< 箴言 21 >

1 君王的心在上主手裏,有如水流,可隨意轉移。
రాజు హృదయం యెహోవా చేతిలో కాలవల్లాగా ఉంది. ఆయన తన ఇష్ట ప్రకారం దాన్ని మళ్ళిస్తాడు.
2 人對自己的行為,都自覺正直;但審察人心的,卻是上主。
ఒకడు ఎన్నుకున్న మార్గం అది ఎలాటిదైనా సరే, తన దృష్టికది న్యాయం గానే కనిపిస్తుంది. హృదయాలను పరిశీలించేది యెహోవాయే.
3 秉公行義,比獻祭獻更悅上主。
బలులు అర్పించడం కంటే నీతిన్యాయాలను అనుసరించి నడచు కోవడం యెహోవాకు ప్రీతికరం.
4 傲慢的眼睛,驕傲的心靈,惡人的炫耀,無非是罪惡。
అహంకారం గర్విష్టి హృదయం భక్తిహీనులు వర్ధిల్లడం పాపం.
5 熟思的人,必足以致富;草率的人,必貧困纏身。
శ్రద్ధగలవారి ఆలోచనలు లాభాన్ని తెస్తాయి. తొందరపాటుగా పనిచేసే వాడికి నష్టమే.
6 以謊言偽語騙得的財寶,是浮雲輕煙,死亡的羅網。
అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం.
7 惡人的暴戾,必殃及自身,因他們不肯去履行正義。
భక్తిహీనులకు న్యాయం గిట్టదు. వారు చేసే దౌర్జన్యమే వారిని కొట్టుకు పోయేలా చేస్తుంది.
8 惡人的道路,歪曲邪僻;正人的行為,正直適中。
దోషంతో నిండిన వాడి మార్గం వంకర మార్గం. పవిత్రులు రుజుమార్గంలో నడుచుకుంటారు.
9 寧願住在屋頂的一角,不願與吵婦同居一室。
గయ్యాళితో భవంతిలో ఉండడం కంటే మిద్దెపై ఒక మూలన నివసించడం మేలు.
10 惡人的心靈,只求邪惡;對自己友伴,毫不關懷。
౧౦భక్తిలేని వాడి మనస్సు అస్తమానం కీడు చేయాలని చూస్తుంటుంది. అతని పొరుగు వాడికి అతని కన్నుల్లో దయ ఎంతమాత్రం కనిపించదు.
11 輕狂人遭受處罰,幼稚者將得明智;智慧人接受教訓,更增加自己知識。
౧౧అపహాసకుడికి శిక్ష రావడం చూసి ఆజ్ఞాని బుద్ధి తెచ్చుకుంటాడు. ఉపదేశం మూలంగా జ్ఞానం గలవాడి తెలివి పెరుగుతుంది.
12 正義的上主監視惡人的家,且使惡人們都陷於災禍中。
౧౨న్యాయం చేసే వాడు భక్తిహీనుల ఇల్లు ఏమైపోతున్నదో కనిపెట్టి చూస్తుంటాడు. దుర్మార్గులను ఆయన పడగొట్టి నాశనం చేస్తాడు.
13 誰對窮人的哀求,充耳不聞,他呼求時,也不會得到應允。
౧౩దరిద్రుల మొర వినకుండా చెవులు మూసుకునేవాడు తాను మొర్ర పెట్టే సమయంలో దేవుడు దాన్ని వినిపించుకోడు.
14 暗中相送的饋贈,可平息忿怒;投入懷中的禮物,可平息狂怒。
౧౪చాటున ఇచ్చిన కానుక కోపాన్ని చల్లారుస్తుంది. రహస్యంగా ఇచ్చిన బహుమానం తీవ్ర కోపాన్ని సైతం శాంతింప జేస్తుంది.
15 秉公行義,能叫義人喜樂;但為作惡的人,卻是恐懼。
౧౫న్యాయ క్రియలు చేయడం నీతిపరుడికి సంతోషం. పాపాత్ముడికి అది భయంకరం.
16 凡遠離明智道路的人,必居於幽靈的集會中。
౧౬వివేకమార్గం తప్పి తిరిగేవాడు ప్రేతాత్మల గుంపులో కాపురముంటాడు.
17 貪愛享樂的人,必遭受窮困;喜愛酒油的人,必不會致富。
౧౭సుఖభోగాల్లో వాంఛ గలవాడు దరిద్రుడౌతాడు. ద్రాక్షారసం, నూనెల కోసం వెంపర్లాడే వాడికి ఐశ్వర్యం కలగదు.
18 惡人必將為義人作贖金,敗類也將替君子作代價。
౧౮నీతిపరుని కోసం దుర్మార్గులు విడుదల వెలగా ఉంటారు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతకులు పరిహారంగా ఉంటారు.
19 與好爭易怒的女人同居,倒不如獨自住在曠野裏。
౧౯ప్రాణం విసికించే జగడగొండి దానితో కాపురం చెయ్యడం కంటే ఎడారిలో నివసించడం మేలు.
20 珍貴的寶藏和油,積藏在智者家裏;但糊塗愚昧的人,卻將之消耗淨盡。
౨౦విలువైన నిధులు, నూనె జ్ఞానుల ఇళ్ళలో ఉంటాయి. బుద్ధిహీనుడు వాటిని నిర్లక్షంగా ఖర్చు చేస్తాడు.
21 追求正義和仁慈的人,必將獲得生命與尊榮。
౨౧నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు.
22 智者必登上勇士的城邑,攻破城邑所憑倚的保壘。
౨౨జ్ఞానవంతుడు పరాక్రమశాలుల నగరం పై దాడి చేస్తాడు. అతడు దాని భద్రమైన కోటను కూలదోస్తాడు.
23 誰謹守自己的口舌,心靈必能免受煩惱。
౨౩నోటిని నాలుకను కాపాడుకునేవాడు ఇబ్బందుల నుండి తనను కాపాడుకుంటాడు.
24 高傲的人名叫「狂人」,他行事必極端蠻橫。
౨౪అహంకారి, గర్విష్టి-అతనికి అపహాసకుడు అని పేరు. అలాంటివాడు గర్వంతో మిడిసి పడతాడు.
25 怠惰人的手不肯操作,必為他的願望所扼殺。
౨౫సోమరిపోతు చేతులు పనిచేయవు. వాడి కోరికలే వాడికి చావు తెచ్చిపెడతాయి.
26 貪婪的人,終日貪婪;正義的人,廣施不吝。
౨౬రోజంతా అతనిలో ఆశలు ఊరుతూనే ఉంటాయి. యథార్థంగా ప్రవర్తించేవాడు వెనుదీయకుండా ఇస్తూనే ఉంటాడు.
27 惡人的祭獻,已是可憎;若懷惡而獻,更將如何﹖
౨౭దుష్టులర్పించే బలులు అసహ్యం. ఆ బలులు వారు దురాలోచనతో అర్పిస్తే అవి మరింకెంత అసహ్యమో గదా.
28 作假見證的人,必要滅亡;但善於聽的人,纔可常言。
౨౮అబద్ధసాక్షి నాశనమై పోతాడు. శ్రద్ధగా వినేవాడు పలికే మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
29 邪惡的人,常裝腔作勢;正直的人,卻舉止檢點。
౨౯దుర్మార్గుడు ముఖం మాడ్చుకుంటాడు. యథార్థవంతుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాడు.
30 任何智慧、才略或計謀,都不能與上主相對抗。
౩౦యెహోవాకు విరోధమైన జ్ఞానంగానీ వివేచనగానీ ఆలోచనగానీ నిలవదు.
31 招兵買馬,是為作作戰之日;但是勝利,卻由上主指使。
౩౧యుద్ధదినానికి గుర్రాన్ని సిద్ధపరుస్తారు. అయితే విజయం యెహోవాదే.

< 箴言 21 >