< 詩篇 77 >
1 亞薩的詩,照耶杜頓的作法,交與伶長。 我要向上帝發聲呼求; 我向上帝發聲,他必留心聽我。
౧ప్రధాన సంగీతకారుని కోసం, యెదూతూను అనే రాగంలో పాడేది. ఆసాపు కీర్తన. నేను బిగ్గరగా దేవునికి మొరపెడతాను, నేను దేవుణ్ణి పిలుస్తాను, నా దేవుడు నా మాట వింటాడు.
2 我在患難之日尋求主; 我在夜間不住地舉手禱告; 我的心不肯受安慰。
౨నా కష్ట సమయంలో నేను ప్రభువును వెతికాను. రాత్రంతా నేను నా చేతులెత్తి ప్రార్థించాను, నా ప్రాణం ఓదార్పు పొందడం లేదు.
3 我想念上帝,就煩燥不安; 我沉吟悲傷,心便發昏。 (細拉)
౩నా వేదనలో నేను దేవుణ్ణి గుర్తు చేసుకున్నాను, నీరసించిపోయి నేను ఆయన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. (సెలా)
౪నువ్వు నా కళ్ళు తెరచి ఉంచుతున్నావు. నేను మాట్లాడలేనంతగా కలవరపడుతున్నాను.
౫గతించిన రోజులనూ గత కాలాన్నీ గురించి ఆలోచించాను,
6 我想起我夜間的歌曲,捫心自問; 我心裏也仔細省察。
౬ఒకప్పుడు నేను పాడిన పాట రాత్రివేళ గుర్తుకు తెచ్చుకున్నాను. నేను జాగ్రత్తగా నా హృదయంలో ఆలోచించాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.
౭ప్రభువు శాశ్వతంగా నన్ను తోసివేస్తాడా? ఆయన ఇంకెన్నటికీ మళ్ళీ నా మీద దయ చూపడా?
౮ఆయన కృప ఎప్పటికీ రాదా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నేరవేరదా?
9 難道上帝忘記開恩, 因發怒就止住他的慈悲嗎? (細拉)
౯దేవుడు కనికరించడం మరచిపోయాడా? ఆయన కోపం దయకు అడ్డుపడిందా? (సెలా)
10 我便說:這是我的懦弱, 但我要追念至高者顯出右手之年代。
౧౦ఇది నా బాధ. మా పట్ల సర్వశక్తుని కుడి చెయ్యి మారుతూ ఉంది, అని నేనన్నాను.
11 我要提說耶和華所行的; 我要記念你古時的奇事。
౧౧అయితే యెహోవా, గతంలోని నీ అద్భుత క్రియలను నేను గుర్తుకు తెచ్చుకుంటాను.
౧౨నీ పనులన్నిటినీ నేను తలంచుకుంటాను. వాటిని మననం చేసుకుంటాను.
13 上帝啊,你的作為是潔淨的; 有何神大如上帝呢?
౧౩దేవా! నీ మార్గం పవిత్రం. మన గొప్ప దేవునికి సాటి అయిన దేవుడెవరు?
14 你是行奇事的上帝; 你曾在列邦中彰顯你的能力。
౧౪నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ప్రజా సమూహాల్లో నువ్వు నీ ప్రభావాన్ని ప్రత్యక్షపరచావు.
15 你曾用你的膀臂贖了你的民, 就是雅各和約瑟的子孫。 (細拉)
౧౫నీ గొప్ప బలంతో నీ ప్రజలకు-యాకోబు యోసేపుల సంతతికి విజయాన్నిచ్చావు. (సెలా)
16 上帝啊,諸水見你, 一見就都驚惶; 深淵也都戰抖。
౧౬దేవా, నీళ్ళు నిన్ను చూశాయి, నీళ్ళు నిన్ను చూసి భయపడ్డాయి, అగాధంలోని నీళ్ళు వణికిపోయాయి.
17 雲中倒出水來; 天空發出響聲; 你的箭也飛行四方。
౧౭మబ్బులు నీళ్లు కుమ్మరించాయి, ఆకాశం గర్జించింది, నీ బాణాలు రివ్వున ఎగిశాయి.
18 你的雷聲在旋風中; 電光照亮世界; 大地戰抖震動。
౧౮నీ ఉరుముల మోత సుడిగాలిలో మోగింది. మెరుపులు లోకాన్ని వెలిగించాయి. భూమి వణికి కంపించింది.
19 你的道在海中; 你的路在大水中; 你的腳蹤無人知道。
౧౯సముద్రంలో నీ దారి వెళ్ళింది. ప్రవాహాల్లోగుండా నీ దారి మళ్ళింది. అయితే నీ కాలిముద్రలు కనబడలేదు.
20 你曾藉摩西和亞倫的手引導你的百姓, 好像羊群一般。
౨౦మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు.