< 民數記 14 >

1 全會眾都大聲喧嚷,人民哭了一夜。
ఆ రాత్రి ప్రజలందరూ పెద్దగా కేకలు పెట్టి ఏడ్చారు.
2 以色列子民都抱怨梅瑟和亞郎;全會眾對他們說:「巴不得我們都死在埃及地,都死在曠野裏!
ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులకు వ్యతిరేకంగా గొడవ చేశారు.
3 為什麼上主引我們到那地方死在刀下,叫我們的妻子兒女當作戰利品﹖再回埃及去,為我們豈不更好﹖」
ఆ సమాజమంతా వారితో “ఈ అరణ్యంలో చనిపోవడం కన్నా మేము ఐగుప్తులో చనిపోతే బాగుండేది! మేము కత్తివాత చావాలని యెహోవా మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడా? మా భార్యలు, మా చిన్న పిల్లలు బాధల పాలౌతారు. మళ్ళీ ఐగుప్తు తిరిగి వెళ్ళడం మాకు మేలు కాదా?” అన్నారు.
4 於是彼此說:「我們另立頭目,回埃及去。」
వారు “మనం ఇంకొక నాయకుణ్ణి ఎంపిక చేసుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్దాం పదండి” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
5 梅瑟和亞郎遂俯伏在以色列子民全會眾前。
అప్పుడు మోషే, అహరోను ఇశ్రాయేలు ప్రజల సమావేశం ఎదుట సాగిలపడ్డారు.
6 偵探那地方的人中,有農的兒子若蘇厄和耶孚乃的兒子加肋布,他們撕裂了自己的衣服,
అప్పుడు, ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూసిన వారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బట్టలు చింపుకుని,
7 告訴以色列子民全會眾說:「我們偵探所經過的地方,確是一片極好的地方。
ఇశ్రాయేలీయుల సర్వజన సమూహంతో మాట్లాడుతూ “మేము సంచారం చేసి పరిశీలించి చూసిన ప్రదేశం ఎంతో మంచి ప్రదేశం.
8 若上主恩待我們,必引我們到那裏去,將那地方賜給我們。那實在是一塊流奶流蜜的地方。
యెహోవా మనలను బట్టి ఆనందిస్తే, ఆ ప్రదేశంలో మనలను చేర్చి, దాన్ని మనకు ఇస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం.
9 只要你們不反抗上主,就不必怕那地方的人民,因為他們要作我們的掠物;護佑他們的,離開了他們,上主卻與我們同在;所以不要怕他們。」
కాబట్టి, మీరు యెహోవా మీద తిరగబడవద్దు. ఆ దేశ ప్రజలకు భయపడవద్దు. వారు మనకు అన్నం తిన్నంత తేలిక. యెహోవా మనతో ఉన్నాడు గనక వారి భద్రత ఇక వారి పై నుండి తొలిగిపోతుంది. వాళ్లకు భయపడవద్దు” అన్నారు. కాని, ఆ సమూహం, వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు.
10 全會眾正說要用石頭砸死他們時,上主的榮耀在會幕上顯示給全以色列子民。
౧౦అప్పుడు సన్నిధి గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడింది.
11 上主對梅瑟說:「這人民輕慢我要到幾時呢﹖我雖在他們中行了那些神蹟,他們仍不相信我,要到幾時呢﹖
౧౧యెహోవా మోషేతో “ఎంతకాలం ఈ ప్రజలు నన్ను కించపరుస్తారు? నా శక్తిని చూపించే సూచనలన్నీ నేను వారి మధ్య జరిగించినా, నన్ను ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు?
12 我要用瘟疫打擊他們,剷除他們,使你成為一個比他們更強大,更昌盛的民族。」
౧౨నేను వారి మీద తెగులుపంపిస్తాను. వారికి వారసత్వ హక్కు లేకుండా చేస్తాను. ఈ జనం కంటే మరింత గొప్ప బలమైన జనాంగాన్ని నీ వంశం ద్వారా పుట్టిస్తాను” అన్నాడు.
13 但是梅瑟對上主說:「埃及人如果聽說這事,因為你曾用威力由他們中領出這民族來,
౧౩మోషే యెహోవాతో “అలా చేస్తే ఐగుప్తీయులు దాని గురించి వింటారు. ఎందుకంటే నీ బలంతో నువ్వు ఈ జనాన్ని ఐగుప్తీయుల్లో నుంచి రప్పించావు. వారు ఈ దేశ వాసులతో ఈ విషయం చెప్తారు.
14 他們將說什麼﹖這地方的居民也曾聽說:你上主是在這民族中;你上主曾面對面地發顯出來,你的雲彩常停在他們上面;白日你乘雲柱,黑夜你乘火柱,走在他們前面。
౧౪యెహోవా అనే నువ్వు ఈ ప్రజల మధ్య ఉన్నావనీ, యెహోవా అనే నువ్వు ముఖాముఖిగా కనిపించినవాడివనీ, నీ మేఘం వారి మీద నిలిచి ఉన్నదనీ, నువ్వు పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందు నడుస్తున్నావనీ, వారు విని ఉన్నారు గదా.
15 現在,如果你消滅這民族如消滅一個人一樣,這些曾聽到你聲名的外邦民族必要議論說:『
౧౫కాబట్టి నువ్వు ఒక్క దెబ్బతో ఈ ప్రజలను చంపితే నీ కీర్తిని గురించి విన్న ప్రజలు
16 由於上主不能引這民族進入他對他們所誓許的地方,就在曠野將他們殺了。』
౧౬‘ప్రమాణ పూర్వకంగా తాను ఈ ప్రజలకిచ్చిన దేశంలో వారినిచేర్చడానికి శక్తిలేక, యెహోవా వారిని అరణ్యంలో చంపేశాడు’ అని చెప్పుకుంటారు.
17 吾主,如今求你,大發寬容,如你曾聲明說:
౧౭‘యెహోవా దీర్ఘశాంతుడు, నిబంధన నమ్మకత్వం సమృద్ధిగా కలిగినవాడు.
18 上主緩於發怒,富於仁慈,寬赦過犯和罪過,但決不豁免懲罰,父親的過犯,要向子孫追討,直到三代四代。
౧౮దోషం, అతిక్రమం పరిహరించేవాడు. అపరాధిని నిరపరాధిగా ఎంచకుండా, మూడు నాలుగు తరాల వరకూ తండ్రుల దోషాన్ని కొడుకుల మీదికి తెచ్చే వాడిగా ఉన్నాడు’ అని నువ్వు చెప్పిన మాట ప్రకారం నా ప్రభువు బలానికి ఘనత కలుగు గాక.
19 求你大發仁慈,寬恕這人民的罪過,就如從埃及一直到現在,你寬赦了他們一樣。」
౧౯ఐగుప్తులోనుంచి వచ్చింది మొదలు ఇంతవరకూ నువ్వు ఈ ప్రజల పాపం పరిహరించినట్టు నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్నిబట్టి ఈ ప్రజల పాపాన్ని దయచేసి క్షమించు” అన్నాడు.
20 上主回答說:「我就照你祈求的寬赦他們;
౨౦యెహోవా “నీ కోరిక ప్రకారం నేను క్షమించాను.
21 但是我以我的生命,以充滿全地的上主的榮耀起誓:
౨౧కాని, నా జీవంతో తోడు, భూమి అంతా నిండి ఉన్న యెహోవా మహిమ తోడు,
22 這些見了我的榮耀,見了我在埃及和曠野裏所行的神蹟的人,已十次試探了我,不聽我的話,
౨౨ఐగుప్తులో, అరణ్యంలో నేను చేసిన సూచనలనూ, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ, ఈ పదిసార్లు నా మాట వినకుండా నన్ను పరీక్షకు గురి చేశారు.
23 他們決不能見我對他們祖先誓許的地方;凡輕慢我的人,決不會見到那地方。
౨౩కాబట్టి వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా నేనిచ్చిన దేశాన్ని వారు చూడనే చూడరు. నన్ను పట్టించుకోని వారిలో ఎవరూ దాన్ని చూడరు.
24 惟有我的僕人加肋布,因懷有另一種精神,全心服從我,我必引他進入他去過的地方,他的後裔必佔有那地方為產業。
౨౪నా సేవకుడైన కాలేబు వీళ్ళ లాంటి వాడు కాదు. అతడు పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన కారణంగా అతడు పరిశీలించడానికి వెళ్ళిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను.
25 現今阿瑪肋克人和客納罕人盤據在山谷中,明天你們應轉身向紅海出發,往曠野去。」
౨౫అతని సంతానం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అమాలేకీయులు, కనానీయులు ఆ లోయలో నివాసం ఉంటున్నారు. రేపు మీరు తిరిగి ఎర్రసముద్రం మార్గంలో అరణ్యంలోకి ప్రయాణమై వెళ్ళండి” అన్నాడు.
26 上主吩咐梅瑟和亞郎說:「
౨౬ఇంకా యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతూ,
27 這個邪惡的會眾抱怨我要到幾時﹖以色列子民抱怨我的話我都聽見了。
౨౭“నాకు విరోధంగా నన్ను విమర్శించే ఈ చెడ్డ సమాజాన్ని నేనెంత వరకూ సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా చేస్తున్న విమర్శలు నేను విన్నాను.
28 你對他們說:我以我的生命起誓:──上主的斷語──我必照你們在我耳中所說的話,對待你們:
౨౮నువ్వు వారితో, యెహోవా చెప్పేదేమంటే, నేను జీవంతో ఉన్నట్టు, మీరు నాతో చెప్పినట్టు నేను కచ్చితంగా మీపట్ల చేస్తాను.
29 你們中凡二十歲以上登過記的,凡抱怨過我的,都要倒斃在這曠野中。
౨౯మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. మీ పూర్తి లెక్క ప్రకారం మీలో లెక్కకు వచ్చిన వారందరూ, అంటే, ఇరవై సంవత్సరాలు మొదలు ఆ పైవయస్సు కలిగి, నాకు విరోధంగా విమర్శించిన వారిందరూ రాలిపోతారు.
30 你們決不得進入我誓許給你們居住的地方,只有耶孚乃的加肋布和農的兒子若蘇厄除外。
౩౦యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప మీకు నివాసంగా ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశంలో కచ్చితంగా మీలో ఎవరూ ప్రవేశించరు.
31 至於你們的幼童,你們曾說他們要當戰利品的,我要領他們進去,使他們享受你們所輕視的地方。
౩౧కాని, బందీలౌతారని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన దేశాన్ని వారు అనుభవిస్తారు.
32 至於你們,你們必倒斃在這曠野中;
౩౨మీ విషయంలో మాత్రం, మీ శవాలు ఈ అరణ్యంలో రాలిపోతాయి.
33 你們的子女要在曠野漂流四十年,受你們背信之罰,直到你們的屍首在曠野中爛盡。
౩౩మీ పిల్లలు ఈ అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరుగులాడతారు. ఈ అరణ్యం మీ శరీరాలను చంపే వరకూ మీ తిరుగుబాటు వల్ల వచ్చిన పర్యవసానాలను వారు భరించాలి.
34 你們偵探那地方的日子,共計四十天,一天算一年,你們應受四十年的罪罰,叫你們知道我放棄你們是什麼一回事。
౩౪మీరు ఆ ప్రదేశాన్ని సంచారం చేసి చూసిన నలభై రోజుల లెక్క ప్రకారం రోజుకు ఒక సంవత్సరం ప్రకారం నలభై సంవత్సరాలు మీ పాపశిక్షను భరించి, నేను మీకు శత్రువైతే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి.
35 我上主既說了,也必對這聚集反抗我的邪惡會眾這樣做:在這曠野他們都要滅絕,在這裏都要死盡。」
౩౫నేను, యెహోవాను మాట్లాడాను. నాకు విరోధంగా సమకూడిన ఈ దుర్మార్గపు సమాజం పట్ల నేను దీన్ని కచ్చితంగా జరిగిస్తాను. ఈ అరణ్యంలో వారు నాశనం అయిపోతారు. ఇక్కడే చనిపోతారు” అన్నాడు.
36 梅瑟派遣去偵探那地方的人,回來以後,對那地方散佈謠言,致使全會眾抱怨梅瑟。
౩౬మోషే పంపినప్పుడు ఆ దేశంలో సంచారం చేసి చూడడానికి వెళ్లి తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పడం వల్ల సమాజం అంతా అతని మీద తిరుగుబాటు చేసిన మనుషులు,
37 這些對那地方講說壞話的人,都遭了災罰,死在上主面前;
౩౭అంటే ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిలో తెగులు వల్ల చనిపోయారు.
38 前去偵探那地方的人,只有農的兒子若蘇厄和耶孚乃的兒子加肋布,保全了性命。
౩౮అయితే ఆ దేశం సంచారం చేసి చూసిన మనుషుల్లో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బ్రతికారు.
39 梅瑟將這些話告訴了全以色列子民;人民都非常憂悶。
౩౯మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పినప్పుడు ఆ ప్రజలు చాలా దుఃఖపడ్డారు.
40 次日清晨他們起來,要上山頂去,說:「我們犯了罪,現在我們已準備好,要往上主所說的地方去。」
౪౦వారు ఉదయాన లేచి ఆ కొండ శిఖరం ఎక్కి “మనం నిజంగా పాపం చేశాం. చూడండి, మనం ఇక్కడ ఉన్నాం. యెహోవా మనకు వాగ్దానం చేసిన స్థలానికి వెళ్దాం” అన్నారు.
41 但是梅瑟說:「你們為什麼要違背上主的命令﹖這事必不會成功。
౪౧కాని మోషే “మీరు యెహోవా ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు?
42 不要上去,因為上主不在你們中間,難免不被敵人擊敗。
౪౨దాన్ని మీరు సాధించ లేరు. యెహోవా మీ మధ్య లేడు కాబట్టి మీ శత్రువుల ఎదుట మీరు హతం అవుతారు. మీరు వెళ్ళవద్దు.
43 因為阿瑪肋克人和客納罕人在那裏要抵擋你們,你們必喪身刀下;你們既背離了上主,上主自然不再與你們同在。」
౪౩ఎందుకంటే, అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరారు. మీరు ఖడ్గం చేత చనిపోతారు. మీరు యెహోవాను అనుసరించ లేదు గనక ఇంక యెహోవా మీకు తోడుగా ఉండడు” అని చెప్పాడు.
44 他們仍擅自上了山頂;但上主的約櫃和梅瑟沒有由營幕中移動。
౪౪కాని వారు మూర్ఖంగా ఆ కొండ కొన మీదకు ఎక్కి వెళ్ళారు. కాని, యెహోవా నిబంధన మందసం గానీ, మోషే గానీ శిబిరం నుంచి బయటకు వెళ్ళలేదు.
45 住在山中的阿瑪肋克人和客納罕人就下來,擊殺了他們,將他們追擊到曷爾瑪。
౪౫అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలేకీయులు, కనానీయులు దిగి వచ్చి వారిపై దాడి చేసి, హోర్మా వరకూ వారిని తరిమి హతం చేశారు.

< 民數記 14 >