< 何西阿書 6 >
1 「來,我們回到上主那裏去,因為衪撕碎了我們,也必要治愈;衪打傷了我們,也必要包紮。
౧మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం రండి. ఆయన మనలను చీల్చివేశాడు. ఆయనే మనలను స్వస్థపరుస్తాడు. ఆయన మనలను గాయపరిచాడు. ఆయనే మనకు కట్లు కడతాడు.
2 兩天後衪必使田復生,第三天衪必使我們興起,生活在衪的慈顏下。
౨రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. మనం ఆయన సముఖంలో బ్రతికేలా, మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు.
3 讓我們認識上主,讓我們努力認識上主! 衪定要像曙光一樣出現,衪要來到我們中間,有如秋雨,有如滋潤田地的春雨。」
౩యెహోవాను తెలుసుకుందాం రండి. యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి. పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం. వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు.
4 厄弗辣因,我可對你們作什麼﹖因為你們的仁愛有如旱晨的浮雲,有如易於消散的朝露。
౪ఎఫ్రాయిమూ, నేను నిన్నేం చేయాలి? యూదా, నిన్నేమి చెయ్యాలి? ఉదయం పొగమంచు లాగా త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది.
5 因此,我藉先知們砍伐了他們,以我口中的言語殺死戳了他們;我的的裁判出現有如光明:
౫కాబట్టి నేను ప్రవక్తల మూలంగా వారిని ముక్కలు చేశాను. నా నోటిమాటలతో నేను వారిని హతమార్చాను. నీ శాసనాలు వెలుగులాగా ప్రకాశిస్తున్నాయి.
6 因為我喜歡仁慈勝過祭獻,喜歡人認識天主勝過全燔祭。
౬నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను. దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను.
౭ఆదాములాగా వారు విశ్వాస ఘాతకులై నా నిబంధనను ఉల్లంఘించారు.
౮గిలాదు పాపాత్ముల పట్టణమై పోయింది. అందులో నెత్తురు అడుగుజాడలు కనబడుతున్నాయి.
9 一隊司祭就如埋伏的強盜,在往舍根的路上行兇;的確,他們行了可恥的事
౯బందిపోటు దొంగలు పొంచి ఉండేలా యాజకులు పొంచి ఉండి షెకెము దారిలో హత్య చేస్తారు. వారు ఘోరనేరాలు చేశారు.
10 在貝特耳我見了可惡的事:在那裏厄弗辣因行了淫,以色列玷污了自己
౧౦ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి నేను చూశాను. ఎఫ్రాయిమీయుల వ్యభిచార క్రియలు అక్కడున్నాయి. ఇశ్రాయేలు వారి చెడుతనం అక్కడ ఉంది.
11 當我轉變我百姓的命運時,猶大啊! 為你也注定了一個收割期。
౧౧నా ప్రజల సంపదలు మళ్ళీ వారికి ఇచ్చినప్పుడు, యూదా, నీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది.