< 民數記 33 >
1 以下是以色列子民在梅瑟和亞郎指揮下,分隊出離埃及國後所行的路程。
౧మోషే అహరోనుల నాయకత్వంలో తమ తమ సేనల ప్రకారం ఐగుప్తుదేశం నుండి ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు.
2 梅瑟記錄了他們遵上主的命啟營的出發點。以下是他們依次出發的行程:
౨యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు.
3 他們於正月十五日由辣默色斯起程,即在逾越節第二日,以色列子民大膽地、當著眾埃及人的面出走了,
౩మొదటి నెల 15 వ రోజున వారు రామెసేసు నుండి పస్కా పండగ మరునాడు ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరారు. అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు.
4 其時埃及人正在埋葬上主在他們中所擊殺的一切長子;上主也懲罰了他們的神祇。
౪ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు.
౫ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు.
౬సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు.
7 由厄堂起程,轉向巴耳責豐的丕哈希洛特,在米革多耳對面紮營。
౭ఏతాము నుండి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతు వైపు తిరిగి మిగ్దోలు దగ్గర ఆగారు.
8 由丕哈希洛特起程,由海中經過進入曠野,在厄堂曠野中行了三天的路,然後在瑪辣紮營。
౮పీహహీరోతు నుండి సముద్రం మధ్య నుండి అరణ్యంలోకి వెళ్ళి ఏతాము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణం చేసి మారాకు వచ్చారు. మారా నుండి ఏలీముకు వచ్చారు.
9 由瑪辣起程,來到厄林。在厄林有十二水泉和七十株棕櫚樹,就在那裡紮營。
౯ఏలీములో 12 నీటిబుగ్గలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. వారక్కడ ఆగారు.
౧౦ఏలీము నుండి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు.
౧౧అక్కడినుండి సీను అరణ్యంలో ఆగారు.
౧౨సీను అరణ్యం నుండి దోపకాకు వచ్చారు.
౧౩దోపకా నుండి ఆలూషుకు వచ్చారు.
14 由阿路士起程,在勒非丁紮營;民眾在這裡沒有水喝。
౧౪ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.
౧౫రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు.
౧౬అక్కడి నుండి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.
౧౭కిబ్రోతు హత్తావా నుండి హజేరోతు వచ్చారు.
౧౮హజేరోతు నుండి రిత్మా వచ్చారు.
౧౯రిత్మా నుండి రిమ్మోను పారెసుకు వచ్చారు.
౨౦రిమ్మోను పారెసు నుండి లిబ్నాకు వచ్చారు.
౨౧లిబ్నాలో నుండి రీసాకు వచ్చారు.
౨౨రీసా నుండి కెహేలాతాకు వచ్చారు.
౨౩కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు.
౨౪షాపెరు కొండ దగ్గర నుండి హరాదాకు వచ్చారు.
౨౫హరాదా నుండి మకెలోతుకు వచ్చారు.
౨౬మకెలోతు నుండి తాహతుకు వచ్చారు.
౨౭తాహతు నుండి తారహుకు వచ్చారు.
౨౮తారహు నుండి మిత్కాకు వచ్చారు.
౨౯మిత్కా నుండి హష్మోనాకు వచ్చారు.
౩౦హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు.
౩౧మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.
౩౨బెనేయాకాను నుండి హోర్‌హగ్గిద్గాదుకు వచ్చారు.
౩౩హోర్‌హగ్గిద్గాదు నుండి యొత్బాతాకు వచ్చారు.
౩౪యొత్బాతా నుండి ఎబ్రోనాకు వచ్చారు.
౩౫ఎబ్రోనా నుండి ఎసోన్గెబెరుకు వచ్చారు.
36 由厄茲雍革貝爾起程,在親曠野,即卡德士紮營。
౩౬ఎసోన్గెబెరు నుండి కాదేషు అని పిలిచే సీను అరణ్యానికి వచ్చారు.
37 由卡德士起程,在位於厄東地邊界上的曷爾山下紮營。
౩౭కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు.
38 亞郎大司祭依上主的命,上了曷爾山,死在那裡,時在以色列子民出埃及國後四十年五月初一日。
౩౮యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడు అహరోను హోరు కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 వ సంవత్సరం అయిదో నెల మొదటి రోజు.
౩౯అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు.
40 其時住在客納罕南部的客納罕人王阿辣得聽說以色列子民來了。
౪౦అప్పుడు కనాను దేశపు దక్షిణాన నివసించే అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి విన్నాడు.
౪౧వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు.
౪౨సల్మానాలో నుండి పూనోనుకు వచ్చారు.
౪౩పూనోనులో నుండి ఓబోతుకు వచ్చారు.
44 由敖波特起程,在位於摩阿布邊境的依因阿巴陵紮營。
౪౪ఓబోతు నుండి మోయాబు పొలిమేర దగ్గర ఉన్న ఈయ్యె అబారీముకు వచ్చారు.
౪౫ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు.
౪౬దీబోను గాదు నుండి అల్మోను దిబ్లాతాయిముకు వచ్చారు.
47 由阿耳孟狄貝拉塔因起程,在乃波前面的阿巴陵山地內紮營。
౪౭అల్మోను దిబ్లాతాయిము నుండి నెబో ఎదురుగా ఉన్న అబారీము కొండలకు వచ్చారు.
48 由阿巴陵山地起程,在耶里哥對面,約但河邊,摩阿布曠野紮營;
౪౮అబారీము కొండల నుండి యెరికో దగ్గర యొర్దానుకు దగ్గరగా ఉన్న మోయాబు మైదానాలకు వచ్చారు.
49 他們在摩阿布曠野裡,沿著約但河邊紮營,由貝特耶史摩特直到阿貝耳史廷。
౪౯వారు మోయాబు మైదానాల్లో బెత్యేషీమోతు మొదలు ఆబేలు షిత్తీము వరకూ యొర్దాను దగ్గర విడిది చేశారు.
50 在耶里哥對面,約但河邊,摩阿布曠野內,上主訓示梅瑟說:「
౫౦యెరికో దగ్గర, అంటే యొర్దానుకు పక్కనే ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
51 你告訴以色列子民說:你們幾時過了約但,進入客納罕地,
౫౧“నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ‘మీరు యొర్దానును దాటి కనాను దేశాన్ని చేరిన తరువాత
52 應由你們面前驅逐當地所有的居民,應毀壞他們的一切偶像,應打碎他們的一切鑄像,應鏟除他們的一切丘壇。
౫౨ఆ దేశ ప్రజలందరినీ మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి ప్రతిమలన్నిటినీ ధ్వంసం చేసి వారి పోత విగ్రహాలన్నిటిని పగలగొట్టి వారి ఉన్నత ప్రదేశాల్లో ఉన్న వారి పూజా స్థలాలను పాడుచేయాలి.
53 你們要佔領那地方,住在那裡,因為我已將那裡給了你們叫你們佔有。
౫౩ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను.
54 你們要按支派抽籤分配那地方:人數多的多給,人數少的少給。誰的籤落在那裡,那裡就屬於他。你們依照宗祖支派分配你們的產業。
౫౪మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి.
55 但如果你們不把當地的居民由你們面前驅逐,那留下的居民,必要成為你們的眼中刺,腰間針,在你們住的地方內迫害你們;
౫౫అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ ప్రజలను వెళ్లగొట్టకపోతే, మీరు ఎవరిని ఉండనిచ్చారో వారు మీ కళ్ళలో ముళ్ళుగా, మీ పక్కలో శూలాలుగా ఉండి, మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్మల్ని బాధలకు గురిచేస్తారు.
56 並且我打算了怎樣對待他們,也要怎樣對待你們。」
౫౬అంతేగాక నేను వారికి ఏం చేయాలనుకున్నానో దానినే మీకు కూడా చేస్తాను.’”