< 希伯來書 12 >

1 以,我們既有如此眾多如雲的證人,圍繞著我們,就該下卸下所有的累贅和糾纏人的罪過,以堅忍的心,跑那擺在我們眼前的賽程,
మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం.
2 雙目注視著信德的創始者耶穌:衪為那擺在衪面前的歡樂,輕淩辱,忍受了十字架,而今坐在天主寶座的右邊。
మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.
3 你們常要想,衪所以忍受罪人對衪這樣的叛逆,是怕你們灰心喪志。
మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి.
4 你們與罪惡爭鬥,還沒有抵抗到流血的地步。
మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు.
5 你們竟全忘了天主勸你們,好像勸子女的話說:『我兒,不要輕視上主的懲戒,也不要厭惡衪的譴責,
కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు. “నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.”
6 因為上主懲戒衪所愛的,鞭打衪所接管的每個兒子。』
ప్రభువు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు.
7 為接受懲戒,應該堅忍,因為天主對待你們,就如對待子女;那有兒子,做父親的不懲戒他呢﹖
హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు.
8 如果你們缺少眾人所共受的懲戒,你們就是私生子,而不是兒子。
కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానంలాంటి వారన్న మాట.
9 再者,我們肉身的父親懲戒我們時,我們尚且表示敬畏;何況靈性的父親,我們不是更該服從,以得生活嗎﹖
ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా?
10 其實肉身的父親只是在短暫的時日內,照他們的心意來施行懲戒,但是天主卻是為了我們的好處,為叫我們分沾衪的聖善。
౧౦మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు.
11 固然各種懲戒,在當時似乎不是樂事,而是苦事;可是以後卻給那些受訓練的人,結出義德的和平果實。
౧౧అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది.
12 為此,你們應該伸直痿弱的手和麻木的膝;
౧౨కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి.
13 你們的腳應履行正直的路,叫瘸子不要偏離正道,反叫他能得痊愈。
౧౩మీ కుంటికాలు బెణకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి
14 你們應設法與眾人和平相處,盡力追求聖德,若無聖德,誰也見不到主;
౧౪అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు.
15 又應該慬慎,免得有人疏忽天主的恩寵免得苦根子長出來,而累及你們,使許多人因此蒙受玷污。
౧౫దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి.
16 誰也不要成為淫亂和褻聖者,如同厄撒烏一樣,他為了一餐飯,竟出賣了自己長氶的身份。
౧౬లైంగిక అవినీతిని సాగించేవారుగానీ ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేని వాడు కానీ మీలో లేకుండా జాగ్రత్త పడండి.
17 你們知道,後來他縱然願意承受祝福,也遭到了拒絕;雖流淚苦求,但沒有得到翻悔的餘地。
౧౭ఏశావు ఆ తరవాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్ళతో శ్రద్ధగా వెదికినా పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు.
18 你們原來並不是走近了那可觸摸的山,那裏有烈火、濃雲、黑暗、暴風、
౧౮చేతితో తాకగలిగే పర్వతం దగ్గరకో, మండుతూ ఉండే కొండ దగ్గరకో, అంధకారం దగ్గరకో, విషాదం దగ్గరకో లేదా ఒక తుఫాను దగ్గరకో మీరు రాలేదు.
19 號垌的響聲以及說話的聲音,當時那些聽見的人,都懇求天主不要再給他們說話,
౧౯బాకా శబ్దానికి మీరు రాలేదు. విన్నవారు ఇక తమకు ఏ మాటా చెప్పవద్దని ఏ స్వరం గురించి బ్రతిమాలుకున్నారో అది పలికిన మాటలకు మీరు రాలేదు.
20 因為他們承擔不起所吩咐的事:『即使是一隻走獸觸摸了這山,也應用石頭砸死;』
౨౦ఎందుకంటే వారు విన్న ఆజ్ఞకు వారు తట్టుకోలేకపోయారు: “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా సరే, దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి” అన్నదే ఆ ఆజ్ఞ.
21 並且所顯現的是這麼可怕,連梅瑟也說:『我很是恐慌戰憟。』
౨౧భీకరమైన ఆ దృశ్యాన్ని చూసిన మోషే, “నేను ఎంతో భయపడి వణుకుతున్నాను” అన్నాడు. మీరు అలాంటి వాటికి రాలేదు.
22 然而你們卻接近了熙雍山的永生天主的城,天上的耶路撒冷,接近了千萬天使的盛會,
౨౨ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు.
23 和那些已被登錄在天上的首生者的集會,接近了審判眾人的天主,接近了已獲得成全的義人的靈魂,
౨౩పరలోకంలో నమోదు అయిన జ్యేష్టుల సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు.
24 接近了新約的中保耶穌,以及衪所灑的血:這血比亞伯爾的血說說的更好。
౨౪ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకూ, హేబెలు రక్తం కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకూ మీరు వచ్చారు.
25 你們要慬慎,不要拒絕說話的那位,如果從前那些拒絕聽衪在地上宣佈啟示的人,不能逃避懲罰,何況我們這些背棄由天上說話的那位呢﹖
౨౫మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించేవాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం?
26 從前衪的聲音搖動了下地,如今衪卻應許說:『還有一次,我不但動搖下地,而且也動搖下天。』
౨౬ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కానీ ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు. “మరోసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.”
27 這『還有一次』一句,是指明那些被動搖的事物,因為受造的,必起變化,好叫那些不可動搖的事物得以常存。
౨౭“మరోసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండడం కోసం కదిలేవాటిని అంటే దేవుడు సృష్టించిన వాటిని తీసివేయడం జరుగుతుందని సూచిస్తుంది.
28 為此,我們既然蒙受一個不可動搖的國度,就應該感恩,藉此懷著虔忱和敬畏之情,事奉天主,叫衪喜悅,
౨౮కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో, విస్మయంతో ఆయనను ఆరాధించుదాం.
29 因為我們的天主實是吞滅的烈火。
౨౯ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.

< 希伯來書 12 >