< 詩篇 81 >
1 詠【慶節的歌詠】阿撒夫的詩歌,交與樂官。調寄「加特」。 請眾向助佑我們的天主歌舞,向雅各伯的天主歡呼。
౧ప్రధాన సంగీతకారుని కోసం, గిత్తీతు రాగంతో పాడేది. ఆసాపు కీర్తన. మనకు బలం అయిన దేవునికి బిగ్గరగా పాడండి, యాకోబు దేవునికి ఉత్సాహంగా కేకలు వేయండి.
2 請眾高唱新歌,手擊鐃鼓,和彈琴瑟,奏悅耳的樂譜。
౨పాట పాడి, కంజరి వాయించండి, మధురంగా తీగ వాయిద్యాలు వాయించండి.
3 在月朔之日和月圓之夜,在我們的慶節,吹起號角,
౩అమావాస్య రోజు, మన పండగ మొదలయ్యే పౌర్ణమి రోజు కొమ్ము ఊదండి.
౪అది ఇశ్రాయేలీయులకు చట్టం. యాకోబు దేవుడు నిర్ణయించిన కట్టడ.
5 當他出擊埃及國時,給若瑟立了這法規。我聽到從未聽的諾言:
౫ఆయన ఈజిప్టు దేశం మీదికి దండెత్తినప్పుడు యోసేపు సంతతికి దీన్ని శాసనంగా నియమించాడు. అక్కడ నేనెరగని భాష విన్నాను.
౬వారి భుజాల నుంచి నేను బరువు దించాను, వారి చేతులు మోతగంపలు మోయకుండా విడుదల పొందాయి.
7 您在患難中呼喊,我救了你,從雷鳴雲彩中,我答應你;在默黎巴,我試探了你。
౭నీ ఆపదలో నువ్వు మొరపెట్టావు. నేను నిన్ను విడిపించాను. ఉరిమే మబ్బుల్లోనుంచి నీకు జవాబిచ్చాను. మెరీబా నీళ్ళ దగ్గర నీకు పరీక్ష పెట్టాను. (సెలా)
8 請聽,我的百姓,我要警告你!以色列!恨不得你能聽從我:
౮నా ప్రజలారా, వినండి. ఎందుకంటే నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను. అయ్యో ఇశ్రాయేలూ, నువ్వు నా మాట వింటే ఎంత బాగుండేది!
౯ఇతర దేవుళ్ళు ఎవరూ మీ మధ్య ఉండకూడదు, వేరే దేవుళ్ళలో ఎవరినీ నువ్వు పూజించకూడదు.
10 我是上主,我是你的天主,是我由埃及國將你領出,你張開口,我要使你滿足。
౧౦నేనే మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశంనుంచి మిమ్మల్ని తెచ్చింది నేనే. నీ నోరు బాగా తెరువు. నేను దాన్ని నింపుతాను.
11 可惜我的百姓沒有您的呼聲,以色列人也沒有服從我的命令。
౧౧అయితే నా ప్రజలు నా మాట వినలేదు, ఇశ్రాయేలీయులు నాకు లోబడలేదు.
12 因此,我就任憑他們的心靈頑硬,讓他們隨的私意而行。
౧౨కాబట్టి వాళ్ళు తమ సొంత ఉద్దేశాలను అనుసరించనిచ్చాను. వారి హృదయకాఠిన్యానికి నేను వారిని అప్పగించాను.
13 如果我的聽了我的命令,以色列人隨從我的道路而行,
౧౩అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండేది! నా ప్రజలు నా విధానాలు అనుసరిస్తే ఎంత బాగుండేది!
14 立刻就會壓迫他們的敵人,轉過手打擊難為他們的仇人。
౧౪అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచి వేసేవాణ్ణి. వాళ్ళను అణిచి వేసేవారి మీదికి నా చెయ్యి ఎత్తుతాను.
15 仇恨上主的人必來向他們歸順,仇人的厄運從此要永久常存。
౧౫యెహోవాను ద్వేషించేవాళ్ళు ఆయనకు భయంతో వినయంగా ఆయన ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు శాశ్వతంగా అవమానానికి గురి అవుతారు గాక!
16 但我要以麥子的精華養育選民,以石中的蜂蜜飽享他們。
౧౬అతిశ్రేష్ఠమైన గోదుమలతో నేను ఇశ్రాయేలును పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను.