< 申命記 4 >
1 「以色列人哪,現在我所教訓你們的律例典章,你們要聽從遵行,好叫你們存活,得以進入耶和華-你們列祖之上帝所賜給你們的地,承受為業。
౧కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీరు జీవించి మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలు, కట్టడలు నేను మీకు బోధిస్తున్నాను. వినండి.
2 所吩咐你們的話,你們不可加添,也不可刪減,好叫你們遵守我所吩咐的,就是耶和華-你們上帝的命令。
౨యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీకందిస్తున్నాను. వాటిని పాటించడంలో నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనినీ కలపకూడదు, దానిలో నుండి దేనినీ తీసివేయకూడదు.
3 耶和華因巴力‧毗珥的事所行的,你們親眼看見了。凡隨從巴力‧毗珥的人,耶和華-你們的上帝都從你們中間除滅了。
౩బయల్పెయోరు విషయంలో యెహోవా చేసినదాన్ని మీరు కళ్ళారా చూశారు కదా. బయల్పెయోరును వెంబడించిన ప్రతి పురుషుడినీ మీ యెహోవా దేవుడు మీ మధ్య ఉండకుండాా నాశనం చేశాడు.
4 惟有你們專靠耶和華-你們上帝的人,今日全都存活。
౪యెహోవా దేవుణ్ణి హత్తుకొన్న మీరంతా ఈ రోజు వరకూ జీవించి ఉన్నారు.
5 我照着耶和華-我上帝所吩咐的將律例典章教訓你們,使你們在所要進去得為業的地上遵行。
౫యెహోవా దేవుడు నాకు ఆజ్ఞాపించిన విధంగా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించాల్సిన కట్టడలను, విధులను మీకు నేర్పాను.
6 所以你們要謹守遵行;這就是你們在萬民眼前的智慧、聰明。他們聽見這一切律例,必說:『這大國的人真是有智慧,有聰明!』
౬ఈ కట్టడలన్నిటినీ మీరు అంగీకరించి వాటిని అనుసరించాలి. వాటిని గూర్చి విన్న ప్రజల దృష్టికి అదే మీ జ్ఞానం, అదే మీ వివేకం. వారు మిమ్మల్ని చూసి “నిజంగా ఈ గొప్ప జాతి జ్ఞానం, వివేచన గల ప్రజలు” అని చెప్పుకుంటారు.
7 哪一大國的人有神與他們相近,像耶和華-我們的上帝、在我們求告他的時候與我們相近呢?
౭ఎందుకంటే మనం ఆయనకు మొర పెట్టిన ప్రతిసారీ మన యెహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జాతికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు?
8 又哪一大國有這樣公義的律例典章、像我今日在你們面前所陳明的這一切律法呢?
౮ఈ రోజు నేను మీకు అప్పగిస్తున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో ఉన్న కట్టడలు, నీతివిధులు కలిగి ఉన్న గొప్ప జనమేది?
9 「你只要謹慎,殷勤保守你的心靈,免得忘記你親眼所看見的事,又免得你一生、這事離開你的心;總要傳給你的子子孫孫。
౯అయితే మీరు జాగ్రత్తపడాలి. మీరు కళ్ళారా చూసిన వాటిని మరచిపోకుండా ఉండేలా, అవి మీ జీవితమంతా మీ హృదయాల్లో నుండి తొలగిపోకుండేలా, మీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కొడుకులకు, వారి కొడుకులకు వాటిని నేర్పించండి.
10 你在何烈山站在耶和華-你上帝面前的那日,耶和華對我說:『你為我招聚百姓,我要叫他們聽見我的話,使他們存活在世的日子,可以學習敬畏我,又可以教訓兒女這樣行。』
౧౦మీరు హోరేబులో మీ యెహోవా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు ఆయన, “నా దగ్గరికి ప్రజలను సమావేశపరచు. వారు ఆ దేశంలో నివసించే రోజులన్నీ నాకు భయపడడం నేర్చుకుని, తమ పిల్లలకు నేర్పేలా వారికి నా మాటలు వినిపిస్తాను అని ఆయన నాతో చెప్పాడు.”
11 那時你們近前來,站在山下;山上有火焰沖天,並有昏黑、密雲、幽暗。
౧౧అప్పుడు మీరు దగ్గరకి వచ్చి ఆ కొండ కింద నిలబడ్డారు. చీకటి, మేఘం, గాఢాంధకారం కమ్మి ఆ కొండ ఆకాశం వరకూ అగ్నితో మండుతుండగా
12 耶和華從火焰中對你們說話,你們只聽見聲音,卻沒有看見形像。
౧౨యెహోవా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడాడు. మీరు ఆ మాటలు విన్నారు గాని ఏ రూపాన్నీ చూడలేదు, స్వరం మాత్రమే విన్నారు.
13 他將所吩咐你們當守的約指示你們,就是十條誡,並將這誡寫在兩塊石版上。
౧౩మీరు పాటించడానికి ఆయన విధించిన నిబంధనను, అంటే పది ఆజ్ఞలను మీకు తెలిపే రెండు రాతి పలకల మీద వాటిని రాశాడు.
14 那時耶和華又吩咐我將律例典章教訓你們,使你們在所要過去得為業的地上遵行。」
౧౪అప్పుడు మీరు నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో పాటించాల్సిన కట్టడలు, విధులను మీకు నేర్పమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.
15 「所以,你們要分外謹慎;因為耶和華在何烈山、從火中對你們說話的那日,你們沒有看見甚麼形像。
౧౫హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల్లో నుండి మీతో మాట్లాడిన రోజు మీరు ఏ స్వరూపాన్నీ చూడలేదు.
16 惟恐你們敗壞自己,雕刻偶像,彷彿甚麼男像女像,
౧౬కాబట్టి మీరు భూమి మీద ఉన్న ఏ జంతువు గాని,
౧౭ఆకాశంలో ఎగిరే రెక్కలున్న ఏ పక్షి గాని,
౧౮నేలమీద పాకే ఏ పురుగు గాని, భూమి కింద ఉన్న నీళ్లలో ఏ చేప గాని, ఆడదైనా మగదైనా ఎలాటి ప్రతిమను ఏ స్వరూపంలోనైనా విగ్రహాన్ని మీ కోసం చేసుకుని చెడిపోకుండేలా జాగ్రత్త పడండి.
19 又恐怕你向天舉目觀看,見耶和華-你的上帝為天下萬民所擺列的日月星,就是天上的萬象,自己便被勾引敬拜事奉它。
౧౯ఆకాశం వైపు చూసి సూర్య చంద్ర నక్షత్రాలను, ఇంకా ఆకాశ సైన్యాలను చూసి మైమరచిపోయి మీ యెహోవా దేవుడు ఆకాశమంతటి కింద ఉన్న మనుషులందరి కోసం ఏర్పాటు చేసిన వాటికి నమస్కరించి, వాటిని పూజించకుండేలా మీరు ఎంతో జాగ్రత్త వహించండి.
20 耶和華將你們從埃及領出來,脫離鐵爐,要特作自己產業的子民,像今日一樣。
౨౦యెహోవా మిమ్మల్ని తీసుకుని ఈ రోజులాగా మీరు తనకు స్వంత ప్రజలుగా ఉండడానికి, ఇనపకొలిమి లాంటి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించాడు.
21 耶和華又因你們的緣故向我發怒,起誓必不容我過約旦河,也不容我進入耶和華-你上帝所賜你為業的那美地。
౨౧యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి, నేను ఈ యొర్దాను దాటకూడదనీ మీ యెహోవా దేవుడు స్వాస్థ్యంగా మీకిస్తున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనీ ఆజ్ఞాపించాడు.
22 我只得死在這地,不能過約旦河;但你們必過去得那美地。
౨౨కాబట్టి నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశంలోనే చనిపోతాను. మీరు దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
23 你們要謹慎,免得忘記耶和華-你們上帝與你們所立的約,為自己雕刻偶像,就是耶和華-你上帝所禁止你做的偶像;
౨౩మీ దేవుడు యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎలాంటి రూపంతోనైనా విగ్రహాన్ని చేసుకోకుండేలా జాగ్రత్తపడండి.
24 因為耶和華-你的上帝乃是烈火,是忌邪的上帝。
౨౪ఎందుకంటే మీ దేవుడు యెహోవా దహించే అగ్ని, రోషం గల దేవుడు.
25 「你們在那地住久了,生子生孫,就雕刻偶像,彷彿甚麼形像,敗壞自己,行耶和華-你上帝眼中看為惡的事,惹他發怒。
౨౫మీరు పిల్లలను, వారు తమ పిల్లలను కని ఆ దేశంలో చాలా కాలం నివసించిన తరువాత మీరు చెడిపోయి, ఎలాంటి రూపంతోనైనా విగ్రహాలు చేసుకుని మీ యెహోవా దేవునికి కోపం పుట్టించి, ఆయన ఎదుట చెడు జరిగినప్పుడు
26 我今日呼天喚地向你們作見證,你們必在過約旦河得為業的地上速速滅盡!你們不能在那地上長久,必盡行除滅。
౨౬మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఉండకుండాా త్వరలోనే పూర్తిగా నాశనమై పోతారని భూమ్యాకాశాలను మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువ రోజులు నిలబడకుండా మీరు పూర్తిగా నాశనమైపోతారు.
27 耶和華必使你們分散在萬民中;在他所領你們到的萬國裏,你們剩下的人數稀少。
౨౭అంతేగాక యెహోవా మిమ్మల్ని వివిధ జాతుల మధ్యకు చెదరగొడతాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి తోలివేస్తాడో అక్కడి ప్రజల్లో మీరు కొద్దిమందిగా మిగిలి ఉంటారు.
28 在那裏,你們必事奉人手所造的神,就是用木石造成、不能看、不能聽、不能吃、不能聞的神。
౨౮అక్కడ మీరు మనుష్యులు చేతితో చేసిన కర్ర, రాతి దేవుళ్ళను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.
29 但你們在那裏必尋求耶和華-你的上帝。你盡心盡性尋求他的時候,就必尋見。
౨౯అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాను మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో వెతికితే, ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు.
30 日後你遭遇一切患難的時候,你必歸回耶和華-你的上帝,聽從他的話。
౩౦ఈ సంగతులన్నీ జరిగి మీకు బాధ కలిగినప్పుడు చివరి రోజుల్లో మీరు మీ యెహోవా దేవుని వైపు చూసి ఆయన మాటకు లోబడినప్పుడు
31 耶和華-你上帝原是有憐憫的上帝;他總不撇下你,不滅絕你,也不忘記他起誓與你列祖所立的約。
౩౧మీ దేవుడు యెహోవా కనికరం గలవాడు కాబట్టి మీ చెయ్యి విడవడు, మిమ్మల్ని నాశనం చేయడు. తాను మీ పూర్వీకులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని మరచిపోడు.
32 「你且考察在你以前的世代,自上帝造人在世以來,從天這邊到天那邊,曾有何民聽見上帝在火中說話的聲音,像你聽見還能存活呢?這樣的大事何曾有、何曾聽見呢?
౩౨దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించింది మొదలు, మీ కంటే ముందటి రోజుల్లో ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకూ ఇలాటి గొప్ప కార్యం జరిగిందా? దీనిలాంటి వార్త వినబడిందా? అని అడుగు.
౩౩మీలా దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని మరి ఏ ప్రజలైనా జీవించారా?
34 上帝何曾從別的國中將一國的人民領出來,用試驗、神蹟、奇事、爭戰、大能的手,和伸出來的膀臂,並大可畏的事,像耶和華-你們的上帝在埃及,在你們眼前為你們所行的一切事呢?
౩౪మీ యెహోవా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే, కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహా భయంకర కార్యాలు, వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలోనుండి తనకోసం ఒక జాతి ప్రజని తీసుకోడానికి ప్రయత్నించాడా?
35 這是顯給你看,要使你知道,惟有耶和華-他是上帝,除他以外,再無別神。
౩౫అయితే యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప మరొకడు లేడనీ మీరు తెలుసుకొనేలా అది మీకు చూపించాడు.
36 他從天上使你聽見他的聲音,為要教訓你,又在地上使你看見他的烈火,並且聽見他從火中所說的話。
౩౬మీకు బోధించడానికి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపించాడు. భూమి మీద తన గొప్ప అగ్నిని మీకు చూపినప్పుడు ఆ అగ్నిలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు.
37 因他愛你的列祖,所以揀選他們的後裔,用大能親自領你出了埃及,
౩౭ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించాడు కాబట్టి వారి తరువాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు.
38 要將比你強大的國民從你面前趕出,領你進去,將他們的地賜你為業,像今日一樣。
౩౮మీకంటే బలమైన గొప్ప జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి మిమ్మల్ని ప్రవేశపెట్టి ఆయన ఈ రోజు జరుగుతున్నట్టు వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి మీకు తోడుగా ఉండి ఐగుప్తు నుండి తన మహాబలంతో మిమ్మల్ని బయటికి రప్పించాడు.
39 所以,今日你要知道,也要記在心上,天上地下惟有耶和華他是上帝,除他以外,再無別神。
౩౯కాబట్టి, పైన ఆకాశంలో, కింద భూమిపైనా యెహోవాయే దేవుడనీ, మరొక దేవుడు లేడనీ ఈరోజు గ్రహించండి.
40 我今日將他的律例誡命曉諭你,你要遵守,使你和你的子孫可以得福,並使你的日子在耶和華-你上帝所賜的地上得以長久。」
౪౦అంతే గాక మీకు, మీ తరువాత మీ సంతానానికి సుఖశాంతులు కలగడానికి మీ యెహోవా దేవుడు ఎప్పటికీ మీకిస్తున్న దేశంలో మీకు దీర్ఘాయువు కలిగేలా నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన కట్టడలను, ఆజ్ఞలను మీరు పాటించాలి.
41 「那時,摩西在約旦河東,向日出之地,分定三座城,
౪౧ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాక, అనాలోచితంగా తన పొరుగువాణ్ణి చంపినప్పుడు
42 使那素無仇恨、無心殺了人的,可以逃到這三城之中的一座城,就得存活:
౪౨అతడు పారిపోడానికి మోషే తూర్పు దిక్కున, యొర్దాను ఇవతల మూడు పట్టణాలను ఎన్నిక చేశాడు. అలాటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతడు పారిపోయి ఆ పట్టణాల్లో ప్రవేశించి జీవించవచ్చు.
43 為呂便人分定曠野平原的比悉;為迦得人分定基列的拉末;為瑪拿西人分定巴珊的哥蘭。」
౪౩అవేవంటే, రూబేనీయులకు మైదాన దేశపు ఎడారిలోని బేసెరు, గాదీయులకు గిలాదులో ఉన్న రామోతు, మనష్షీయులకు బాషానులో ఉన్న గోలాను.
౪౪ఇదీ మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం.
45 就是摩西在以色列人出埃及後所傳給他們的法度、律例、典章;
౪౫ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నప్పుడు
46 在約旦河東伯‧毗珥對面的谷中,在住希實本、亞摩利王西宏之地;這西宏是摩西和以色列人出埃及後所擊殺的。
౪౬యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో, సీహోను రాజుగా పాలించే అమోరీయుల దేశంలో
47 他們得了他的地,又得了巴珊王噩的地,就是兩個亞摩利王,在約旦河東向日出之地。
౪౭మోషే ఇశ్రాయేలు ప్రజలకు నియమించిన శాసనాలు, కట్టడలు, న్యాయ విధులు ఇవి.
48 從亞嫩谷邊的亞羅珥,直到西雲山,就是黑門山。
౪౮మోషే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తూ ఆ సీహోనును చంపి అతని దేశాన్నీ యొర్దాను ఇవతల తూర్పు దిక్కున ఉన్న బాషాను రాజు ఓగు పాలించే దేశాన్నీ అర్నోను లోయలో ఉన్న అరోయేరు మొదలు హెర్మోను అనే సీయోను కొండ వరకూ ఉన్న అమోరీయుల ఇద్దరు రాజుల దేశాన్ని,
49 還有約旦河東的全亞拉巴,直到亞拉巴海,靠近毗斯迦山根。
౪౯పిస్గా ఊటలకు కిందుగా అరాబా సముద్రం వరకూ తూర్పు దిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతటినీ స్వాధీనం చేసుకున్నారు.