< 诗篇 53 >
1 大卫的训诲诗,交与伶长。调用麻哈拉。 愚顽人心里说:没有 神。 他们都是邪恶,行了可憎恶的罪孽; 没有一个人行善。
౧ప్రధాన సంగీతకారుని కోసం. మహలతు రాగంలో దావీదు రాసిన దైవధ్యానం. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయారు, అసహ్యకార్యాలు చేస్తారు. మంచి జరిగించేవాడు ఒక్కడూ లేడు.
2 神从天上垂看世人,要看有明白的没有? 有寻求他的没有?
౨జ్ఞానం కలిగి తనను వెదికేవారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి మనుషులను పరిశీలించాడు.
3 他们各人都退后,一同变为污秽; 并没有行善的,连一个也没有。
౩వారంతా దారి తప్పి పూర్తిగా చెడిపోయారు. మంచి చేసే వాడు లేడు. ఒక్కడూ లేడు.
4 作孽的没有知识吗? 他们吞吃我的百姓如同吃饭一样,并不求告 神。
౪వారు దేవునికి ప్రార్థన చేయరు. వారు నా ప్రజలను దోచుకున్నారు. వారికి ఏమీ తెలియడం లేదా?
5 他们在无可惧怕之处就大大害怕, 因为 神把那安营攻击你之人的骨头散开了。 你使他们蒙羞,因为 神弃绝了他们。
౫భయకారణం లేకుండానే వారు భయభ్రాంతులయ్యారు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా పోగయ్యే వారి ఎముకలను దేవుడు విరగ్గొడతాడు. దేవుడు వారిని తోసిపుచ్చాడు కాబట్టి వారు సిగ్గుపడతారు.
6 但愿以色列的救恩从锡安而出。 神救回他被掳的子民那时, 雅各要快乐,以色列要欢喜。
౬సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. దేవుడు తన ప్రజలను చెరలో నుండి వెనక్కి రప్పించేటప్పుడు యాకోబు సంతానం హర్షిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు సంతోషిస్తారు.