< 尼希米記 10 >

1 簽名的是:哈迦利亞的兒子-省長尼希米,和西底家;
ముద్రలు వేసినవారు ఎవరంటే, హకల్యా కొడుకు, అధికారి అయిన నెహెమ్యా. ముద్రలు వేసిన యాజకులు సిద్కీయా,
2 祭司:西萊雅、亞撒利雅、耶利米、
శెరాయా, అజర్యా, యిర్మీయా,
3 巴施戶珥、亞瑪利雅、瑪基雅、
పషూరు, అమర్యా, మల్కీయా,
4 哈突、示巴尼、瑪鹿、
హట్టూషు, షెబన్యా, మల్లూకు,
5 哈琳、米利末、俄巴底亞、
హారిము, మెరేమోతు, ఓబద్యా,
6 但以理、近頓、巴錄、
దానియేలు, గిన్నెతోను, బారూకు,
7 米書蘭、亞比雅、米雅民、
మెషుల్లాము, అబీయా, మీయామిను,
8 瑪西亞、璧該、示瑪雅;
మయజ్యా, బిల్గయి, షెమయా. వీరంతా యాజక ధర్మం నిర్వహించేవారు.
9 又有利未人,就是亞散尼的兒子耶書亞、希拿達的子孫賓內、甲篾;
లేవీ గోత్రికుల నుండి అజన్యా మనవడు యేషూవ హేనాదాదు కొడుకులు బిన్నూయి, కద్మీయేలు,
10 還有他們的弟兄示巴尼、荷第雅、基利他、毗萊雅、哈難、
౧౦వారి బంధువులు షెబన్యా, హోదీయా, కెలీటా, పెలాయా, హానాను,
11 米迦、利合、哈沙比雅、
౧౧మీకా, రెహోబు, హషబ్యా,
12 撒刻、示利比、示巴尼、
౧౨జక్కూరు, షేరేబ్యా, షెబన్యా,
13 荷第雅、巴尼、比尼努;
౧౩హోదీయా, బానీ, బెనీను అనేవాళ్ళు.
14 又有民的首領,就是巴錄、巴哈‧摩押、以攔、薩土、巴尼、
౧౪ప్రజల్లో ప్రధానుల నుండి పరోషు, పహత్మోయాబు, ఏలాము, జత్తూ, బానీ,
15 布尼、押甲、比拜、
౧౫బున్నీ, అజ్గాదు, బేబై,
16 亞多尼雅、比革瓦伊、亞丁、
౧౬అదోనీయా, బిగ్వయి, ఆదీను,
17 亞特、希西家、押朔、
౧౭అటేరు, హిజ్కియా, అజ్జూరు,
18 荷第雅、哈順、比賽、
౧౮హోదీయా, హాషుము, బేజయి,
19 哈拉、亞拿突、尼拜、
౧౯హారీపు, అనాతోతు, నేబైమగ్పీ,
20 抹比押、米書蘭、希悉、
౨౦యాషు, మెషుల్లాము, హెజీరు,
21 米示薩別、撒督、押杜亞、
౨౧మెషేజ, బెయేలు, సాదోకు, యద్దూవ,
22 毗拉提、哈難、亞奈雅、
౨౨పెలట్యా, హానాను, అనాయా,
23 何細亞、哈拿尼雅、哈述、
౨౩హోషేయ, హనన్యా, హష్షూబు, హల్లోహేషు, పిల్హా, షోబేకు,
24 哈羅黑、毗利哈、朔百、
౨౪రెహూము, హషబ్నా, మయశేయా,
25 利宏、哈沙拿、瑪西雅、
౨౫అహీయా, హానాను, ఆనాను,
26 亞希雅、哈難、亞難、
౨౬మల్లూకు, హారిము, బయనా అనేవాళ్ళు.
27 瑪鹿、哈琳、巴拿。
౨౭ప్రజల్లో మిగిలినవారు, అంటే దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపుతూ అన్యులతో కలవకుండా తమను తాము ప్రత్యేకపరుచుకొన్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయంలో సేవ చేసేవారంతా,
28 其餘的民、祭司、利未人、守門的、歌唱的、尼提寧,和一切離絕鄰邦居民歸服上帝律法的,並他們的妻子、兒女,凡有知識能明白的,
౨౮దేవుని సేవకుడైన మోషే నియమించిన దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొంటూ, ప్రభువైన యెహోవా నిబంధనలు, కట్టడలు ఆచరిస్తామని శపథం చేసి ఒట్టు పెట్టుకోవడానికి సమకూడారు.
29 都隨從他們貴冑的弟兄,發咒起誓,必遵行上帝藉他僕人摩西所傳的律法,謹守遵行耶和華-我們主的一切誡命、典章、律例;
౨౯వారితోపాటు వారి భార్యలు, కొడుకులు, కూతుళ్ళు, తెలివితేటలున్న వారంతా తమ బంధువులతో ఏకమయ్యారు.
30 並不將我們的女兒嫁給這地的居民,也不為我們的兒子娶他們的女兒。
౩౦మేము అన్య దేశాల ప్రజలకు మా కూతుళ్ళను, వాళ్ళ కూతుళ్ళను మా కొడుకులకు ఇచ్చి పుచ్చుకోమని ప్రమాణం చేశాం.
31 這地的居民若在安息日,或甚麼聖日,帶了貨物或糧食來賣給我們,我們必不買。每逢第七年必不耕種,凡欠我們債的必不追討。
౩౧అన్య దేశాల ప్రజలు విశ్రాంతి దినానగానీ, పరిశుద్ధ దినానగానీ అమ్మే వస్తువులను, భోజన పదార్ధాలను కొనుక్కోమనీ, ఏడవ సంవత్సరంలో భూమిని సేద్యం చేయకుండా విడిచిపెడతామనీ ఆ సంవత్సరంలో మాకు రుణ పడి ఉన్నవారి బాకీలు మాఫీ చేస్తామనీ నిర్ణయించుకొన్నాం.
32 我們又為自己定例,每年各人捐銀一舍客勒三分之一,為我們上帝殿的使用,
౩౨ఇంకా మన దేవుని మందిరపు సేవ కోసం ప్రతి ఏడూ తులం వెండిలో మూడవ వంతు ఇస్తామని తీర్మానం చేసుకొన్నాం.
33 就是為陳設餅、常獻的素祭,和燔祭,安息日、月朔、節期所獻的與聖物,並以色列人的贖罪祭,以及我們上帝殿裏一切的費用。
౩౩బల్లమీద పెట్టే రొట్టె విషయంలో, నిత్యమూ కొనసాగే నైవేద్యం విషయంలో, దహన బలి విషయంలో, విశ్రాంతి దినం ఆచరించే విషయంలో, అమావాస్యల విషయంలో, నియామక పండగల విషయంలో, ప్రతిష్ట అయిన వస్తువుల విషయంలో, ఇశ్రాయేలీయుల ప్రాయశ్చిత్త పాప పరిహారార్థ బలుల విషయంలో, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలో ఆ విధంగా నడుచుకొంటామని నిర్ణయం తీసుకున్నాం.
34 我們的祭司、利未人,和百姓都掣籤,看每年是哪一族按定期將獻祭的柴奉到我們上帝的殿裏,照着律法上所寫的,燒在耶和華-我們上帝的壇上。
౩౪ఇంకా, మా పూర్వీకుల వంశాచారం ప్రకారం ప్రతి ఏడూ నిర్ణయించిన సమయాల్లో ధర్మశాస్త్ర గ్రంథంలో రాసినట్టు దేవుడైన యెహోవా బలిపీఠంపై దహించడానికి దేవుని మందిరానికి కట్టెలు, అర్పణలు యాజకుల నుండి, లేవీయుల నుండి, ప్రజలనుండి ఎవరెవరు తీసుకు రావాలో చీట్లు వేసి నిర్ణయించుకొన్నాం.
35 又定每年將我們地上初熟的土產和各樣樹上初熟的果子都奉到耶和華的殿裏。
౩౫మా భూమి సాగు నుండి, సకల వృక్షాల నుండి ఫలాలూ ప్రథమ ఫలాలూ ప్రతి సంవత్సరమూ ప్రభువు మందిరానికి తీసుకురావాలని నిర్ణయించున్నాం.
36 又照律法上所寫的,將我們頭胎的兒子和首生的牛羊都奉到我們上帝的殿,交給我們上帝殿裏供職的祭司;
౩౬ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్నట్టు మా కొడుకుల్లో మొదటి వారిని, మా పశువుల్లో, మందల్లో తొలిచూలు పిల్లలను మన దేవుని మందిరంలో పరిచర్య చేసే యాజకుల దగ్గరికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం.
37 並將初熟之麥子所磨的麵和舉祭、各樣樹上初熟的果子、新酒與油奉給祭司,收在我們上帝殿的庫房裏,把我們地上所產的十分之一奉給利未人,因利未人在我們一切城邑的土產中當取十分之一。
౩౭అంతేకాక, మా పిండిలో ప్రథమ ఫలం, ప్రతిష్టితమైన అర్పణలు, అన్ని రకాల చెట్ల పళ్ళూ, ద్రాక్షారసం, నూనె మొదలైనవాటిని మా దేవుని మందిరపు గదుల్లోకి యాజకుల దగ్గరికి తీసుకురావాలనీ, మా భూమి సాగులో పదవ వంతు లేవీయుల దగ్గరికి తీసుకురావాలనీ, అన్ని పట్టణాల్లో ఉన్న మా పంట సాగులో పదవ భాగాన్ని లేవీయులకు ఇవ్వాలనీ నిర్ణయించుకున్నాం.
38 利未人取十分之一的時候,亞倫的子孫中,當有一個祭司與利未人同在。利未人也當從十分之一中取十分之一,奉到我們上帝殿的屋子裏,收在庫房中。
౩౮లేవీయులు పదవ వంతును తెచ్చినప్పుడు అహరోను సంతానం వాడైన ఒక యాజకుడు వారితో ఉండాలనీ, పదోవంతులో ఒక వంతు దేవుని మందిరంలో ఉన్న ఖజానాలో జమ చేయాలనీ నిర్ణయించుకొన్నాం.
39 以色列人和利未人要將五穀、新酒,和油為舉祭,奉到收存聖所器皿的屋子裏,就是供職的祭司、守門的、歌唱的所住的屋子。這樣,我們就不離棄我們上帝的殿。
౩౯ఇశ్రాయేలీయులు, లేవీయులు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె తెచ్చినప్పుడు పరిచర్య చేసే యాజకులు, ద్వార పాలకులు, గాయకులు వాటిని తీసుకు పవిత్ర పాత్రలను ఉంచే ఆలయం గదుల్లో ఉంచాలి. మా దేవుని మందిరం పనులను నిర్ల్యక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నాం.

< 尼希米記 10 >