< 箴言 29 >

1 人屡次受责罚,仍然硬着颈项; 他必顷刻败坏,无法可治。
చాలా గద్దింపులు వచ్చినా తలబిరుసుగా ఉండిపోయేవాడు ఇక స్వస్థత అనేది లేకుండా హఠాత్తుగా విరిగి పోతాడు.
2 义人增多,民就喜乐; 恶人掌权,民就叹息。
మంచి చేసే వారు ఎక్కువ మంది అయినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. దుష్టుడు ఏలుతున్నప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు.
3 爱慕智慧的,使父亲喜乐; 与妓女结交的,却浪费钱财。
జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపెడతాడు. వేశ్యలతో సాంగత్యం చేసేవాడు అతని ఆస్తిని పాడుచేస్తాడు.
4 王借公平,使国坚定; 索要贿赂,使国倾败。
న్యాయం మూలంగా రాజు దేశానికి క్షేమం కలగజేస్తాడు. లంచాలు పుచ్చుకొనేవాడు దేశాన్ని పాడుచేస్తాడు.
5 谄媚邻舍的, 就是设网罗绊他的脚。
తన పొరుగువాడితో ముఖ స్తుతి మాటలు చెప్పేవాడు అతణ్ణి చిక్కించు కోడానికి వలవేసేవాడు.
6 恶人犯罪,自陷网罗; 惟独义人欢呼喜乐。
దుష్టుడు తన స్వయంకృతాపరాధం వల్ల బోనులో చిక్కుకుంటాడు. మంచి చేసేవాడు పాటలుపాడుతూ సంతోషంగా ఉంటాడు.
7 义人知道查明穷人的案; 恶人没有聪明,就不得而知。
మంచి మనిషి పేదల పక్షంగా వాదిస్తాడు. పాతకుడికి అలాటి జ్ఞానం లేదు.
8 亵慢人煽惑通城; 智慧人止息众怒。
అపహాసకులు ఊరిని తగల బెడతారు. జ్ఞానులు కోపం చల్లారుస్తారు.
9 智慧人与愚妄人相争, 或怒或笑,总不能使他止息。
జ్ఞాని మూర్ఖనితో వాదించేటప్పుడు వాడు రెచ్చిపోతుంటాడు, నవ్వుతుంటాడు. నెమ్మది ఉండదు.
10 好流人血的,恨恶完全人, 索取正直人的性命。
౧౦రక్తపిపాసులు నిర్దోషులను ద్వేషిస్తారు. వారు నీతిపరుల ప్రాణాలు తీయాలని చూస్తుంటారు.
11 愚妄人怒气全发; 智慧人忍气含怒。
౧౧బుద్ధిహీనుడు తన కోపమంతా వెళ్ళగక్కుతాడు. జ్ఞానం గలవాడు కోపం అణచుకుంటాడు.
12 君王若听谎言, 他一切臣仆都是奸恶。
౧౨రాజు గనక అబద్ధాలు నమ్ముతూ ఉంటే అతని ఉద్యోగులు దుష్టులుగా ఉంటారు.
13 贫穷人、强暴人在世相遇; 他们的眼目都蒙耶和华光照。
౧౩పేదలు, వడ్డీ వ్యాపారులు కలుసుకుంటారు. ఉభయుల కళ్ళకు వెలుగిచ్చేవాడు యెహోవాయే.
14 君王凭诚实判断穷人; 他的国位必永远坚立。
౧౪ఏ రాజు దరిద్రులకు సత్యంతో న్యాయం తీరుస్తాడో ఆ రాజు సింహాసనం శాశ్వతంగా ఉంటుంది.
15 杖打和责备能加增智慧; 放纵的儿子使母亲羞愧。
౧౫బెత్తం, గద్దింపు జ్ఞానం కలిగిస్తుంది. అదుపులేని పిల్లవాడు తన తల్లికి అవమానం తెస్తాడు.
16 恶人加多,过犯也加多, 义人必看见他们跌倒。
౧౬దుష్టులు ప్రబలినప్పుడు దుర్మార్గత ప్రబలుతుంది. వారి పతనాన్ని నీతిపరులు కళ్లారా చూస్తారు.
17 管教你的儿子,他就使你得安息, 也必使你心里喜乐。
౧౭నీ కొడుకును శిక్షించినట్టయితే అతడు నీకు విశ్రాంతినిస్తాడు. నీ మనస్సుకు ఆనందం కలిగిస్తాడు.
18 没有异象,民就放肆; 惟遵守律法的,便为有福。
౧౮ప్రవచన దర్శనం లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా ఉంటారు. ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండే వాడు ధన్యుడు.
19 只用言语,仆人不肯受管教; 他虽然明白,也不留意。
౧౯సేవకుడు మందలిస్తే బుద్ధి తెచ్చుకోడు. వాడికి విషయం అర్థం అయినా వాడు లోబడడు.
20 你见言语急躁的人吗? 愚昧人比他更有指望。
౨౦తొందరపడి మాట్లాడే వాణ్ణి చూసావా? వాడికంటే మూర్ఖుడే సుళువుగా మారతాడు.
21 人将仆人从小娇养, 这仆人终久必成了他的儿子。
౨౧ఒకడు తన సేవకుణ్ణి చిన్నప్పటి నుండి గారాబంగా పెంచితే చివరకూ వాడి వలన ఇబ్బందులు వస్తాయి.
22 好气的人挑启争端; 暴怒的人多多犯罪。
౨౨కోపిష్టి కలహం రేపుతాడు. ముక్కోపి చాలా పాపాలు చేస్తాడు.
23 人的高傲必使他卑下; 心里谦逊的,必得尊荣。
౨౩ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు.
24 人与盗贼分赃,是恨恶自己的性命; 他听见叫人发誓的声音,却不言语。
౨౪దొంగతో చేతులు కలిపినవాడు తనకు తానే పగవాడు. అలాంటివాడు శాపపు మాటలు విని కూడా మిన్నకుంటాడు.
25 惧怕人的,陷入网罗; 惟有倚靠耶和华的,必得安稳。
౨౫భయపడడం వల్ల మనుషులకు ఉరి వస్తుంది. యెహోవా పట్ల నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు.
26 求王恩的人多; 定人事乃在耶和华。
౨౬పరిపాలకుని అనుగ్రహం కోరే వారు అసంఖ్యాకం. కానీ మనుష్యులకు న్యాయం తీర్చేది యెహోవాయే.
27 为非作歹的,被义人憎嫌; 行事正直的,被恶人憎恶。
౨౭మంచి చేసే వారికీ దుర్మార్గుడు అంటే అసహ్యం. అలానే యథార్థవర్తనుడు భక్తిహీనుడికి హేయుడు.

< 箴言 29 >