< 诗篇 54 >
1 西弗人来对扫罗说:“大卫岂不是在我们那里藏身吗?”那时,大卫作这训诲诗,交与伶长。用丝弦的乐器。 神啊,求你以你的名救我, 凭你的大能为我伸冤。
౧ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలమీద పాడేది. జీఫీయులు వచ్చి దావీదు మా దగ్గర దాక్కున్నాడు, అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రాసిన దైవధ్యానం. దేవా, నీ నామాన్నిబట్టి నన్ను రక్షించు. నీ వీరత్వాన్ని బట్టి నాకు న్యాయం తీర్చు.
౨దేవా, నా ప్రార్థన ఆలకించు. నా నోటి మాటలు నీకు వినబడనియ్యి.
3 因为,外人起来攻击我, 强暴人寻索我的命; 他们眼中没有 神。 (细拉)
౩గర్వికులు నాకు వ్యతిరేకంగా లేచారు. జాలిలేని వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. వారికి దేవుడంటే లెక్కలేదు.
౪ఇదిగో, దేవుడే నా సహాయం. ప్రభువే నా ప్రాణాన్ని నిలబెట్టేవాడు.
5 他要报应我仇敌所行的恶; 求你凭你的诚实灭绝他们。
౫నా శత్రువులు చేసే కీడును ఆయన వారి మీదకే రప్పిస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నాశనం చెయ్యి.
6 我要把甘心祭献给你。 耶和华啊,我要称赞你的名;这名本为美好。
౬సేచ్చార్పణ బలులు నేను నీకు అర్పిస్తాను. యెహోవా, నీ నామం ఉత్తమం. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
7 他从一切的急难中把我救出来; 我的眼睛也看见了我仇敌遭报。
౭ప్రతి ఆపద నుండి ఆయన నన్ను విడిపించాడు. నా శత్రువుల ఓటమిని నా కన్ను సంతోషంగా చూస్తున్నది.