< 詩篇 18 >
1 耶和華的僕人大衛的詩,交與伶長。當耶和華救他脫離一切仇敵和掃羅之手的日子,他向耶和華念這詩的話。說: 耶和華,我的力量啊,我愛你!
౧ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. సౌలునుంచీ, తన శత్రువులందరినుంచీ యెహోవా తనను విడిపించినప్పుడు యెహోవా సేవకుడైన దావీదు పాడిన స్తుతి కీర్తన యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
2 耶和華是我的巖石,我的山寨,我的救主, 我的上帝,我的磐石,我所投靠的。 他是我的盾牌, 是拯救我的角,是我的高臺。
౨యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు.
3 我要求告當讚美的耶和華; 這樣我必從仇敵手中被救出來。
౩స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను నివేదన చేస్తాను, నేను నా శత్రువులనుంచి రక్షణ పొందుతాను.
౪మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, దుర్మార్గులు వరద ప్రవాహంలా నా మీద పడి నన్ను అణిచివేస్తున్నారు
5 陰間的繩索纏繞我, 死亡的網羅臨到我。 (Sheol )
౫పాతాళ పాశాలు నన్ను చుట్టుముట్టాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. (Sheol )
6 我在急難中求告耶和華, 向我的上帝呼求。 他從殿中聽了我的聲音; 我在他面前的呼求入了他的耳中。
౬నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది.
7 那時,因他發怒,地就搖撼戰抖; 山的根基也震動搖撼。
౭అప్పుడు భూమి కంపించి వణికింది. దేవుడు కోపంగా ఉన్నాడు గనక పర్వతాల పునాదులు కూడా కదిలి వణికాయి.
8 從他鼻孔冒煙上騰; 從他口中發火焚燒,連炭也着了。
౮ఆయన ముక్కు పుటాలనుంచి పొగ లేచింది. ఆయన నోట్లోనుంచి అగ్ని వచ్చి నిప్పులు రగిలించింది.
౯ఆయన ఆకాశాలను తెరిచి కిందకు వచ్చాడు. ఆయన పాదాల కింద చిమ్మచీకటి ఉంది.
౧౦కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ఆయన తేలి వచ్చాడు.
11 他以黑暗為藏身之處, 以水的黑暗、天空的厚雲為他四圍的行宮。
౧౧తన చుట్టూ అంధకారాన్ని, దట్టమైన వర్షమేఘాలను గుడారంగా చేశాడు.
12 因他面前的光輝, 他的厚雲行過便有冰雹火炭。
౧౨ఆయన ఎదుట మెరుపులు, వడగళ్ళు, మండుతున్న నిప్పులు కురిసాయి.
13 耶和華也在天上打雷; 至高者發出聲音便有冰雹火炭。
౧౩యెహోవా ఆకాశంలో ఉరిమాడు! సర్వోన్నతుడు సింహనాదం చేసి వడగళ్ళు, మండుతున్న నిప్పులు కుమ్మరించాడు.
14 他射出箭來,使仇敵四散; 多多發出閃電,使他們擾亂。
౧౪ఆయన తన బాణాలు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాడు. మెరుపులు మెండుగా మెరిపించి వాళ్ళను బెదరగొట్టాడు.
15 耶和華啊,你的斥責一發, 你鼻孔的氣一出, 海底就出現, 大地的根基也顯露。
౧౫యెహోవా, నీ నాసికారంధ్రాల ఊపిరికి నీ సింహనాదానికి ప్రవాహాలు బయలు దేరాయి. భూమి పునాదులు బయటపడ్డాయి.
౧౬పైనుంచి చెయ్యి చాపి ఆయన నన్ను అందుకున్నాడు. దూసుకొచ్చే జలప్రవాహాలనుంచి నన్ను బయటకు లాగాడు.
17 他救我脫離我的勁敵和那些恨我的人, 因為他們比我強盛。
౧౭నన్ను ద్వేషించే నా బలమైన శత్రువులనుంచి ఆయన నన్ను రక్షించాడు. ఎందుకంటే వాళ్ళను ఎదుర్కొనే బలం నాకు లేదు.
18 我遭遇災難的日子,他們來攻擊我; 但耶和華是我的倚靠。
౧౮ఆపత్కాలంలో వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు యెహోవా నన్ను ఆదుకున్నాడు.
19 他又領我到寬闊之處; 他救拔我,因他喜悅我。
౧౯విశాలమైన స్థలానికి ఆయన నన్ను తీసుకు వచ్చాడు. నన్నుబట్టి ఆయన సంతోషించాడు గనక ఆయన నన్ను రక్షించాడు.
20 耶和華按着我的公義報答我, 按着我手中的清潔賞賜我。
౨౦నా నిర్దోషత్వాన్నిబట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా చేతులు పరిశుభ్రంగా ఉన్నాయి గనక ఆయన నన్ను పునరుద్ధరించాడు.
21 因為我遵守了耶和華的道, 未曾作惡離開我的上帝。
౨౧ఎందుకంటే యెహోవా మార్గాలు నేను అనుసరించాను. దుర్మార్గంగా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు.
22 他的一切典章常在我面前; 他的律例我也未曾丟棄。
౨౨ఆయన న్యాయవిధులన్నీ నా ఎదుట ఉన్నాయి. ఆయన శాసనాలనుంచి నేను వెనుదిరగలేదు.
23 我在他面前作了完全人; 我也保守自己遠離我的罪孽。
౨౩పాపం నుంచి నేను దూరంగా ఉన్నాను. ఆయన దృష్టిలో నేను యథార్ధంగా ఉన్నాను.
24 所以,耶和華按我的公義, 按我在他眼前手中的清潔償還我。
౨౪కాబట్టి, నేను నిర్దోషిగా ఉన్న కారణంగా, తన దృష్టిలో నా చేతులు పరిశుభ్రంగా ఉన్న కారణంగా యెహోవా నన్ను పునరుద్ధరించాడు.
25 慈愛的人,你以慈愛待他; 完全的人,你以完全待他。
౨౫నిర్దోషుల పట్ల నిన్ను నువ్వు నిర్దోషివిగా కనపరచుకుంటావు. నమ్మదగిన వాళ్ళ పట్ల నువ్వు నమ్మదగిన వాడివిగా కనపరచుకుంటావు.
26 清潔的人,你以清潔待他; 乖僻的人,你以彎曲待他。
౨౬స్వచ్ఛంగా ఉన్నవాళ్ళ పట్ల నిన్ను నువ్వు స్వచ్ఛంగా కనపరచుకుంటావు. అయితే వక్రబుద్ధి గలవాళ్ళ పట్ల వికటంగా ఉంటావు.
27 困苦的百姓,你必拯救; 高傲的眼目,你必使他降卑。
౨౭బాధపడే వాళ్ళను నువ్వు రక్షిస్తావు. కాని, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు!
28 你必點着我的燈; 耶和華-我的上帝必照明我的黑暗。
౨౮నా దీపానికి వెలుగును ఇచ్చేవాడివి నువ్వే. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేస్తాడు.
౨౯నీవల్ల నేను అడ్డంకులను అధిగమించగలను. నా దేవుని వల్ల అడ్డుగోడలు దూకగలను.
30 至於上帝,他的道是完全的; 耶和華的話是煉淨的。 凡投靠他的,他便作他們的盾牌。
౩౦దేవుని విషయమైతే, ఆయన పరిపూర్ణుడు. యెహోవా వాక్కు స్వచ్ఛమైనది. ఆయనలో ఆశ్రయం పొందిన వాళ్లకు ఆయన ఒక డాలు.
31 除了耶和華,誰是上帝呢? 除了我們的上帝,誰是磐石呢?
౩౧యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుడు తప్ప ఆశ్రయశిల ఏది?
32 惟有那以力量束我的腰、 使我行為完全的,他是上帝。
౩౨ఒక నడికట్టులాగా నాకు బలం ధరింపజేసేవాడు ఆయనే. నిరపరాధిని తన మార్గంలో నడిపించేవాడు ఆయనే.
33 他使我的腳快如母鹿的蹄, 又使我在高處安穩。
౩౩ఆయన నాకాళ్లు జింక కాళ్లలా చురుగ్గా చేస్తున్నాడు, కొండలమీద నన్ను ఉంచుతున్నాడు.
34 他教導我的手能以爭戰, 甚至我的膀臂能開銅弓。
౩౪నా చేతులకు యుద్ధం చెయ్యడం, ఇత్తడి విల్లును వంచడం నేర్పిస్తాడు.
35 你把你的救恩給我作盾牌; 你的右手扶持我; 你的溫和使我為大。
౩౫నీ రక్షణ డాలును నువ్వు నాకిచ్చావు. నీ కుడిచెయ్యి నన్ను ఆదుకుంది, నీ దయ నన్ను గొప్పచేసింది.
౩౬జారిపోకుండా నా పాదాలకింద స్థలం విశాలం చేశావు.
37 我要追趕我的仇敵,並要追上他們; 不將他們滅絕,我總不歸回。
౩౭నా శత్రువులను తరిమి పట్టుకున్నాను. వాళ్ళు నాశనం అయ్యేవరకు నేను వెనుతిరగలేదు.
38 我要打傷他們,使他們不能起來; 他們必倒在我的腳下。
౩౮వాళ్ళు లేవలేనంతగా వాళ్ళను చితకగొట్టాను. వాళ్ళు నా కాళ్ళ కింద పడ్డారు.
39 因為你曾以力量束我的腰,使我能爭戰; 你也使那起來攻擊我的都服在我以下。
౩౯యుద్ధానికి కట్టిన దట్టీలా నువ్వు నాకు బలం ధరింపజేశావు. నా మీదికి లేచిన వాళ్ళను నువ్వు నా కింద పడేశావు.
40 你又使我的仇敵在我面前轉背逃跑, 叫我能以剪除那恨我的人。
౪౦నా శత్రువుల మెడ వెనుకభాగం నువ్వు నాకు అప్పగించావు. నన్ను ద్వేషించిన వాళ్ళను నేను పూర్తిగా నాశనం చేశాను
41 他們呼求,卻無人拯救; 就是呼求耶和華,他也不應允。
౪౧వారు సాయం కోసం మొరపెట్టారు గాని వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు గాని ఆయన వాళ్లకు జవాబివ్వలేదు.
42 我搗碎他們,如同風前的灰塵, 倒出他們,如同街上的泥土。
౪౨అప్పుడు గాలికి ఎగిరే దుమ్ములాగా నేను వాళ్ళను ముక్కలుగా కొట్టాను. వీధుల్లో మట్టిని విసిరేసినట్టు విసిరేశాను.
43 你救我脫離百姓的爭競, 立我作列國的元首; 我素不認識的民必事奉我。
౪౩ప్రజల కలహాల నుంచి నువ్వు నన్ను కాపాడావు. జాతులకు నన్ను సారధిగా చేశావు. నేను ఎరగని ప్రజలు నన్ను సేవిస్తున్నారు.
44 他們一聽見我的名聲就必順從我; 外邦人要投降我。
౪౪నా గురించి వినగానే వాళ్ళు నాకు లోబడుతున్నారు. పరదేశులు బలవంతంగా నాకు సాష్టాంగపడ్డారు.
౪౫తమ దుర్గాలనుంచి పరదేశులు వణుకుతూ బయటకు వచ్చారు.
46 耶和華是活神。 願我的磐石被人稱頌; 願救我的上帝被人尊崇。
౪౬యెహోవా జీవం గలవాడు. నా ఆశ్రయశిల స్తుతి పొందుతాడు గాక. నా రక్షణకర్త అయిన దేవుడు ఘనత పొందుతాడు గాక.
47 這位上帝,就是那為我伸冤、 使眾民服在我以下的。
౪౭ఆయన నా కోసం పగ తీర్చే దేవుడు. జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.
48 你救我脫離仇敵, 又把我舉起,高過那些起來攻擊我的; 你救我脫離強暴的人。
౪౮ఆయన నా శత్రువుల నుంచి నన్ను విడిపించాడు! నా మీదకి లేచిన వారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించావు. హింసాత్మక వ్యక్తుల నుంచి నువ్వు నన్ను రక్షించావు.
49 耶和華啊,因此我要在外邦中稱謝你, 歌頌你的名。
౪౯అందువల్ల యెహోవా, జాతులలో నేను నీకు కృతజ్ఞత తెలియజేస్తాను. నీ నామానికి స్తుతుల కీర్తన పాడతాను!
50 耶和華賜極大的救恩給他所立的王, 施慈愛給他的受膏者, 就是給大衛和他的後裔,直到永遠。
౫౦దేవుడు తన రాజుకు గొప్ప జయం ఇస్తాడు. తాను అభిషేకించిన వాడికి, దావీదుకు అతని సంతానానికి, శాశ్వతంగా ఆయన తన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తాడు.