< 哈巴谷書 3 >

1 先知哈巴谷的禱告,調用流離歌。
ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన (వాద్యాలతో పాడదగినది).
2 耶和華啊,我聽見你的名聲就懼怕。 耶和華啊,求你在這些年間復興你的作為, 在這些年間顯明出來; 在發怒的時候以憐憫為念。
యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా, ఈ సంవత్సరాల్లో నీ కార్యం నూతన పరచు. ఈ రోజుల్లో నీ పనులు తెలియచెయ్యి. కోపంలో కనికరం మరచిపోవద్దు.
3 上帝從提幔而來; 聖者從巴蘭山臨到。 (細拉) 他的榮光遮蔽諸天; 頌讚充滿大地。
దేవుడు తేమానులో నుండి వచ్చాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేస్తున్నాడు (సెలా) ఆయన మహిమ ఆకాశమండలమంతటా కనబడుతున్నది. భూమి ఆయన స్తుతితో నిండి ఉంది.
4 他的輝煌如同日光; 從他手裏射出光線, 在其中藏着他的能力。
ఆయన హస్తాలనుండి కిరణాలు వెలువడుతున్నాయి. అక్కడ ఆయన తన బలం దాచి ఉంచాడు.
5 在他前面有瘟疫流行; 在他腳下有熱症發出。
ఆయనకు ముందుగా తెగుళ్లు నడుస్తున్నాయి. ఆయన అడుగుజాడల్లో అరిష్టాలు వెళ్తున్నాయి.
6 他站立,量了大地, 觀看,趕散萬民。 永久的山崩裂; 長存的嶺塌陷; 他的作為與古時一樣。
ఆయన నిలబడి భూమిని కొలిచాడు. రాజ్యాలను కంపింప జేశాడు. నిత్య పర్వతాలు బద్దలైపోయాయి. పురాతన గిరులు అణిగి పోయాయి. ఆయన మార్గాలు శాశ్వత మార్గాలు.
7 我見古珊的帳棚遭難, 米甸的幔子戰兢。
కూషీయుల డేరాల్లో ఉపద్రవం కలగడం నేను చూశాను. మిద్యాను దేశస్థుల గుడారాల తెరలు గజగజ వణికాయి.
8 耶和華啊,你乘在馬上, 坐在得勝的車上, 豈是不喜悅江河、 向江河發怒氣、 向洋海發憤恨嗎?
యెహోవా, నదుల మీద నీకు కోపం కలిగిందా? నదుల మీద నీకు ఉగ్రత కలిగిందా? సముద్రం మీద నీకు ఆగ్రహం కలిగిందా? నువ్వు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ రక్షణ రథం ఎక్కి రావడం అందుకేనా?
9 你的弓全然顯露, 向眾支派所起的誓都是可信的。 (細拉) 你以江河分開大地。
విల్లు వరలోనుండి తీశావు. బాణాలు ఎక్కుపెట్టావు. భూమిని బద్దలు చేసి నదులు ప్రవహింపజేశావు.
10 山嶺見你,無不戰懼; 大水氾濫過去, 深淵發聲,洶湧翻騰。
౧౦పర్వతాలు నిన్ను చూసి మెలికలు తిరిగాయి. జలాలు వాటిపై ప్రవాహాలుగా పారుతాయి. సముద్రాగాధం ఘోషిస్తూ తన కెరటాలు పైకెత్తుతుంది.
11 因你的箭射出發光, 你的槍閃出光耀, 日月都在本宮停住。
౧౧నీ ఈటెలు తళతళలాడగా ఎగిరే నీ బాణాల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ ఉన్నత నివాసాల్లో ఆగిపోతారు.
12 你發忿恨通行大地, 發怒氣責打列國,如同打糧。
౧౨బహు రౌద్రంతో నీవు భూమి మీద సంచరిస్తున్నావు. మహోగ్రుడివై జాతులను అణగదొక్కుతున్నావు.
13 你出來要拯救你的百姓, 拯救你的受膏者, 打破惡人家長的頭, 露出他的腳,直到頸項。 (細拉)
౧౩నీ ప్రజలను రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. నీవు నియమించిన అభిషిక్తుణ్ణి రక్షించడానికి బయలు దేరుతున్నావు. దుష్టుల కుటుంబికుల్లో ప్రధానుడొకడైనా ఉండకుండాా వారి తలను మెడను ఖండించి నిర్మూలం చేస్తున్నావు (సెలా)
14 你用敵人的戈矛刺透他戰士的頭; 他們來如旋風,要將我們分散。 他們所喜愛的是暗中吞吃貧民。
౧౪పేదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుతూ తుఫానులాగా వస్తున్న యోధుల తలల్లో వారి ఈటెలే నాటుతున్నావు.
15 你乘馬踐踏紅海, 就是踐踏洶湧的大水。
౧౫నీవు సముద్రాన్ని తొక్కుతూ సంచరిస్తున్నావు. నీ గుర్రాలు మహాసముద్ర జలరాసులను తొక్కుతాయి.
16 我聽見耶和華的聲音, 身體戰兢,嘴唇發顫, 骨中朽爛; 我在所立之處戰兢。 我只可安靜等候災難之日臨到, 犯境之民上來。
౧౬నేను వింటుంటే నా అంతరంగం కలవరపడుతున్నది. ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి. నా ఎముకలు కుళ్లిపోతున్నాయి. నా కాళ్లు వణకుతున్నాయి. జనాలపై దాడి చేసే వారు సమీపించే దాకా నేను ఊరుకుని బాధ దినం కోసం కనిపెట్టవలసి ఉంది.
17 雖然無花果樹不發旺, 葡萄樹不結果, 橄欖樹也不效力, 田地不出糧食, 圈中絕了羊, 棚內也沒有牛;
౧౭అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా, ద్రాక్షచెట్లు ఫలింపక పోయినా, ఒలీవచెట్లు కాపులేక ఉన్నా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా,
18 然而,我要因耶和華歡欣, 因救我的上帝喜樂。
౧౮నేను యెహోవా పట్ల ఆనందిస్తాను. నా రక్షణకర్తయైన నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను.
19 主耶和華是我的力量; 他使我的腳快如母鹿的蹄, 又使我穩行在高處。 這歌交與伶長,用絲弦的樂器。
౧౯ప్రభువైన యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్లను లేడికాళ్లలాగా చేస్తాడు. ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తాడు.

< 哈巴谷書 3 >