< 1 Yohana 3 >
1 Nnole yatite kutunonyela Atati, mpaka tukuŵilanjikwa ŵanache ŵa Akunnungu, noweji ni yatuli. Kwaligongo lyo ŵandu ŵa pachilambo pa ngaakutumanyilila, pakuŵa nganiŵamanyilila Akunnungu.
౧మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు.
2 Achambusanga ŵangu, sambano uweji tuli ŵanache ŵa Akunnungu, nambo nginiŵe kumanyika chituŵe ŵanti uli. Nambo tukwimanyilila yakuti pachachiika Kilisito, chitulandane nawo pakuŵa chitwawone uŵele waali nawo.
౨ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇక ముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయనలాగా ఉంటామనీ మనకు తెలుసు.
3 Nipele, jwalijose jwakulolela kwawona Kilisito aliswejesye, mpela ila Kilisito nsyene yatite kuswejela.
౩ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపిన ప్రతి ఒక్కడూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు.
4 Mundu jwalijose jwakutenda sambi ngakulikamulisya lilajisyo lya Akunnungu, pakuŵa kutenda sambi kuli kuleka kukamulisya lilajisyo.
౪పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే.
5 Nkumanyilila kuti Kilisito ŵaiche kuti asityosye sambi syetu, nombewo nganakola sambi syasili syose.
౫మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనలో ఏ పాపమూ లేదు.
6 Kwayele mundu jwalumbikene ni Kilisito ngakwendelechela kutendekanya sambi. Nambo jwakwendelechela kutendekanya sambi nganaŵe kwawona ŵelewo atamuno kwamanyilila.
౬ఆయనలో నిలిచి ఉన్నవారెవరూ పాపం చేస్తూ ఉండరు. పాపం చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయనను ఎన్నడూ చూడలేదు.
7 Achiŵanangu, mundu jwalijose ngasanlyungasya. Mundu jwakutenda ipanganyo yambone, mundu jo akwanonyelesya Akunnungu mpela ila Kilisito yatite kwanonyelesya Akunnungu.
౭పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించే ప్రతి వాడూ నీతిపరుడు.
8 Mundu jwalijose jwakwendelechela kutendekanya sambi jwelejo ali jwa Shetani, pakuŵa Shetani atesile sambi chitandile kundanda. Kwa ligongo li, Mwana jwa Akunnungu ŵaiche pachilambo kukugajonanga masengo ga Shetani.
౮పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.
9 Mundu jwalijose jwaali mwanache jwa Akunnungu ngakwendelechela kutendekanya sambi, pakuŵa umi wa Akunnungu ukutama munkati mwakwe, kwapele ngaakukombola kuendelechela kutendekanya sambi ligongo Akunnungu ali Atati ŵao.
౯దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు.
10 Mundu jwalijose jwangakupanganya yambone paujo pa Akunnungu, pane jwangakunnonyela nlongo njakwe, jwelejo nganaŵa mwanache jwa Akunnungu. Yele ni yakuti pakumanyika ŵanache ŵa Akunnungu ni ŵanache ŵa Shetani.
౧౦నీతిని జరిగించని వారు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివారు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.
11 Pakuŵa ngani jimwajipikene chitandile kundanda ni aji: Tunonyelane jwine ni jwine.
౧౧మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు.
12 Tukaŵa mpela che Kaini juŵalongweswe ni Shetani ni kumbulaga che Abeli mpwakwe. Kwa chichi ŵammuleje? Ligongo ipanganyo yao yaliji yangalumbana ni mpwakwe ŵaliji ni ipanganyo yambone paujo pa Akunnungu.
౧౨సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి.
13 Achalongo achinjangu nkasimonga naga ŵandu ŵa pachilambo pa akunchima.
౧౩నా సోదరులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి.
14 Uweji tukwimanyilila yakuti tupitile kutyochela mu chiwa ni kwinjila mu umi, pakuŵa tukwanonyela achalongo achinjetu. Mundu jwanganakola unonyelo akutama mmachili ga chiwa.
౧౪మనం మన సోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలో నుండి జీవంలోకి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు.
15 Mundu jwalijose jwakunchima njakwe ali jwauulasi ni ŵanyamwe nkwimanyilila, jwauulasi nganakola umi wa moŵa gose pangali mbesi munkati mwakwe. (aiōnios )
౧౫తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం నిలిచి ఉండదని మీకు తెలుసు. (aiōnios )
16 Yeleyi ni yatukuti pakuumanyilila unonyelo yauli, pakuŵa Kilisito ŵautyosisye umi wao kwa ligongo lyetu. Noweji tukuŵajilwa kuutyosya umi wetu kwaligongo lya kwakamuchisya achalongo achinjetu.
౧౬యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి.
17 Nambo mundu akolaga chipanje cha pachilambo, ni kummona mpwakwe akwete yaikwasoŵa, nombejo ngakwakolela chanasa, ana mundu jo akukombola chinauli kusala akwanonyela Akunnungu?
౧౭ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?
18 Achiŵanangu, tuleche kwanonyela ŵandu kwa maloŵe pe, nambo twanonyele kwa kwalosya isambo.
౧౮నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం.
19 Yeleyi ni yatukuti pakumanyilila kuti uweji tuli ŵa usyene ni mitima jetu nganijikola lipamba paujo pa Akunnungu.
౧౯దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి.
20 Pakuŵa atamuno mitima jetu ngajikutulamula kuti tuleŵile, tukwimanyilila kuti Akunnungu ali jwankulu kujipunda mitima jetu, nombeŵo akwimanyilila indu yose.
౨౦మన హృదయం మనపై నింద మోపితే, దేవుడు మన హృదయం కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు.
21 Achambusanga ŵangu naga mitima jetu ngajikutulamula kuti tuleŵile, nipele nganitukola lipamba paujo pa Akunnungu.
౨౧ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం.
22 Ni chilichose chatukuŵenda kukwao tukupochela, pakuŵa tukwitichisya malajisyo gao ni kuipanganya yaikwanonyelesya.
౨౨అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం.
23 Ni lilajisyo lyao lili lyeleli, tulikulupilile lina lya Che Yesu Kilisito, Mwanagwe ni kunonyelana jwine ni jwine mpela yatite pakutulajisya.
౨౩ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.
24 Ŵandu wose ŵakwitichisya malajisyo ga Akunnungu, akutama nkulumbikana ni Akunnungu ni Akunnungu akutama nkulumbikana ni ŵandu wo. Tukumanyilila yeleyo kuti Akunnungu akutama nkulumbikana ni uwe kwa litala lya Mbumu jwa Akunnungu jwatupele.
౨౪దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.