem, a sedamnaest je godina kraljevao u Jeruzalemu, u gradu koji Jahve izabra između svih izraelskih plemena da ondje postavi svoje Ime. Majka mu se zvala Naama, a bila je Amonka.
౨౧యూదాదేశంలో సొలొమోను కొడుకు రెహబాము పాలించాడు. రెహబాము 41 ఏళ్ల వయస్సులో పరిపాలించడం మొదలెట్టాడు. తన పేరు నిలపడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న యెరూషలేము అనే పట్టణంలో అతడు 17 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా.
22 I Juda učini zlo u očima Jahvinim. Grijesima koje su počinili razjarili su ga više od svega što su učinili njihovi oci.
౨౨యూదావారు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. తమ పూర్వీకులకంటే ఎక్కువ పాపం చేస్తూ ఆయనకు రోషం పుట్టించారు.
23 Jer su i oni podigli uzvišice, stupove i ašere na svakom brežuljku i pod svakim zelenim drvetom.
౨౩వాళ్ళు ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా పూజా స్థలాలను కట్టి, విగ్రహాలు నిలిపి, అషేరా దేవతాస్తంభాలను ఉంచారు.
24 Bilo je čak posvećenih bludnica u zemlji. Oponašao je sve grozote naroda što ih je Jahve otjerao ispred sinova Izraelovih.
౨౪యూదా దేశంలో దేవస్థానాలకు అనుబంధంగా మగ వ్యభిచారులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసే నీచమైన పనులను యూదావారు కూడా చేస్తూ వచ్చారు.
25 Pete godine Roboamova kraljevanja egipatski kralj Šišak navali na Jeruzalem.
౨౫రెహబాము రాజు పాలిస్తున్న ఐదో సంవత్సరంలో ఐగుప్తు రాజు షీషకు యెరూషలేముపై దండెత్తాడు.
26 Opljačka sve blago iz Doma Jahvina i riznicu kraljevskog dvora; sve je uzeo; uze i sve zlatne štitove što ih bijaše napravio Salomon.
౨౬యెహోవా మందిరపు ఖజనాలోని వస్తువులు, రాజభవనపు ఖజనాలోని వస్తువులు, అన్నిటినీ దోచుకుపోయాడు. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను కూడా అతడు దోచుకుపోయాడు.
27 Namjesto njih kralj Roboam napravi tučane štitove i povjeri ih zapovjednicima straže koja je čuvala vrata kraljevskog dvora.
౨౭రెహబాము రాజు వీటికి బదులు ఇత్తడి డాళ్లను చేయించి, రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల నాయకునికి అప్పచెప్పాడు.
28 Kad je god kralj išao u Jahvin Dom, stražari su ih uzimali, a poslije ih vraćali u stražaru.
౨౮రాజు యెహోవా మందిరానికి వెళ్ళే ప్రతిసారీ భటులు వాటిని మోసుకు పోయేవారు. తరువాత వాటిని భద్రమైన గదిలో ఉంచేవారు.
29 Ostala povijest Roboamova, sve što je učinio, zar nije zapisano u knjizi Ljetopisa kraljeva judejskih?
౨౯రెహబాము గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి వుంది.
30 Za sve vrijeme bio je rat između Roboama i Jeroboama.
౩౦బ్రతికినంత కాలం రెహబాముకూ యరొబాముకూ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది.
31 Roboam je počinuo sa svojim ocima i bi sahranjen sa svojim ocima u Davidovu gradu. Majka mu se zvala Naama, a bila je Amonka. Na njegovo se mjesto zakraljio sin mu Abijam.
౩౧రెహబాము చనిపోయినప్పుడు దావీదు నగరంలోని అతని పూర్వీకుల సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అతని తల్లి నయమా అమ్మోనీయురాలు. అతని కొడుకు అబీయా అతని స్థానంలో రాజయ్యాడు.