< 詩篇 38 >

1 大衛的紀念詩。 耶和華啊,求你不要在怒中責備我, 不要在烈怒中懲罰我!
దావీదు కీర్తన, జ్ఞాపకం కోసం యెహోవా, నీ కోపంలో నన్ను గద్దించవద్దు. నీ తీవ్ర కోపంలో నన్ను శిక్షించవద్దు.
2 因為,你的箭射入我身; 你的手壓住我。
నీ బాణాలు నాకు గట్టిగా గుచ్చుకుంటున్నాయి. నీ చెయ్యి నన్ను అణచివేస్తుంది.
3 因你的惱怒,我的肉無一完全; 因我的罪過,我的骨頭也不安寧。
నీ కోపం వల్ల నా శరీరమంతా అనారోగ్యం కలిగింది. నా పాపం కారణంగా నా ఎముకల్లో ఆరోగ్యం లేకుండా పోయింది.
4 我的罪孽高過我的頭, 如同重擔叫我擔當不起。
ఎందుకంటే నా దోషాలు నన్ను ముంచెత్తి వేస్తున్నాయి. అవి నేను మోయలేనంత భారంగా ఉన్నాయి.
5 因我的愚昧, 我的傷發臭流膿。
మూర్ఖంగా నేను చేసిన పాపాల వల్ల నాకు కలిగిన గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి.
6 我疼痛,大大拳曲, 終日哀痛。
నేను పూర్తిగా కుంగిపోయాను. రోజంతా నాకు అవమానం కలుగుతుంది.
7 我滿腰是火; 我的肉無一完全。
అవమానం నన్ను ముంచెత్తివేసింది. నా శరీరమంతా రోగగ్రస్థమైంది.
8 我被壓傷,身體疲倦; 因心裏不安,我就唉哼。
నేను మొద్దుబారిపోయాను. పూర్తిగా నలిగిపోయాను. నా హృదయంలోని వేదన కారణంగా మూలుగుతున్నాను.
9 主啊,我的心願都在你面前; 我的歎息不向你隱瞞。
ప్రభూ, నా హృదయపు లోతుల్లోని తీవ్ర ఆకాంక్షలు నువ్వు అర్థం చేసుకుంటావు. నా మూల్గులు నీకు వినిపిస్తూనే ఉన్నాయి.
10 我心跳動,我力衰微, 連我眼中的光也沒有了。
౧౦నా గుండె వేగంగా కొట్టుకుంటున్నది. నా శక్తి క్షీణించిపోతూ ఉంది. నా కంటి చూపు మసకబారుతూ ఉంది.
11 我的良朋密友因我的災病都躲在旁邊站着; 我的親戚本家也遠遠地站立。
౧౧నా ఈ పరిస్థితి కారణంగా నా స్నేహితులూ, తోటివాళ్ళూ నన్ను వదిలేశారు. నా పొరుగువాళ్ళు దూరంగా నిలబడ్డారు.
12 那尋索我命的設下網羅; 那想要害我的口出惡言, 終日思想詭計。
౧౨నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు నా కోసం ఉచ్చు బిగిస్తున్నారు. నాకు హాని కలగాలని చూసేవాళ్ళు వినాశకరమైన మాటలు పలుకుతున్నారు. రోజంతా మోసపూరితంగా మాట్లాడుతున్నారు
13 但我如聾子不聽, 像啞巴不開口。
౧౩కానీ నేను చెవిటివాడిలాగా ఏమీ వినకుండా ఉన్నాను. మూగవాడిలాగా ఏమీ మాట్లాడకుండా ఉన్నాను.
14 我如不聽見的人, 口中沒有回話。
౧౪ఏమీ విననివాడిలాగా నేను ఉన్నాను. జవాబు చెప్పలేని వాడిలాగా ఉన్నాను.
15 耶和華啊,我仰望你! 主-我的上帝啊,你必應允我!
౧౫యెహోవా, నేను తప్పకుండా నీ కోసం వేచి ఉన్నాను. ప్రభూ, నా దేవా, నాకు నువ్వు జవాబిస్తావు.
16 我曾說:恐怕他們向我誇耀; 我失腳的時候,他們向我誇大。
౧౬నా శత్రువులు నాపై రెచ్చిపోకుండా ఉండటానికి నేనిది చెప్తున్నాను. నేను కాలు జారితే వాళ్ళు నన్ను భయంకరంగా హింసిస్తారు.
17 我幾乎跌倒; 我的痛苦常在我面前。
౧౭నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిరంతర వేదనలో ఉన్నాను.
18 我要承認我的罪孽; 我要因我的罪憂愁。
౧౮నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నా పాపాన్ని గూర్చి చింతిస్తున్నాను.
19 但我的仇敵又活潑又強壯, 無理恨我的增多了。
౧౯కానీ నా శత్రువులు అసంఖ్యాకంగా ఉన్నారు. అన్యాయంగా నన్ను ద్వేషించేవాళ్ళు చాలామంది ఉన్నారు.
20 以惡報善的與我作對, 因我是追求良善。
౨౦నేను వాళ్లకు చేసిన మేలుకు బదులుగా కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినా వాళ్ళు నాపై నిందలు వేస్తున్నారు.
21 耶和華啊,求你不要撇棄我! 我的上帝啊,求你不要遠離我!
౨౧యెహోవా, నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నాకు దూరంగా ఉండవద్దు.
22 拯救我的主啊,求你快快幫助我!
౨౨ప్రభూ, నా రక్షణకి ఆధారమా, త్వరగా వచ్చి నాకు సహాయం చెయ్యి.

< 詩篇 38 >