< 以賽亞書 15 >

1 有關摩阿布的神諭:實在,摩阿布的阿爾經過一夜的蹂躪,就滅亡了!實在,摩阿布的克爾經過一夜的摧殘,就滅亡了!
మోయాబు గురించి ప్రకటన. ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది. ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది.
2 狄朋女兒走上高丘哭泣,摩阿布為乃波和默德巴悲號;眾人的頭都剃光了,眾人的鬍鬚都剪去了;
ఏడవడానికి మోయాబీయులు గుడికీ, మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, గడ్డాలు క్షవరం చేయించుకున్నారు.
3 有的在街道上穿著苦衣,有的在屋頂上痛哭;在廣場上的人,人人哀號,流淚痛哭。
తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు. వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు.
4 赫市朋和厄肋阿肋號啕,雅哈茲都可聽到他們的哭聲;因此摩阿布的兩腰為之顫動,她的心靈為之恐怖。
హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి. యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది. మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి.
5 我的心為摩阿布發出哀號,她的難民已逃至左哈爾。他們哭著攀上了路希特的山坡,在曷洛納因的道上揚起了失望的哀聲。
మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది. దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు. లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు. నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు.
6 尼默陵的水地成了荒野,青草枯焦了,嫩芽萎縮了,再也見不到青綠。
ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి. గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు.
7 為此,他們將所有的積蓄和財物,都帶過了「柳樹河。」
వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు.
8 因為哀叫聲傳遍了摩阿布四境,她的哭聲已傳到厄革拉因,她的哭聲已達到貝爾厄林。
రోదన మోయాబు సరిహద్దుల్లో వినిపించింది. అంగలార్పు ఎగ్లయీము వరకూ, బెయేరేలీము వరకూ వినిపించింది.
9 狄孟的水已滿了鮮血,我還要加禍於狄孟:為摩阿布的難民和當地的遺民將有一隻獅子。
ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి. కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను. మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, ఆ దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది.

< 以賽亞書 15 >