< 約翰福音 2 >

1 第三天,在加利肋亞加納有婚宴,耶穌的母親在那裏;
మూడవ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది.
2 耶穌和衪的門徒也疲請去赴婚宴。
ఆ పెళ్ళికి యేసునూ ఆయన శిష్యులనూ కూడా పిలిచారు.
3 酒缺了,耶穌的母親向衪說:「他們沒有酒了。」
విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, “వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది.
4 耶穌回答說:「女人,這於我和妳有什麼關係?我的時刻尚未來到。」
యేసు ఆమెతో, “అయితే నాకేంటమ్మా? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు.
5 衪的母親給僕役說:「他無論吩咐你們,你們就作什麼。」
ఆయన తల్లి పనివారితో, “ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి” అంది.
6 在那裏放著六口石缸,是為猶太人取潔用的;每口可容納兩三桶水。
యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి.
7 耶穌向僕役說:「你們把缸灌滿水吧! 」他們就灌滿了,直到缸口。
యేసు, “ఆ బానలను నీళ్లతో నింపండి” అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు.
8 然後,耶穌給他說:「現在你們舀出來,送給司席。」他們便送去了。
అప్పుడు ఆయన, “ఇప్పుడు బానలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్ళారు.
9 司席一嘗已變成酒的水─並不知是從那裏來的,舀水的僕役卻知道─司席便叫了新郎來,
ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో,
10 向他說:「人人都先擺上好酒,當客人都喝夠了,才擺上次第的;你卻把好酒保留到現在。」
౧౦“అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు.
11 這是耶穌所行的第一個神跡,是在加利肋亞納匝肋行的;衪顯示了自己的光榮,衪的門徒們就信從了衪。
౧౧యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.
12 此後,衪和衪的母親、弟兄和門徒下到葛法翁,在那裏住了不多幾天。
౧౨ఇదయ్యాక ఆయన తన తల్లీ, సోదరులూ, శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్ళాడు. అక్కడ వారు కొన్ని రోజులు ఉన్నారు.
13 猶太人的逾越節近了,耶穌便上了耶路撒冷。
౧౩యూదుల పండగ పస్కా దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళాడు.
14 在殿院裏,衪發現了賣牛、羊、鴿子的,和坐在錢莊上兌換銀錢的人,
౧౪అక్కడ దేవాలయంలో ఎద్దులనూ, గొర్రెలనూ, పావురాలనూ అమ్ముతున్న వారిని చూశాడు. అక్కడే కూర్చుని డబ్బు మారకం చేసే వారిని కూడా చూశాడు.
15 就用繩索做了一條鞭子,把眾人連羊帶牛,從殿院都趕出去,傾倒了換錢者的銀錢,推翻了他們的桌子;
౧౫ఆయన పేనిన తాళ్ళను ఒక కొరడాగా చేసి దానితో వారందర్నీ దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. గొర్రెలనూ ఎద్దులనూ కూడా అక్కడి నుంచి తోలివేశాడు. డబ్బును మారకం చేసే వారి బల్లలను పడదోశాడు. వారి డబ్బును చెల్లాచెదరు చేశాడు.
16 給賣鴿的人說:「把這東西從這裏拿出去,不要使我父的殿宇成為商場。」
౧౬పావురాలు అమ్మేవారితో ఆయన, “వీటిని ఇక్కడ్నించి తీసివేయండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయడం మానండి” అన్నాడు.
17 衪的門徒們就想起了經上記載的:『我對你的殿宇所懷的熱忱,把我耗敬盡。』的話。
౧౭ఆయన శిష్యులు, “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది” అని రాసి ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నారు.
18 猶太人便追問衪說:「你給我們顯什麼神跡,證明你有權柄作這些事?」
౧౮అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, “నీవు ఈ పనులు చేస్తున్నావే. ఇవి చేయటానికి నీకు అధికారముందని చూపటానికి ఏ సూచన చూపుతావు?” అన్నారు.
19 耶穌回答他們說:「你們拆毀這座聖殿,三天之內,我要把它重建起來。」
౧౯దానికి యేసు, “ఈ దేవాలయాన్ని కూల్చండి. మూడు రోజుల్లో దీన్ని లేపుతాను” అన్నాడు.
20 猶太人就說:「這座聖殿建築了四十六年,你在三天之內就會重建起它來嗎?」
౨౦అప్పుడు యూదు అధికారులు, “ఈ దేవాలయాన్ని నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. దీన్ని మూడు రోజుల్లోనే లేపుతావా?” అన్నారు.
21 但耶穌所提的聖所,是指衪自己的身體。
౨౧అయితే ఆయన చెప్పింది తన శరీరం అనే దేవాలయం గురించి.
22 所以,當衪所死者中復活以後,衪的門徒就想起了衪曾說過這話,便相信了聖經和耶穌說過的話。
౨౨ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు.
23 當耶穌在耶路撒冷過逾越節時,有許多人看見衪所行的神跡,便信從了衪;
౨౩ఆయన పస్కా పండగ రోజుల్లో యెరూషలేములో ఉన్నప్పుడు చాలామంది ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన నామంలో విశ్వాసం ఉంచారు.
24 耶穌卻不信任他們,因為衪認識眾人;
౨౪అయితే యేసుకు అందరూ తెలుసు. కాబట్టి ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు.
25 衪並不需要誰告訴衪,人是怎麼的,因為衪認識人心裏有什麼。
౨౫ఆయనకు మనుషుల అంతరంగం బాగా తెలుసు. ఎవరూ మనుషుల గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు.

< 約翰福音 2 >