< 約伯記 22 >

1 提幔人以利法回答說:
అప్పుడు తేమాను వాడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు.
2 人豈能使上帝有益呢? 智慧人但能有益於己。
మానవమాత్రులు దేవునికి ప్రయోజనకారులౌతారా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులు.
3 你為人公義,豈叫全能者喜悅呢? 你行為完全,豈能使他得利呢?
నువ్వు నీతిమంతుడివై ఉండడం సర్వశక్తుడైన దేవునికి సంతోషమా? నువ్వు యథార్థవంతుడివై ప్రవర్తించడం ఆయనకు లాభకరమా?
4 豈是因你敬畏他 就責備你、審判你嗎?
ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఆయన నిన్ను గద్దిస్తాడా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడుతాడా?
5 你的罪惡豈不是大嗎? 你的罪孽也沒有窮盡;
నీ చెడుతనం గొప్పది కాదా? నీ దోషాలు మితి లేనివి కావా?
6 因你無故強取弟兄的物為當頭, 剝去貧寒人的衣服。
ఏమీ ఇవ్వకుండానే నీ సోదరుల దగ్గర నువ్వు తాకట్టు పెట్టుకున్నావు. వస్త్ర హీనుల బట్టలు తీసుకున్నావు.
7 困乏的人,你沒有給他水喝; 飢餓的人,你沒有給他食物。
దాహంతో సొమ్మసిల్లిన వారికి నీళ్లియ్యలేదు. ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టలేదు.
8 有能力的人就得地土; 尊貴的人也住在其中。
బాహుబలం గల వాడికే భూమి లభిస్తుంది. గొప్పవాడు అనిపించుకున్న వాడు దానిలో నివసిస్తాడు.
9 你打發寡婦空手回去, 折斷孤兒的膀臂。
వితంతువులను వట్టి చేతులతో పంపివేశావు. తండ్రి లేనివారి చేతులు విరగ్గొట్టావు.
10 因此,有網羅環繞你, 有恐懼忽然使你驚惶;
౧౦అందుకే బోనులు నిన్ను చుట్టుముడుతున్నాయి. అకస్మాత్తుగా కలిగే భీతి నిన్ను హడలగొడుతున్నది.
11 或有黑暗蒙蔽你, 並有洪水淹沒你。
౧౧నిన్ను చిక్కించుకొన్న అంధకారాన్ని నువ్వు చూడడం లేదా? నిన్ను ముంచెత్తబోతున్న ప్రళయ జలాలను నువ్వు చూడడం లేదా?
12 上帝豈不是在高天嗎? 你看星宿何其高呢!
౧౨దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రాల ఔన్నత్యాన్ని చూడు. అవి ఎంత ఎత్తులో ఉన్నాయి!
13 你說:上帝知道甚麼? 他豈能看透幽暗施行審判呢?
౧౩“దేవుడికి ఏమి తెలుసు? గాఢాంధకారంలోనుండి ఆయన న్యాయం కనుగొంటాడా?
14 密雲將他遮蓋,使他不能看見; 他周遊穹蒼。
౧౪దట్టమైన మేఘాలు ఆయనకు అడ్డుగా ఉన్నాయి. ఆయన మనలను చూడలేడు. ఆకాశ గోపురంలో ఆయన తిరుగుతున్నాడు” అని నీవనుకుంటావు.
15 你要依從上古的道嗎? 這道是惡人所行的。
౧౫పూర్వకాలం నుండి దుష్టులు అనుసరించిన మార్గాన్ని నువ్వు అనుసరిస్తావా?
16 他們未到死期,忽然除滅; 根基毀壞,好像被江河沖去。
౧౬తమ కాలం రాకముందే వారు హటాత్తుగా నిర్మూలమైపోయారు. వారి పునాదులు నదీ ప్రవాహలవలె కొట్టుకు పోయాయి.
17 他們向上帝說:離開我們吧! 又說:全能者能把我們怎麼樣呢?
౧౭“మా దగ్గర నుండి తొలగి పో” అని దేవునితో అంటారు. “సర్వశక్తుడు మాకు ఏమి చేస్తాడులే” అంటారు.
18 哪知上帝以美物充滿他們的房屋; 但惡人所謀定的離我好遠。
౧౮అయినా ఆయన మంచి పదార్థాలతో వారి ఇళ్ళు నింపాడు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరం అగు గాక.
19 義人看見他們的結局就歡喜; 無辜的人嗤笑他們,
౧౯నీతిమంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. నిర్దోషులు వారిని హేళన చేస్తారు.
20 說:那起來攻擊我們的果然被剪除, 其餘的都被火燒滅。
౨౦“మన విరోధులు నిశ్చయంగా నిర్మూలమైపోయారు. వారి సంపదను అగ్ని కాల్చివేసింది” అంటారు.
21 你要認識上帝,就得平安; 福氣也必臨到你。
౨౧ఆయనతో సహవాసం చేస్తే నీకు శాంతిసమాధానాలు కలుగుతాయి. ఆ విధంగా నీకు మేలు కలుగుతుంది.
22 你當領受他口中的教訓, 將他的言語存在心裏。
౨౨ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అవలంబించు. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో.
23 你若歸向全能者,從你帳棚中遠除不義, 就必得建立。
౨౩సర్వశక్తుని వైపు తిరిగి నీ నివాసాల్లో నుండి దుర్మార్గాన్ని దూరంగా తొలగిస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు.
24 要將你的珍寶丟在塵土裏, 將俄斐的黃金丟在溪河石頭之間;
౨౪మట్టిలో నీ సిరిసంపదలను, సెలయేటి నీటిలో ఓఫీరు బంగారాన్ని పారవెయ్యి.
25 全能者就必為你的珍寶, 作你的寶銀。
౨౫అప్పుడు సర్వశక్తుడు నీకు సువర్ణంగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు.
26 你就要以全能者為喜樂, 向上帝仰起臉來。
౨౬అప్పుడు సర్వశక్తునిలో నువ్వు ఆనందిస్తావు. దేవుని వైపు నీ ముఖం ఎత్తుతావు.
27 你要禱告他,他就聽你; 你也要還你的願。
౨౭నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నీ మొక్కుబళ్లు నువ్వు చెల్లిస్తావు.
28 你定意要做何事,必然給你成就; 亮光也必照耀你的路。
౨౮నువ్వు దేనినైనా ఆలోచన చేస్తే అది నీకు స్థిరపడుతుంది. నీ మార్గాలపై వెలుగు ప్రకాశిస్తుంది.
29 人使你降卑,你仍可說:必得高升; 謙卑的人,上帝必然拯救。
౨౯దేవుడు గర్విష్టులను వంచుతాడు. కళ్ళు దించుకునే వారిని కాపాడతాడు.
30 人非無辜,上帝且要搭救他; 他因你手中清潔,必蒙拯救。
౩౦నిర్దోషి కానివాడినైనా ఆయన విడిపిస్తాడు. అతడు నీ చేతుల శుద్ధి మూలంగా విడుదల పొందుతాడు.

< 約伯記 22 >