< 詩篇 74 >
1 亞薩的訓誨詩。 上帝啊,你為何永遠丟棄我們呢? 你為何向你草場的羊發怒,如煙冒出呢?
౧ఆసాపు కీర్తన దేవా, నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు విడిచిపెట్టావు? నువ్వు మేపే గొర్రెల మీద ఎందుకు కోపగించుకుంటున్నావు?
2 求你記念你古時所得來的會眾, 就是你所贖、作你產業支派的, 並記念你向來所居住的錫安山。
౨నీ వారసత్వంగా కొనుక్కున్న గోత్రాన్ని, నువ్వు అనాది కాలంలో విమోచించిన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో. నీ నివాసమైన ఈ సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకో.
3 求你舉步去看那日久荒涼之地, 仇敵在聖所中所行的一切惡事。
౩నీ పరిశుద్ధ స్థలాన్ని శత్రువులు ఎలా పూర్తిగా పాడు చేశారో వచ్చి ఆ శిథిలాలను చూడు.
4 你的敵人在你會中吼叫; 他們豎了自己的旗為記號。
౪నీ ప్రత్యక్ష గుడారంలో నీ శత్రువులు గర్జిస్తున్నారు. వారి విజయధ్వజాలను ఎత్తి నిలబెట్టారు.
౫దట్టమైన గుబురు చెట్ల మీద గొడ్డళ్ళు ఎత్తినట్టు అది కనిపిస్తున్నది.
6 聖所中一切雕刻的, 他們現在用斧子錘子打壞了。
౬వారు గొడ్డళ్ళు, సుత్తెలు తీసుకుని దాని నగిషీ చెక్కడాలను పూర్తిగా విరగగొట్టారు.
7 他們用火焚燒你的聖所, 褻瀆你名的居所,拆毀到地。
౭నీ పరిశుద్ధ స్థలానికి మంట పెట్టారు. నీ నివాసమైన మందిరాన్ని నేలమట్టం చేసి అపవిత్రపరిచారు.
8 他們心裏說:我們要盡行毀滅; 他們就在遍地把上帝的會所都燒毀了。
౮వాటినన్నిటినీ పూర్తిగా ధ్వంసం చేద్దాం అనుకుంటూ వారు దేశంలోని నీ సమావేశ మందిరాలన్నిటినీ కాల్చివేశారు.
9 我們不見我們的標幟,不再有先知; 我們內中也沒有人知道這災禍要到幾時呢!
౯దేవుని నుండి మరి ఏ సూచకక్రియలూ మాకు కనబడటం లేదు. ఇంకా ప్రవక్త కూడా ఎవరూ లేరు. ఇలా ఎంతకాలం జరుగుతుందో ఎవరికీ తెలియదు.
10 上帝啊,敵人辱罵要到幾時呢? 仇敵褻瀆你的名要到永遠嗎?
౧౦దేవా, శత్రువులు ఎంతకాలం నిన్ను నిందిస్తారు? శత్రువులు నీ నామాన్ని ఎల్లకాలం దూషిస్తారా?
11 你為甚麼縮回你的右手? 求你從懷中伸出來,毀滅他們。
౧౧నీ హస్తాన్ని, నీ కుడి చేతిని ఎందుకు ముడుచుకుని ఉన్నావు? నీ వస్త్రంలో నుండి దాన్ని తీసి వారిని నాశనం చెయ్యి.
౧౨పురాతన కాలం నుండీ దేవుడు నా రాజుగా ఈ భూమిపై రక్షణ కలిగిస్తూ ఉన్నాడు.
౧౩నీ బలంతో సముద్రాన్ని పాయలుగా చేశావు. నీటిలోని బ్రహ్మాండమైన సముద్ర వికృత జీవుల తలలు చితకగొట్టావు.
14 你曾砸碎鱷魚的頭, 把牠給曠野的禽獸為食物。
౧౪సముద్ర రాక్షసి తలలను నువ్వు ముక్కలు చేశావు. అరణ్యాల్లో నివసించే వారికి దాన్ని ఆహారంగా ఇచ్చావు.
15 你曾分裂磐石,水便成了溪河; 你使長流的江河乾了。
౧౫నీటి ఊటలను, ప్రవాహాలను పుట్టించావు. నిత్యం పారే నదులను ఎండిపోజేశావు.
16 白晝屬你,黑夜也屬你; 亮光和日頭是你所預備的。
౧౬పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నువ్వే వాటి స్థానాల్లో ఉంచావు.
17 地的一切疆界是你所立的; 夏天和冬天是你所定的。
౧౭భూమికి సరిహద్దులు నియమించింది నువ్వే. వేసవికాలం, చలికాలం నువ్వే కలిగించావు.
18 耶和華啊,仇敵辱罵, 愚頑民褻瀆了你的名,求你記念這事。
౧౮యెహోవా, శత్రువులు నీపైనా బుద్ధిహీనులు నీ నామంపైనా చేసిన దూషణలు నీ మనసుకు తెచ్చుకో.
19 不要將你斑鳩的性命交給野獸; 不要永遠忘記你困苦人的性命。
౧౯నీ పావురం ప్రాణాన్ని క్రూర మృగానికి అప్పగింపకు. బాధలు పొందే నీ ప్రజలను ఎన్నడూ మరువకు.
20 求你顧念所立的約, 因為地上黑暗之處都滿了強暴的居所。
౨౦నీ నిబంధన జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే లోకంలో ఉన్న చీకటి స్థలాలన్నీ బలాత్కారంతో నిండిపోయాయి.
21 不要叫受欺壓的人蒙羞回去; 要叫困苦窮乏的人讚美你的名。
౨౧పీడితుణ్ణి అవమానంతో మరలనియ్యకు. బాధలు పొందినవారు, దరిద్రులు నీ నామాన్ని స్తుతిస్తారు గాక.
22 上帝啊,求你起來為自己伸訴! 要記念愚頑人怎樣終日辱罵你。
౨౨దేవా, లేచి నీ ఘనతను కాపాడుకో. బుద్ధిహీనులు రోజంతా నిన్ను దూషిస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకో.
23 不要忘記你敵人的聲音; 那起來敵你之人的喧嘩時常上升。
౨౩నీ శత్రువుల స్వరాన్ని, నిన్ను ఎడతెగక ఎదిరించేవారి గర్జింపులను మరచిపోవద్దు.