< 约伯记 36 >

1 以利户又接着说:
ఎలీహు ఇంకా ఇలా అన్నాడు.
2 你再容我片时,我就指示你, 因我还有话为 神说。
కొంతసేపు నన్ను మాట్లాడనియ్యి. కొన్ని సంగతులు నీకు తెలియజేస్తాను. ఎందుకంటే దేవుని పక్షంగా నేనింకా మాట్లాడవలసి ఉంది.
3 我要将所知道的从远处引来, 将公义归给造我的主。
దూరం నుండి నేను జ్ఞానం తెచ్చుకుంటాను. నీతి అనేది నన్ను సృష్టించిన వాడికే చెందుతుందని అంటాను.
4 我的言语真不虚谎; 有知识全备的与你同在。
నా మాటలు ఏమాత్రం అబద్ధాలు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు.
5 神有大能,并不藐视人; 他的智慧甚广。
దేవుడు బలవంతుడు గానీ ఆయన ఎవరినీ తిరస్కారంగా చూడడు. ఆయన వివేచనాశక్తి ఎంతో బలమైనది.
6 他不保护恶人的性命, 却为困苦人伸冤。
భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు.
7 他时常看顾义人, 使他们和君王同坐宝座, 永远要被高举。
నీతిమంతులను ఆయన చూడక పోడు. ఆయన వారిని నిత్యం సింహాసనంపై కూర్చునే రాజులతోబాటు కూర్చోబెడతాడు. వారు ఘనత పొందుతారు.
8 他们若被锁链捆住, 被苦难的绳索缠住,
వారు సంకెళ్లతో బంధితులైతే, బాధలు అనే తాళ్ళు వారిని కట్టివేస్తే,
9 他就把他们的作为和过犯指示他们, 叫他们知道有骄傲的行动。
అప్పుడు వారికి ఆయన వెల్లడిస్తాడు, వారి అపరాధాలు, వారు గర్వంగా ప్రవర్తించిన సంగతులు వారికి తెలియజేస్తాడు.
10 他也开通他们的耳朵得受教训, 吩咐他们离开罪孽转回。
౧౦ఉపదేశం వినడానికి వారి చెవులు తెరుస్తాడు. పాపాన్ని విడిచి రండని ఆజ్ఞ ఇస్తాడు.
11 他们若听从事奉他, 就必度日亨通,历年福乐;
౧౧వారు ఆలకించి ఆయనను సేవించినట్టయితే తమ దినాలను క్షేమంగాను తమ సంవత్సరాలను సుఖంగాను వెళ్లబుచ్చుతారు.
12 若不听从, 就要被刀杀灭,无知无识而死。
౧౨వారు ఆలకించక పోతే వారు కత్తివాత కూలి నశిస్తారు. వారికి జ్ఞానం లేనందువల్ల చనిపోతారు.
13 那心中不敬虔的人积蓄怒气; 神捆绑他们,他们竟不求救;
౧౩అయినా భక్తిలేని వారు లోలోపల క్రోధం పెంచుకుంటారు. ఆయన వారిని బంధించినా సరే వారు మొర పెట్టరు.
14 必在青年时死亡, 与污秽人一样丧命。
౧౪కాబట్టి వారు యవ్వనప్రాయంలోనే మరణిస్తారు. వారి బ్రతుకు అప్రదిష్ట పాలవుతుంది.
15 神借着困苦救拔困苦人, 趁他们受欺压开通他们的耳朵。
౧౫బాధపడే వారిని వారికి కలిగిన బాధ వలన ఆయన విడిపిస్తాడు. బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు.
16 神也必引你出离患难, 进入宽阔不狭窄之地; 摆在你席上的必满有肥甘。
౧౬అంతేగాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. కష్టం లేని విశాల స్థలానికి నిన్ను తోడుకుపోతాడు. నీ భోజనం బల్లపై ఉన్న ఆహారాన్ని కొవ్వుతో నింపుతాడు.
17 但你满口有恶人批评的言语; 判断和刑罚抓住你。
౧౭దుష్టుల తీర్పు నీలో నిండి ఉంది. న్యాయవిమర్శ, తీర్పు కలిసి నిన్ను పట్టుకున్నాయి.
18 不可容忿怒触动你,使你不服责罚; 也不可因赎价大就偏行。
౧౮కలిమి నిన్ను మోసానికి ప్రేరేపించనియ్యవద్దు. పెద్ద మొత్తంలో లంచం నిన్ను న్యాయం నుండి దారి మళ్ళించనియ్యవద్దు.
19 你的呼求,或是你一切的势力, 果有灵验,叫你不受患难吗?
౧౯నీ సంపదలు నువ్వు బాధల పాలు కాకుండా నిన్ను కాపాడతాయా? నీ బల ప్రభావాలు నీకు సాయపడతాయా?
20 不要切慕黑夜, 就是众民在本处被除灭的时候。
౨౦ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేయడం కోసం రాత్రి రావాలని కోరుకోవద్దు. మనుషులను తమ స్థలాల్లో నుండి కొట్టివేసే చీకటి కోసం చూడవద్దు.
21 你要谨慎,不可重看罪孽, 因你选择罪孽过于选择苦难。
౨౧పాపానికి తిరగకుండా జాగ్రత్తపడు. నువ్వు పాపం చెయ్యకుండా ఉండేలా నీ బాధల మూలంగా నీకు పరీక్షలు వస్తున్నాయి.
22 神行事有高大的能力; 教训人的有谁像他呢?
౨౨ఆలోచించు, దేవుడు శక్తిశాలి, ఘనుడు. ఆయనను పోలిన ఉపాధ్యాయుడు ఎవరు?
23 谁派定他的道路? 谁能说:你所行的不义?
౨౩ఆయనకు మార్గం సూచించిన వాడెవడు? “నువ్వు దుర్మార్గపు పనులు చేస్తున్నావు” అని ఆయనతో పలకడానికి ఎవరు తెగిస్తారు?
24 你不可忘记称赞他所行的为大, 就是人所歌颂的。
౨౪ఆయన కార్యాలను కీర్తించు. మనుషులు వాటిని గురించే పాడారు.
25 他所行的,万人都看见; 世人也从远处观看。
౨౫మనుష్యులంతా వాటిని చూశారు. అయితే వారు దూరంగా నిలిచి ఆ కార్యాలను చూశారు.
26 神为大,我们不能全知; 他的年数不能测度。
౨౬ఆలోచించు, దేవుడు గొప్పవాడు. మనం ఆయనను సరిగా అర్థం చేసుకోలేము. ఆయన సంవత్సరాలను ఎవరూ లెక్కబెట్టలేరు.
27 他吸取水点, 这水点从云雾中就变成雨;
౨౭ఆయన నీటిబిందువులను తెస్తాడు. తన మంచును వానచినుకుల్లాగా మార్చి కురిపిస్తాడు.
28 云彩将雨落下,沛然降与世人。
౨౮మేఘాలు వాటిని కుమ్మరిస్తాయి. మనుషుల మీదికి అవి జడివానగా కురుస్తాయి.
29 谁能明白云彩如何铺张, 和 神行宫的雷声呢?
౨౯నిజంగా మేఘాలు ముసిరే విధానం ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఆయన మందిరం లోనుండి ఉరుములు వచ్చేదెలాగో ఎవరికైనా తెలుసా?
30 他将亮光普照在自己的四围; 他又遮覆海底。
౩౦చూడు, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేస్తాడు. సముద్రాన్ని చీకటితో ఆయన కప్పుతాడు.
31 他用这些审判众民, 且赐丰富的粮食。
౩౧ఈ విధంగా ఆయన మనుషులకు ఆహారం పెడతాడు. ఆయన ఆహారాన్ని పుష్కలంగా ఇస్తాడు.
32 他以电光遮手, 命闪电击中敌人。
౩౨తన చేతుల్లో ఉరుములను పట్టుకుంటాడు. గురికి తగలాలని ఆయన వాటికి ఆజ్ఞాపిస్తాడు.
33 所发的雷声显明他的作为, 又向牲畜指明要起暴风。
౩౩వాటి గర్జన ముంచుకు వస్తున్న తుఫానును మనుషులకు తెలుపుతుంది. పశువులకు సైతం దాని రాకడ తెలుసు.

< 约伯记 36 >