< 创世记 10 >

1 挪亚的儿子闪、含、雅弗的后代记在下面。洪水以后,他们都生了儿子。
నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు.
2 雅弗的儿子是歌篾、玛各、玛代、雅完、土巴、米设、提拉。
యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
3 歌篾的儿子是亚实基拿、利法、陀迦玛。
గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా.
4 雅完的儿子是以利沙、他施、基提、多单。
యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
5 这些人的后裔将各国的地土、海岛分开居住,各随各的方言、宗族立国。
వీళ్ళనుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం, ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు వేరైపోయారు.
6 含的儿子是古实、麦西、弗、迦南。
హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను.
7 古实的儿子是西巴、哈腓拉、撒弗他、拉玛、撒弗提迦。拉玛的儿子是示巴、底但。
కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.
8 古实又生宁录,他为世上英雄之首。
కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు.
9 他在耶和华面前是个英勇的猎户,所以俗语说:“像宁录在耶和华面前是个英勇的猎户。”
అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి “యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే” అనే నానుడి ఉంది.
10 他国的起头是巴别、以力、亚甲、甲尼,都在示拿地。
౧౦షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు.
11 他从那地出来往亚述去,建造尼尼微、利河伯、迦拉,
౧౧ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను,
12 和尼尼微、迦拉中间的利鲜,这就是那大城。
౧౨నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు.
13 麦西生路低人、亚拿米人、利哈比人、拿弗土希人、
౧౩మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ,
14 帕斯鲁细人、迦斯路希人、迦斐托人;从迦斐托出来的有非利士人。
౧౪పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి.
15 迦南生长子西顿,又生赫
౧౫కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరీయ, గిర్గాషీ,
16 和耶布斯人、亚摩利人、革迦撒人、
౧౬హివ్వీ, అర్కీయు, సినీయ,
17 希未人、亚基人、西尼人、
౧౭అర్వాదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు.
18 亚瓦底人、洗玛利人、哈马人,后来迦南的诸族分散了。
౧౮ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి.
19 迦南的境界是从西顿向基拉耳的路上,直到迦萨,又向所多玛、蛾摩拉、押玛、洗扁的路上,直到拉沙。
౧౯కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్ళే దారిలో గాజా వరకూ, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకూ ఉంది.
20 这就是含的后裔,各随他们的宗族、方言,所住的地土、邦国。
౨౦వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం.
21 雅弗的哥哥闪,是希伯子孙之祖,他也生了儿子。
౨౧యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరు వంశానికి మూలపురుషుడు షేము.
22 闪的儿子是以拦、亚述、亚法撒、路德、亚兰。
౨౨షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
23 亚兰的儿子是乌斯、户勒、基帖、玛施。
౨౩అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష.
24 亚法撒生沙拉;沙拉生希伯。
౨౪అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
25 希伯生了两个儿子,一个名叫法勒,因为那时人就分地居住;法勒的兄弟名叫约坍。
౨౫ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను.
26 约坍生亚摩答、沙列、哈萨玛非、耶拉、
౨౬యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
27 哈多兰、乌萨、德拉、
౨౭హదోరము, ఊజాలు, దిక్లా,
28 俄巴路、亚比玛利、示巴、
౨౮ఓబాలు, అబీమాయెలు, షేబ,
29 阿斐、哈腓拉、约巴,这都是约坍的儿子。
౨౯ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు.
30 他们所住的地方是从米沙直到西发东边的山。
౩౦వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు.
31 这就是闪的子孙,各随他们的宗族、方言,所住的地土、邦国。
౩౧వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు.
32 这些都是挪亚三个儿子的宗族,各随他们的支派立国。洪水以后,他们在地上分为邦国。
౩౨తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళల్లోనుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు.

< 创世记 10 >