< 約伯記 34 >

1 厄里烏接著說:
అప్పుడు ఎలీహు మళ్ళీ ఇలా చెప్పసాగాడు.
2 你們有智慧的人,請聽我言;你們明白人,請側耳聽我。
జ్ఞానులారా, నా మాటలు వినండి. అనుభవశాలులారా, వినండి.
3 原來耳朵是為辨別言語,有如口腔是為辨嘗食物。
అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షిస్తుంది.
4 讓我們來檢討一下誰為正義,讓我們看看何者為善。
న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి. మేలైనదేదో మనంతట మనం విచారించి తెలుసుకుందాము రండి.
5 約伯說過:「我是無罪的,但我的理,卻為天主奪去。
“నేను నీతిమంతుణ్ణి, దేవుడు నాకు అన్యాయం చేసాడు.
6 我雖無罪無辜,卻成了說謊者;我雖未行不義,卻受了不可醫治的創傷。」
నేను న్యాయవంతుడినైనా అబద్ధికునిగా చూస్తున్నారు. నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానని గాయం కలిగింది” అని యోబు అంటున్నాడు.
7 那有一人像約伯,肆口漫罵如飲水﹖
యోబులాంటి మానవుడెవరు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారాన్ని పానం చేస్తున్నాడు.
8 他豈不是與作惡的人結夥,同壞人交結來往﹖
అతడు చెడుతనం చేసే వారికి మిత్రుడయ్యాడు. భక్తిహీనుల చెలికాడు అయ్యాడు.
9 他豈不是說過:「盡心悅樂天主,為人能有什麼好處﹖」
మనుషులు దేవునితో సహవాసం చేయడం వారికేమాత్రం ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకుంటున్నాడు.
10 為此,你們心地明白的人,請聽我說,天主決不行惡,全能者決無不義!
౧౦విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించండి దేవుడు అన్యాయం చేయడం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం.
11 他必照人的行為報答他,按他的品行對待他。
౧౧మనుషుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు అందరికీ ఎవరి మార్గాలను బట్టి వారికి ఫలమిస్తాడు.
12 天主絕對不能作惡,全能者絕對不能顛倒是非。
౧౨దేవుడు ఏ మాత్రం దుష్కార్యం చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు.
13 誰委派他掌管大地,誰任命他治理普世﹖
౧౩ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టాడా? ఎవడైనా సర్వప్రపంచ భారాన్ని ఆయనకు అప్పగించాడా?
14 他若將自己的神魂收回,將氣息復歸於自己,
౧౪ఆయన తన మనస్సు తన దగ్గరే ఉంచుకున్నట్టయితే, తన ఆత్మను, ఊపిరినీ తన దగ్గరికి తిరిగి తీసుకుంటే,
15 所有血肉的人必都消滅,世人都要歸於塵土。
౧౫శరీరులంతా ఒక్కపెట్టున నశిస్తారు. మనుషులు మళ్ళీ ధూళిగా మారిపోతారు.
16 若你聰明,請聽這事,側耳傾聽我的話。
౧౬కాబట్టి దీన్ని విని వివేచించు, నా మాటలు ఆలకించు.
17 憎恨正義的,豈能掌權﹖而你竟敢定那至公義者的罪﹖
౧౭న్యాయాన్ని ద్వేషించేవాడు లోకాన్ని ఏలుతాడా? న్యాయసంపన్నునిపై నేరం మోపుతావా?
18 他能稱君王為歹徒,能稱官吏為壞人。
౧౮నువ్వు పనికిమాలిన వాడివని రాజుతోనైనా, మీరు దుష్టులని ప్రధానులతోనైనా అనవచ్చా?
19 他對權貴不顧情面,亦不重富輕貧,因為都是他一手造成的。
౧౯రాజుల పట్ల పక్షపాతం చూపని వాడితో పేదలకన్నా ధనికులను ఎక్కువగా చూడని వాడితో అలా పలకవచ్చా? వారందరూ ఆయన నిర్మించినవారు కారా?
20 他們猝然在半夜死去,貴族能立即氣絕逝世;他剷除權貴者,無須人手。
౨౦వారు నిమిషంలో చనిపోతారు. అర్థరాత్రి వేళ ప్రజలు కల్లోలం పాలై నాశనమౌతారు. బలవంతులను తీసుకు పోవడం జరుగుతుంది, అయితే అది మానవ హస్తాల వలన కాదు.
21 因為他的眼監視人的動作,觀察他的行徑。
౨౧ఆయన దృష్టి మనుషుల మార్గాల మీద ఉంది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు.
22 沒有黑暗,也沒有陰影,可將作惡的人掩蔽。
౨౨చెడు కార్యాలు చేసే వారు దాక్కోడానికి చీకటైనా మరణాంధకారమైనా లేదు.
23 天主不必給人指定時間,為使人到他前去受審。
౨౩ఒక మనిషిని న్యాయవిమర్శలోకి తీసుకు రాక ముందు అతణ్ణి ఎక్కువ కాలం విచారణ చేయడం దేవుడికి అవసరం లేదు.
24 他粉碎權勢者,無須審察,即刻能派定別人代替他們。
౨౪విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలం చేస్తున్నాడు. వారి స్థానంలో ఇతరులను నియమిస్తున్నాడు.
25 他原知道他們的行為,一夜之間將他們推翻消滅。
౨౫వారి క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు. రాత్రివేళ ఇలాటి వారిని ఆయన కూలదోస్తాడు. వారు నాశనమై పోతారు.
26 在眾目昭彰之下,鞭打他們有如罪犯。
౨౬అందరూ చూస్తుండగానే దుష్టులను వారి దుర్మార్గాన్ని బట్టి నేరస్తులను శిక్షించినట్టు ఆయన శిక్షిస్తాడు.
27 因為他們遠離了他,不重視他一切的道,
౨౭ఎందుకంటే వారు ఆయనను అనుసరించడం మానుకున్నారు. ఆయన ఆజ్ఞల్లో దేన్నీ లక్ష్య పెట్టలేదు.
28 致使窮人的哀號上達於他,使他聽到了受苦者的哀求。
౨౮పేదల మొరను ఆయన దగ్గరికి వచ్చేలా చేశారు. దీనుల మొర ఆయనకు వినబడేలా చేశారు.
29 他若安息,誰敢騷擾﹖他若掩面,誰敢窺視﹖他對國對人都予以監視,
౨౯ఆయన మౌనంగా ఉండిపోతే తీర్పు తీర్చగలవాడెవడు? ఆయన తన ముఖాన్ని దాచుకుంటే ఆయనను చూడగలవాడెవడు? ఆయన జాతులనైనా వ్యక్తులనైనా ఒకే విధంగా పరిపాలిస్తాడు.
30 使凡欺壓人民的,不得為王。
౩౦భక్తిహీనులు రాజ్యపాలన చేయకుండా, వారు ప్రజలను ఇకపై చిక్కించుకోకుండా ఆయన చేస్తాడు.
31 如果惡人向天主說:「我受了欺騙,以後不再作惡。
౩౧ఒకడు “నేను దోషినే, కానీ ఇకపై పాపం చేయను.
32 我所看不透的,求你指教我;我若以前作了孽,不敢再做了。」
౩౨నాకు తెలియని దాన్ని నాకు నేర్పించు. నేను పాపం చేశాను. ఇకపై చేయను” అని దేవునితో చెప్పాడనుకో,
33 他施行報應,豈應隨你的心意﹖或者你能拒絕不受嗎﹖決定的是你,而不是我! 你若知道,儘管說罷!
౩౩దేవుడు చేస్తున్నది నీకు నచ్చడం లేదు గనక అలాటి మనిషిని దేవుడు శిక్షిస్తాడు అనుకుంటున్నావా? నేను కాదు, నువ్వే నిశ్చయించుకోవాలి. కాబట్టి నీకు తెలిసినది చెప్పు.
34 但是心地聰明,具有智慧,且聽我說話的人,必要對我說:「
౩౪వివేచన గలవారు, జ్ఞానంతో నా మాట వినేవారు నాతో ఇలా అంటారు.
35 約伯所講的話毫無知識,他的話全不明智。」
౩౫యోబు తెలివితక్కువ మాటలు పలుకుతున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి.
36 為此,約伯還要受徹底的究察,因為他的答覆好似出自惡人之口,
౩౬యోబు దుష్టులవలె మాట్లాడుతున్నాడు గనక అతనిపై సునిశితమైన విచారణ జరిగితే ఎంత బాగుంటుంది!
37 因為他在罪上又加反叛,當著我們磨拳擦掌,講出許多相反天主的話。
౩౭అతడు తన పాపానికి తోడుగా ద్రోహం సమకూర్చుకుంటున్నాడు. మన ఎదుట ఎగతాళిగా చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు కుప్పగా పోస్తున్నాడు.

< 約伯記 34 >