< 何西阿書 14 >

1 以色列啊,你要歸向耶和華-你的上帝; 你是因自己的罪孽跌倒了。
ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు.
2 當歸向耶和華, 用言語禱告他說: 求你除淨罪孽,悅納善行; 這樣,我們就把嘴唇的祭代替牛犢獻上。
ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి. మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు. అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము.
3 我們不向亞述求救, 不騎埃及的馬, 也不再對我們手所造的說: 你是我們的上帝。 因為孤兒在你-耶和華那裏得蒙憐憫。
అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు. మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము. ‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.”
4 我必醫治他們背道的病, 甘心愛他們; 因為我的怒氣向他們轉消。
వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను. వారి మీదనున్న నా కోపం చల్లారింది. మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను.
5 我必向以色列如甘露; 他必如百合花開放, 如黎巴嫩的樹木扎根。
చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు.
6 他的枝條必延長; 他的榮華如橄欖樹; 他的香氣如黎巴嫩的香柏樹。
అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది.
7 曾住在他蔭下的必歸回, 發旺如五穀,開花如葡萄樹。 他的香氣如黎巴嫩的酒。
అతని నీడలో నివసించేవారు తిరిగి వస్తారు. ధాన్యం వలే వారు తిరిగి మొలుస్తారు. ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు. లెబానోను ద్రాక్షరసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది.
8 以法蓮必說: 我與偶像還有甚麼關涉呢? 我-耶和華回答他,也必顧念他。 我如青翠的松樹; 你的果子從我而得。
ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?” నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను. నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను. నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాణ్ణి. నావల్లనే నీకు ఫలం కలుగుతుంది.
9 誰是智慧人?可以明白這些事; 誰是通達人?可以知道這一切。 因為,耶和華的道是正直的; 義人必在其中行走, 罪人卻在其上跌倒。
ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి. నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.

< 何西阿書 14 >