< 耶利米书 15 >

1 耶和华对我说:“虽有摩西和撒母耳站在我面前代求,我的心也不顾惜这百姓。你将他们从我眼前赶出,叫他们去吧!
అప్పుడు యెహోవా నాకిలా చెప్పాడు. “మోషే అయినా సమూయేలైనా నా ఎదుట నిలబడినప్పటికీ ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఒప్పుకోదు. నా దగ్గర నుంచి వాళ్ళను వెళ్లగొట్టు. వాళ్ళను వెళ్లనియ్యి.”
2 他们问你说:‘我们往哪里去呢?’你便告诉他们,耶和华如此说: 定为死亡的,必致死亡; 定为刀杀的,必交刀杀; 定为饥荒的,必遭饥荒; 定为掳掠的,必被掳掠。”
“మేమెక్కడికి వెళ్ళాలి?” అని వాళ్ళు నిన్నడితే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావు కోసం ఏర్పాటైన వాళ్ళు చావుకూ, కత్తి కోసం ఏర్పాటైన వాళ్ళు కత్తికీ, కరువు కోసం ఏర్పాటైన వాళ్ళు కరువుకూ, చెరకు ఏర్పాటైన వాళ్ళు చెరకూ వెళ్ళాలి.
3 耶和华说:“我命定四样害他们,就是刀剑杀戮、狗类撕裂、空中的飞鸟,和地上的野兽吞吃毁灭;
చంపడానికి కత్తినీ, చీల్చడానికి కుక్కలనూ, తినివేయడానికీ నాశనం చేయడానికీ ఆకాశ పక్షులనూ, భూమి మీద తిరిగే మృగాలనూ పంపిస్తాను. ఈ నాలుగు రకాల బాధలు వారికి వస్తాయి.” ఇది యెహోవా వాక్కు.
4 又必使他们在天下万国中抛来抛去,都因犹大王希西家的儿子玛拿西在耶路撒冷所行的事。”
యూదా రాజు హిజ్కియా కొడుకు మనష్షే యెరూషలేములో చేసిన పనులను బట్టి భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటికీ భీతి కలిగేలా చేస్తాను.
5 耶路撒冷啊,谁可怜你呢? 谁为你悲伤呢? 谁转身问你的安呢?
యెరూషలేమా, నిన్ను ఎవరు కనికరిస్తారు? నీ గురించి ఎవరు ఏడుస్తారు? నీ బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? ఇది యెహోవా వాక్కు.
6 耶和华说:你弃绝了我, 转身退后; 因此我伸手攻击你,毁坏你。 我后悔甚不耐烦。
నువ్వు నన్ను వదిలేసావు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు. కాబట్టి నా చేత్తో నిన్ను కొడతాను. నిన్ను నాశనం చేస్తాను. నీ మీద జాలిపడి విసిగిపోయాను.
7 我在境内各城门口, 用簸箕簸了我的百姓, 使他们丧掉儿女。 我毁灭他们, 他们仍不转离所行的道。
దేశం గుమ్మాల్లో నేను వారిని చేటతో తూర్పారపడతాను. నా ప్రజలు తమ పద్ధతులను విడిచి నా దగ్గరికి రావడం లేదు కాబట్టి వాళ్ళను నాశనం చేస్తాను. వారికి వియోగం కలిగిస్తాను.
8 他们的寡妇在我面前比海沙更多; 我使灭命的午间来, 攻击少年人的母亲, 使痛苦惊吓忽然临到她身上。
వారి వితంతువుల సంఖ్య సముద్రతీరాన ఇసుక కంటే ఎక్కువయ్యేలా చేస్తాను. నేను మధ్యాహ్నం సమయంలో యువకుల తల్లుల మీదికి నాశనం చేసేవాణ్ణి పంపిస్తాను. వారి మీదికి భయం, దిగ్భ్రాంతి ఆకస్మాత్తుగా రప్పిస్తాను.
9 生过七子的妇人力衰气绝; 尚在白昼,日头忽落; 她抱愧蒙羞。 其余的人, 我必在他们敌人跟前,交与刀剑。 这是耶和华说的。
ఏడుగురిని కనిన స్త్రీ నీరసించి ప్రాణం విడుస్తుంది. పగటి సమయం ఇంకా ఉండగానే ఆమె పొద్దు ముగుస్తుంది. ఆమె సిగ్గుతో అవమానం పాలవుతుంది. మిగిలిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేస్తాను. ఇది యెహోవా వాక్కు.
10 我的母亲哪,我有祸了!因你生我作为遍地相争相竞的人。我素来没有借贷与人,人也没有借贷与我,人人却都咒骂我。
౧౦అయ్యో నాకెంతో బాధ! అమ్మా! దేశస్థులందరితో కలహాలు పెట్టుకునేవాడిగా నన్ను కన్నావు. నేనెవరికీ అప్పివ్వలేదు, అప్పు తీసుకోలేదు. అయినా వారంతా నన్ను దూషిస్తున్నారు.
11 耶和华说:“我必要坚固你,使你得好处。灾祸苦难临到的时候,我必要使仇敌央求你。(
౧౧అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “మంచి కోసం నేను నిన్ను తప్పించనా? తప్పకుండా విపత్తులో బాధలో నీ శత్రువులు నీ సాయాన్ని అర్థించేలా చేస్తాను.
12 人岂能将铜与铁,就是北方的铁折断呢?)
౧౨ఇనుమును, మరి ముఖ్యంగా ఉత్తర దేశం నుంచి వచ్చిన కంచు కలిసిన ఇనుమును ఎవడైనా విరగ గొట్టగలడా?
13 “我必因你在四境之内所犯的一切罪,把你的货物财宝当掠物,白白地交给仇敌。
౧౩మీ ప్రాంతాలన్నిటిలో మీరు చేసే పాపాలన్నిటికీ మీ సంపదనూ మీ విలువైన వస్తువులనూ నేను దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను.
14 我也必使仇敌带这掠物到你所不认识的地去,因我怒中起的火要将你们焚烧。”
౧౪నువ్వెరుగని దేశంలో మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను. నా కోపం మంటల్లాగా రగులుకుంది. అది మిమ్మల్ని దహిస్తుంది.
15 耶和华啊,你是知道的; 求你记念我,眷顾我, 向逼迫我的人为我报仇; 不要向他们忍怒取我的命, 要知道我为你的缘故受了凌辱。
౧౫యెహోవా, నా బాధ నీకే తెలుసు. నన్ను గుర్తు చేసుకుని సాయం చెయ్యి. నన్ను బాధించే వారి మీద నా కోసం ప్రతీకారం చెయ్యి. నువ్వు ఓర్పు వహించి నన్ను తీసుకుపోవద్దు. నీ కోసమే నేను నింద భరిస్తున్నానని గుర్తు చేసుకో.
16 耶和华—万军之 神啊, 我得着你的言语就当食物吃了; 你的言语是我心中的欢喜快乐, 因我是称为你名下的人。
౧౬సేనల ప్రభువైన యెహోవా, నేను నీ పేరు పెట్టుకున్నాను. నీ మాటలు నాకు దొరికితే నేను వాటిని తిన్నాను. నీ మాటలు నాకెంతో సంతోషంగా హృదయానందంగా ఉన్నాయి.
17 我没有坐在宴乐人的会中, 也没有欢乐; 我因你的感动独自静坐, 因你使我满心愤恨。
౧౭వేడుక చేసుకునే వాళ్ళ గుంపులో నేను కూర్చుని సంతోషించలేదు. నీ బలమైన చెయ్యి నా మీద ఉంది. కడుపుమంటతో నువ్వు నన్ను నింపావు. కాబట్టి, నేను ఒంటరిగా కూర్చున్నాను.
18 我的痛苦为何长久不止呢? 我的伤痕为何无法医治、不能痊愈呢? 难道你待我有诡诈,像流干的河道吗?
౧౮నా బాధకు అంతం లేదెందుకు? నా గాయం ఎందుకు ఘోరమై నయం కాకుండా ఉంది? నువ్వు నాకు మోసజలం లాగా, ఇంకిపోయే ఊటలాగా ఉంటావా?”
19 耶和华如此说:你若归回, 我就将你再带来, 使你站在我面前; 你若将宝贵的和下贱的分别出来, 你就可以当作我的口。 他们必归向你, 你却不可归向他们。
౧౯అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు. “యిర్మీయా, నువ్వు నావైపు తిరిగితే నువ్వు నా సన్నిధిని నిలిచేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. యోగ్యమైన వాటిలో నుంచి పనికిమాలిన వాటిని నువ్వు తీసేస్తే నా నోటిలాగా నువ్వుంటావు. ప్రజలు నీవైపుకు తిరుగుతారు. అయితే నువ్వు వారి వైపుకు తిరగకూడదు.
20 我必使你向这百姓成为坚固的铜墙; 他们必攻击你,却不能胜你; 因我与你同在,要拯救你,搭救你。 这是耶和华说的。
౨౦నేను నిన్ను ఈ ప్రజలకు అభేధ్యమైన కంచుకోటగా చేస్తాను. వాళ్ళు నీ మీద యుద్ధం చేస్తారు గాని నిన్ను గెలవలేరు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటాను. ఇది యెహోవా వాక్కు.
21 我必搭救你脱离恶人的手, 救赎你脱离强暴人的手。
౨౧నేను నిన్ను దుర్మార్గుల చేతిలోనుంచి విడిపిస్తాను. నిరంకుశుల బారినుంచి నిన్ను విమోచిస్తాను.”

< 耶利米书 15 >