< 詩篇 113 >
1 你們要讚美耶和華! 耶和華的僕人哪,你們要讚美, 讚美耶和華的名!
౧యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి.
౨ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి.
3 從日出之地到日落之處, 耶和華的名是應當讚美的!
౩సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది.
౪యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశాన్ని అంటుతున్నది.
౫ఉన్నత స్థలంలో ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు?
౬ఆయన భూమినీ ఆకాశాన్నీ వంగి చూస్తున్నాడు.
౭ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు.
౮ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడం కోసం ఆయన ఇలా చేస్తాడు.
9 他使不能生育的婦人安居家中, 為多子的樂母。 你們要讚美耶和華!
౯ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.