< 約伯記 27 >

1 約伯繼續他的言論說:
యోబు మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు.
2 我指著那剝奪我權利的天主起誓,指著使我心靈苦痛的全能者起誓:
నా న్యాయాన్ని తీసివేసిన దేవుని జీవం తోడు. నా ప్రాణాన్ని వ్యాకుల పరచిన సర్వశక్తుని తోడు.
3 幾時我還有氣息,我鼻中尚有天主賦予的生氣,
నా ప్రాణం నాలో ఉన్నంత కాలం, దేవుని ఊపిరి నా నాసికా రంధ్రాల్లో ఉన్నంత వరకు,
4 我的口唇決不說謊言,我的舌頭決不講虛話。
నిశ్చయంగా నా పెదవులు అబద్ధం పలకవు. నా నాలుక మోసం ఉచ్ఛరించదు.
5 若叫我說你們有理,那決辨不到;到我斷氣,我決不放棄我的純正。
మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకోను. మరణమయ్యే దాకా నేనెంత మాత్రం యథార్థతను వదిలి పెట్టను.
6 我堅持我的正義,決不罷休;對於已往的生活,我問心無愧。
నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు.
7 惟願恨我的人,遭惡人的命運;起來攻擊我的人,遭罪犯的處分。
నాకు శత్రువులు దుష్టులుగా కనబడతారు గాక. నన్నెదిరించేవారు నీతి లేని వారుగా కనబడతారు గాక.
8 惡人呼籲時,有何期待﹖當他向天主舉起靈魂時,有何希望﹖
దేవుడు అతణ్ణి కొట్టివేసేటప్పుడు, వాడి ప్రాణం తీసేసేటప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది?
9 災難臨到他身上時,天主豈能聽他的呼求﹖
వాడికి బాధ కలిగేటప్పుడు దేవుడు వాడి మొర్ర వింటాడా?
10 他豈是以全能者為喜樂,時時祈求天主﹖
౧౦వాడు సర్వశక్తుడిలో ఆనందిస్తాడా? వాడు అన్ని సమయాల్లో దేవునికి ప్రార్థన చేస్తాడా?
11 我要將天主的作為教導你們;對全能者的意旨,我決不隱瞞。
౧౧దేవుని హస్తాన్ని గూర్చి నేను మీకు ఉపదేశిస్తాను. సర్వశక్తుడు చేసే క్రియలను నేను దాచిపెట్టను.
12 其實,這一切你們都熟悉,但為何還這樣空談﹖
౧౨మీలో ప్రతివాడూ దాన్ని చూశాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని తలపోస్తూ ఉంటారు?
13 納阿瑪人左法爾就說:這是天主給惡人定的命運,是強暴者由全能者所承受的產業:
౧౩దేవుని వలన భక్తిహీనులకు దక్కే భాగం ఇదే. బాధించేవారు సర్వశక్తుని వలన పొందే ఆస్తి ఇదే.
14 他的子女雖眾多,都必死於刀下;他的後代子孫,不得飽食。
౧౪వారి పిల్లలు సంఖ్యలో విస్తరిస్తే అది కత్తివాత కూలడానికే గదా. వారి సంతానానికి చాలినంత ఆహారం దొరకదు.
15 剩餘的人,為瘟疫所葬送;他們的遺孀,不舉喪哀弔。
౧౫వారికి మిగిలిన వారు తెగులు మూలంగా చచ్చి సమాధి అవుతారు. వారి వితంతువులు వారి విషయం రోదనం చెయ్యరు.
16 他們雖積蓄銀子,多如塵沙;備製衣服,多如土堆;
౧౬ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినా బంక మట్టి అంత విస్తారంగా వస్త్రాలు సిద్ధం చేసుకున్నా,
17 他們固然預備,但義人來穿,無辜者要分取他們的金銀。
౧౭వారు అలా సిద్ధపరచుకుంటారే గానీ నీతిమంతులు వాటిని కట్టుకుంటారు. నిరపరాధులు ఆ వెండిని పంచుకుంటారు.
18 他們建造的房屋有如蛛網,又如守望者搭的茅舍。
౧౮వారు పురుగుల గూళ్లవంటి ఇళ్ళు కట్టుకుంటారు కావలివాడు కట్టుకునే గుడిసె లాంటి ఇళ్ళు వారు కట్టుకుంటారు.
19 他們睡眠時,雖稱富足,但睜開眼時,已一無所有。
౧౯అతడు ధనికుడుగా పడుకుంటాడు గానీ అది కొనసాగదు. అతడు కళ్ళు తెరవగానే మొత్తం పోతుంది.
20 白天有恐怖侵襲,黑夜有颶風將他們颳去。
౨౦భయాలు జలప్రవాహంలాగా వారిని తరిమి పట్టుకుంటాయి. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకుపోతుంది.
21 東風將他們吹去,把他們捲走,離其居地。
౨౧తూర్పు గాలి అతణ్ణి ఎగరగొడుతుంది. వాడు ఇక ఉండడు. అది అతని స్థలంలో నుండి అతణ్ణి ఊడ్చివేస్తుంది.
22 他們成了眾人毫不憐憫的箭靶,他們沒法逃避恐嚇的手。
౨౨ఆగకుండా తూర్పు గాలి అతని మీద విసిరి కొడుతుంది. వాడు దాని చేతిలోనుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తాడు.
23 人人都對之鼓掌稱慶,由各方向之嘲笑辱罵。
౨౩అది వాణ్ణి చూసి హేళనగా చప్పట్లు కొడుతుంది. వాడున్న చోటు నుండి వాణ్ణి ఈసడింపుగా తోలివేస్తుంది.

< 約伯記 27 >