< 2 Ŵasesalonike 1 >

1 Une che Paolo pamo ni che Siluwano ni che Timoseo, tukunnembela chikalata ŵanyamwe mpingo wa ŵandu ŵakunkulupilila Kilisito wa ku Sesalonike, ŵanlumbikene ni Akunnungu Atati ŵetu ni Ambuje Che Yesu Kilisito.
మన తండ్రి అయిన దేవునిలో ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న తెస్సలోనిక సంఘానికి పౌలూ, సిల్వానూ, తిమోతీ రాస్తున్న సంగతులు.
2 Tukummendela umbone ni chitendewele kutyochela kwa Akunnungu Atati ŵetu ni Ambuje Che Yesu Kilisito.
తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృపాసమాధానాలు మీకు కలుగు గాక.
3 Achalongo, ikutuŵajila kwatogolela Akunnungu moŵa gose kwa ligongo lyenu. Ili yambone kutendekanya yeleyo ligongo chikulupi chenu chikukula nnope ni kunonyelana kwenu kukuchuluka.
సోదరులారా, మేము ఎప్పుడూ మీ విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది సముచితం. ఎందుకంటే మీ విశ్వాసం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మీలో ఒకరి పట్ల మరొకరు చూపే ప్రేమ అత్యధికం అవుతూ ఉంది.
4 Kwa ligongo lyo, uweji tukulilapa kwa ligongo lyenu, mu mipingo ja ŵandu ŵakunkulupilila Kilisito ŵaali ŵandu ŵa Akunnungu. Tukulilapa pankwendelechela kwakulupilila Ambuje ni kupililila malagasyo ni masauko gagakunsimana.
అందుకే మీరు పొందుతున్న హింసలన్నిటిలోనూ, మీరు సహిస్తున్న యాతనల్లోనూ, మీ సహనాన్నీ, విశ్వాసాన్నీ చూసి దేవుని సంఘాల్లో మీ గురించి మేమే గర్వంగా చెబుతున్నాం.
5 Yeleyo yose ikulosya isyene kuti Akunnungu akulamula kwa umbone kuti mmalanjikwe ŵakuŵajilwa kwinjila mu umwenye wa Akunnungu waunkulajila.
ఇది దేవుని న్యాయమైన తీర్పుకు ఒక స్పష్టమైన సూచనగా ఉంది. దీని ఫలితం ఏమిటంటే మీరు దేవుని రాజ్యానికి తగిన వారుగా లెక్కలోకి వస్తారు. దేవుని రాజ్యం కోసమే మీరీ కష్టాలన్నీ సహిస్తున్నారు.
6 Akunnungu chachitendekanya yaili yambone, chiŵauchisye malagasyo aŵala wose ŵakunlagasya ŵanyamwe,
ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలగజేయడం దేవునికి న్యాయమే.
7 ni kumpumusya mwanya ŵankulagaswa pamo nowe. Chelecho chichitendekwe pachaoneche Ambuje Che Yesu achityochelaga kwinani pamo ni achikatumetume ŵakwe ŵa kwinani ŵaali ni machili.
8 Akunnungu chiŵajamuche kwa malamba ga mooto wekolele aŵala ŵandu ŵakunkana ni ŵangakujitichisya Ngani Jambone jankati Ambuje ŵetu Che Yesu.
దేవుడు తనను ఎరుగని వారిని, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వారిని అగ్నిజ్వాలల్లో దండిస్తాడు.
9 Kwamukwa kwawo chikuŵe konangwa kwa moŵa gose pangali mbesi ni kutalikanganywa ni Ambuje ni kutalikanganywa ni ukulu wa ukombole wao, (aiōnios g166)
ఆ రోజున తన పరిశుద్ధులు ఆయనను మహిమ పరచడానికీ, విశ్వసించిన వారికి ఆశ్చర్య కారకంగా ఉండటానికీ ఆయన వచ్చినప్పుడు అవిశ్వాసులు ప్రభువు సన్నిధి నుండీ, ఆయన ప్రభావ తేజస్సు నుండీ వేరై శాశ్వత నాశనం అనే దండన పొందుతారు. (aiōnios g166)
10 patachiika lyuŵa lyo kuti akuswe pasikati ja ŵaswela ŵakwe ni kusimonjekwa ni ŵandu wose ŵakwakulupilila. Mwanya iyoyo peyo chimme pamo ni ŵanyawo pakuŵa nkulupilile umboni utwansalile ula.
౧౦ఆ పరిశుద్ధుల్లో మీరూ ఉన్నారు. ఎందుకంటే మేము చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు.
11 Kwa ligongo lyo tukumpopelelanga moŵa gose kuti Akunnungu ŵetu ankombolesye kutama malinga ni inkuti pakusachilwa kutama. Tukupopelela kuti kwa ukombole wao amalichisye yose yambone inkusaka kupanganya ni kila masengo ga chikulupi.
౧౧ఈ కారణం చేత మీకు అందిన పిలుపుకి తగిన వారిగా మిమ్మల్ని దేవుడు ఎంచాలనీ, మేలు చేయాలనే మీ ప్రతి ఆలోచననూ విశ్వాస మూలమైన ప్రతి పనినీ ఆయన తన బల ప్రభావాలతో నెరవేర్చాలనీ మేము మీ కోసం అనునిత్యం ప్రార్ధిస్తున్నాము.
12 Tukupopelela yele kuti liina lya Ambuje ŵetu Che Yesu likuswe nkati mwenu, ni ŵanyamwe nkuswe kwa litala lya umbone wa Akunnungu ŵetu ni kwa Ambuje Che Yesu Kilisito.
౧౨తద్వారా మన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రసాదించే కృప మూలంగా మీలో మన ప్రభువైన యేసు నామం మహిమ పొందుతుంది. మీరు ఆయనలో మహిమ పొందుతారు.

< 2 Ŵasesalonike 1 >