< 何西阿书 11 >

1 以色列年幼的时候,我爱他, 就从埃及召出我的儿子来。
“ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతనిపట్ల ప్రేమగలిగి, నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలోనుండి పిలిచాను.
2 先知越发招呼他们, 他们越发走开, 向诸巴力献祭, 给雕刻的偶像烧香。
వారిని ఎంతగా పిలిస్తే బయలు దేవుళ్ళకు వారు అంత ఎక్కువగా బలులు అర్పించారు. విగ్రహాలకు ధూపం వేశారు.
3 我原教导以法莲行走, 用膀臂抱着他们, 他们却不知道是我医治他们。
ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాణ్ణి నేనే. వారి చేతులు పట్టుకుని పైకి లేపిన వాణ్ణి నేనే. నేనే వారిని పట్టించుకున్నాను అనే సంగతి వారికి తెలియదు.
4 我用慈绳爱索牵引他们; 我待他们如人放松牛的两腮夹板, 把粮食放在他们面前。
మానవత్వపు బంధంతో వారిని నడిపించాను. స్నేహబంధాలతో తోడుకుపోయాను. వారి పళ్ళ మధ్య నుంచి కాడిని తీసిన వాడిలా నేను వారికి ఉన్నాను. వంగి వారికి అన్నం తినిపించాను.
5 他们必不归回埃及地, 亚述人却要作他们的王, 因他们不肯归向我。
ఐగుప్తు దేశానికి వారు మళ్ళీ తిరిగి పోరా? నా దగ్గరకి తిరిగి రావడానికి నిరాకరించినందుకు అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయడా?
6 刀剑必临到他们的城邑, 毁坏门闩,把人吞灭, 都因他们随从自己的计谋。
వారి పథకాలను బట్టి యుద్ధం వారి పట్టణాలను ఆవరిస్తుంది. అది వారి పట్టణపు గడియలు విరగ్గొడుతుంది. వారిని నాశనం చేస్తుంది.
7 我的民偏要背道离开我; 众先知虽然招呼他们归向至上的主, 却无人尊崇主。
నా నుండి తిరిగిపోవాలని నా ప్రజలు తీర్మానం చేసుకున్నారు. మహోన్నతుడినైన నాకు మొర పెట్టినా ఎవడూ నన్ను ఘనపరచడు.
8 以法莲哪,我怎能舍弃你? 以色列啊,我怎能弃绝你? 我怎能使你如押玛? 怎能使你如洗扁? 我回心转意, 我的怜爱大大发动。
ఎఫ్రాయిమూ, నేనెలా నిన్ను విడిచిపెడతాను? ఇశ్రాయేలూ, నేను నిన్ను శత్రువులకు ఎలా అప్పగిస్తాను? అద్మాలాగా నిన్ను నేను ఎలా చేస్తాను? సెబోయీముకు చేసినట్టు నీకు ఎలా చేస్తాను? నా మనస్సు మారింది. నా కనికరం రేగింది.
9 我必不发猛烈的怒气, 也不再毁灭以法莲。 因我是 神,并非世人, 是你们中间的圣者; 我必不在怒中临到你们。
నా ఉగ్రతాగ్నిని మీపై కురిపించను. నేను మళ్లీ ఎఫ్రాయిమును నాశనం చేయను. నేను దేవుణ్ణి, మనిషిని కాను. మీ మధ్య ఉన్న పవిత్రుణ్ణి. నా ఉగ్రతతో బయలుదేరను.
10 耶和华必如狮子吼叫, 子民必跟随他。 他一吼叫, 他们就从西方急速而来。
౧౦వారు యెహోవా వెంట నడుస్తారు. సింహం గర్జించినట్టు నేను గర్జిస్తాను. నేను గర్జించగా పశ్చిమ దిక్కున ఉన్న ప్రజలు వణకుతూ వస్తారు.
11 他们必如雀鸟从埃及急速而来, 又如鸽子从亚述地来到。 我必使他们住自己的房屋。 这是耶和华说的。
౧౧వారు వణకుతూ పక్షులు ఎగిరి వచ్చినట్టు ఐగుప్తు దేశంలో నుండి వస్తారు. గువ్వల్లాగా అష్షూరు దేశంలోనుండి ఎగిరి వస్తారు. నేను వారిని వారి నివాసాల్లో కాపురముంచుతాను.” ఇదే యెహోవా వాక్కు.
12 以法莲用谎话, 以色列家用诡计围绕我; 犹大却靠 神掌权, 向圣者有忠心。
౧౨ఎఫ్రాయిము వారు నా చుట్టూ అబద్ధాలు అల్లారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించారు. కానీ యూదా వారు ఇంకా నాతోనే ఉన్నారు. పరిశుద్ధ దేవునికి నమ్మకంగానే ఉన్నారు.

< 何西阿书 11 >