< 撒母耳記下 23 >

1 以下是大衛末了的話。耶西的兒子大衛得居高位,是雅各上帝所膏的,作以色列的美歌者,說:
దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.
2 耶和華的靈藉着我說: 他的話在我口中。
“యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నాలుకపై ఉంది.
3 以色列的上帝、 以色列的磐石曉諭我說: 那以公義治理人民的, 敬畏上帝執掌權柄,
ఇశ్రాయేలీయుల దేవుడు మాటలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతిన్యాయాలతో పరిపాలించేవాడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు,
4 他必像日出的晨光, 如無雲的清晨, 雨後的晴光, 使地發生嫩草。
అతడు సూర్యోదయాన తొలిసంధ్య కాంతిలాగా మబ్బు లేని ఉదయం లాగా వాన వెలిసిన తరువాత కాంతులీనే కిరణాల్లో మొలకెత్తిన లేత గడ్డిలాగా ఉంటాడు.
5 我家在上帝面前並非如此; 上帝卻與我立永遠的約。 這約凡事堅穩, 關乎我的一切救恩和我一切所想望的, 他豈不為我成就嗎?
నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు.
6 但匪類都必像荊棘被丟棄; 人不敢用手拿它;
ముళ్ళను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరి వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్ళలాగా ఉన్నారు.
7 拿它的人必帶鐵器和槍桿, 終久它必被火焚燒。
ఇనుప పరికరమైనా, ఈటె కోల అయినా లేకుండా మనుషులు ముళ్ళను తాకరు. దేనినీ వదలకుండా వాటన్నిటినీ ఉన్న చోటనే తగలబెడతారు.”
8 大衛勇士的名字記在下面:他革捫人約設‧巴設,又稱伊斯尼人亞底挪,他是軍長的統領,一時擊殺了八百人。
దావీదు యోధుల పేర్లు ఇవి: ముఖ్య వీరుల్లో మొదటివాడు యోషే బెష్షెబెతు. ఇతడు తక్మోనీ వంశం వాడు. అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతం చేశాడు.
9 其次是亞合人朵多的兒子以利亞撒。從前非利士人聚集要打仗,以色列人迎着上去,有跟隨大衛的三個勇士向非利士人罵陣,其中有以利亞撒。
ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కొడుకు ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు యోధుల్లో ఒకడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే, ఇతడు వారిని ఎదిరించాడు. ఇశ్రాయేలీయులు వెనక్కు తగ్గితే ఇతడు నిలబడి
10 他起來擊殺非利士人,直到手臂疲乏,手黏住刀把。那日耶和華使以色列人大獲全勝;眾民在以利亞撒後頭專奪財物。
౧౦అరచెయ్యి బిగుసుకు పోయి చేతికి కత్తి అతుక్కుపోయే దాకా ఫిలిష్తీయులను ఎదుర్కొన్నాడు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. దోపుడు సొమ్ము తీసుకుపోవడానికి మాత్రం ప్రజలు అతని వెనకాల వచ్చారు.
11 其次是哈拉人亞基的兒子沙瑪。一日,非利士人聚集成群,在一塊長滿紅豆的田裏,眾民就在非利士人面前逃跑。
౧౧ఇతని తరువాత హరారు ఊరివాడైన ఆగే కొడుకు షమ్మా. ఒకసారి ఫిలిష్తీయులు అలచందల చేలో గుంపు గూడి ఉండగా ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులను ఎదిరించి నిలవలేక పారిపోయారు.
12 沙瑪卻站在那田間擊殺非利士人,救護了那田。耶和華使以色列人大獲全勝。
౧౨అప్పుడితడు ఆ పొలం మధ్యలో నిలబడి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా అడ్డుకున్నాడు. వారిని హతం చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్నిచ్చాడు.
13 收割的時候,有三十個勇士中的三個人下到亞杜蘭洞見大衛。非利士的軍兵在利乏音谷安營。
౧౩ముప్ఫై మంది వీరుల్లో ముఖ్యులైన ముగ్గురు కోతకాలంలో అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీయుల సైన్యం రెఫాయీము లోయలో ఉన్నారు.
14 那時大衛在山寨,非利士人的防營在伯利恆。
౧౪దావీదు తన సురక్షితమైన చోట, గుహలో ఉన్నాడు. ఫిలిష్తీయ సేన బేత్లెహేములో శిబిరం వేసుకుని ఉన్నారు.
15 大衛渴想,說:「甚願有人將伯利恆城門旁、井裏的水打來給我喝。」
౧౫దావీదు మంచి నీటి కోసం తహ తహ లాడుతూ “బేత్లెహేము పురద్వారం దగ్గరున్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బావుణ్ణు!” అన్నాడు.
16 這三個勇士就闖過非利士人的營盤,從伯利恆城門旁的井裏打水,拿來奉給大衛。他卻不肯喝,將水奠在耶和華面前,
౧౬ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల సైన్యం కావలి వాళ్ళను ఛేదించుకుని పోయి, బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావి నీళ్లు తోడుకుని దావీదు దగ్గరికి తెచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు తాగలేదు. యెహోవా సన్నిధిలో అ నీళ్ళు పారబోసి “యెహోవా, ఈ నీళ్ళు తాగడం నాకు దూరం అగు గాక.
17 說:「耶和華啊,這三個人冒死去打水;這水好像他們的血一般,我斷不敢喝。」如此,大衛不肯喝。這是三個勇士所做的事。
౧౭వీళ్ళు ప్రాణాలకు తెగించి పోయి ఇవి తెచ్చారు కదా. ఈ నీళ్ళు వీరి రక్తంతో సమానం” అని చెప్పి తాగడానికి నిరాకరించాడు. ఆ ముగ్గురు మహావీరులు ఈ పరాక్రమ కార్యాలు చేశారు.
18 洗魯雅的兒子、約押的兄弟亞比篩是這三個勇士的首領;他舉槍殺了三百人,就在三個勇士裏得了名。
౧౮సెరూయా కొడుకు, యోవాబు సోదరుడు అబీషై ఈ ముప్ఫై మందికి నాయకుడు. ఇతడొక యుద్ధంలో మూడు వందల మందిని ఈటెతో సాము చేసి హతం చేశాడు. ఇతడు ఆ ముగ్గురితో సమానంగా పేరు పొందాడు.
19 他在這三個勇士裏是最尊貴的,所以作他們的首領,只是不及前三個勇士。
౧౯ఇతడు ఆ ముప్ఫై మందిలో గొప్పవాడై, వారికి అధిపతి అయ్యాడు. కానీ ఆ మొదటి ముగ్గురికీ సాటి కాలేదు.
20 有甲薛勇士耶何耶大的兒子比拿雅行過大能的事;他殺了摩押人亞利伊勒的兩個兒子,又在下雪的時候下坑裏去,殺了一個獅子,
౨౦కబ్సెయేలు ఊరివాడైన బెనాయా యెహోయాదా కొడుకు. అతడు పరాక్రమశాలి. మహా ప్రతాపం చూపించాడు. ఇతడు ఇద్దరు మోయాబు శూరులను హతం చేశాడు. మంచు కురుస్తున్న కాలంలో ఇతడు బావిలో దాక్కుని ఉన్న ఒక సింహాన్ని చంపేశాడు.
21 又殺了一個強壯的埃及人;埃及人手裏拿着槍,比拿雅只拿着棍子下去,從埃及人手裏奪過槍來,用那槍將他殺死。
౨౧ఇంకా అతడు మహాకాయుడైన ఒక ఐగుప్తు వాణ్ని చంపాడు. ఈ ఐగుప్తీయుడి చేతిలో ఈటె ఉంటే బెనాయా దుడ్డుకర్ర తీసుకు అతడి మీదికి పోయాడు. వాడి చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాణ్ణి చంపేశాడు.
22 這是耶何耶大的兒子比拿雅所行的事,就在三個勇士裏得了名。
౨౨ఈ పరాక్రమ క్రియలు యెహోయాదా కొడుకు బెనాయా చేశాడు కాబట్టి ఆ ముగ్గురు బలాఢ్యులతోబాటు లెక్కలోకి వచ్చాడు.
23 他比那三十個勇士都尊貴,只是不及前三個勇士。大衛立他作護衛長。
౨౩ఆ ముప్ఫై మందిలోకీ ఘనుడయ్యాడు. అయినా మొదటి ముగ్గురితో సాటి కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల నాయకునిగా నియమించాడు.
24 三十個勇士裏有約押的兄弟亞撒黑,伯利恆人朵多的兒子伊勒哈難,
౨౪ఆ ముప్ఫై మంది ఎవరంటే, యోవాబు సోదరుడు అశాహేలు, బేత్లెహేము వాడైన దోదో కొడుకు ఎల్హానాను,
25 哈律人沙瑪,哈律人以利加,
౨౫హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
26 帕勒提人希利斯,提哥亞人益吉的兒子以拉,
౨౬పత్తీయుడైన హేలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కొడుకు ఈరా,
27 亞拿突人亞比以謝,戶沙人米本乃,
౨౭అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
28 亞合人撒們,尼陀法人瑪哈萊,
౨౮అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై,
29 尼陀法人巴拿的兒子希立,便雅憫族、基比亞人利拜的兒子以太,
౨౯నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,
30 比拉頓人比拿雅,迦實溪人希太,
౩౦పిరాతోనీయుడైన బెనాయా, గాయషు లోయప్రాంతాల్లో ఉండే హిద్దయి,
31 伯亞拉巴人亞比亞本,巴魯米人押斯瑪弗,
౩౧అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,
32 沙本人以利雅哈巴,雅善兒子中的約拿單,
౩౨షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కొడుకుల్లో యోనాతాను,
33 哈拉人沙瑪,哈拉人沙拉的兒子亞希暗,
౩౩హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారుకు పుట్టిన అహీయాము,
34 瑪迦人亞哈拜的兒子以利法列,基羅人亞希多弗的兒子以連,
౩౪మాయాకాతీయుడైన అహస్బయి కొడుకు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కొడుకు ఏలీయాము,
35 迦密人希斯萊,亞巴人帕萊,
౩౫కర్మెలీయుడైన హెస్రో, అర్బీయుడైన పయరై,
36 瑣巴人拿單的兒子以甲,迦得人巴尼,
౩౬సోబావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ,
37 亞捫人洗勒,比錄人拿哈萊(是給洗魯雅的兒子約押拿兵器的),
౩౭అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు.
38 以帖人以拉,以帖人迦立,
౩౮ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
39 赫人烏利亞,共有三十七人。
౩౯హిత్తీయుడైన ఊరియా. ఈ కోవలో చేరినవారు మొత్తం ముప్ఫై ఏడుగురు.

< 撒母耳記下 23 >