< 加拉太書 6 >
1 弟兄們,如果見一個人陷於某種過犯,你們既是屬神的人,就該以柔和的心神矯正他;但你們自己要小心,免得他陷入誘惑。
౧సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి.
2 你們應彼此協助背負重擔,這樣,你們就滿全了基督的法律。
౨ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.
3 人本來不算什麼,但若自以為算什麼,就是欺騙自己。
౩ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు.
4 各只該考驗自己的行為,這樣,對自己也許有可誇耀之處,但不是對別人誇耀,
౪ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది.
౫ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా?
౬వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి.
7 你們切不要錯了,天主是嘲笑不得的:人種什麼,就收什麼。
౭మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.
8 那隨從肉情撒種的,必由肉情收獲敗壞; 然而那隨從聖神撒種的,必由聖神收獲永生。 (aiōnios )
౮ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు. (aiōnios )
9 為此,我們行善不要厭倦;如果不鬆懈,到了適當的時節,必可收穫。
౯మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము.
10 所以,我們一有機會,就應向眾人行善,尤其應向有同樣信德的家人。
౧౦కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.
౧౧నా సొంత దస్తూరీతో పెద్ద అక్షరాలతో ఎలా రాస్తున్నానో చూడండి.
12 那些逼迫你們受割損的人,是想以外表的禮節來圖人稱讚,免得因基督的十字架遭受迫害;
౧౨శరీర విషయంలో చక్కగా కనిపించాలని కోరే వారు, తాము క్రీస్తు సిలువ విషయంలో హింస పొందకుండా ఉండడానికి మాత్రమే సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు.
13 其實,他們雖然受了割損,卻也不遵守法律;他們只是願意你們受割損,為能因在你們的肉身上所行的禮儀而誇耀。
౧౩అయితే వారు సున్నతి పొందిన వారైనా ధర్మశాస్త్రం ఆచరించరు. వారు మీ శరీర విషయంలో గొప్పలు చెప్పుకోవడం కోసం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు.
14 至於我,我只以我們的主耶穌基督的十字架來誇耀,因為藉著基督,世界於我已被釘十字架上了;我於世界也被釘在十字架上了。
౧౪అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నాకు లోకం సిలువ మరణం చెందాను.
15 其實,割損或不割損都算不得什麼,要緊的是新受造的人。
౧౫కొత్త సృష్టి పొందడమే గాని సున్నతి పొందడంలో, పొందకపోవడంలో ఏమీ లేదు.
16 凡以此為規律而行的,願平安與憐憫降在他們身上,即降在天主的新以色列身上!
౧౬ఈ పద్ధతి ప్రకారం నడుచుకునే వారందరికీ అంటే, దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కృప కలుగు గాక.
17 從今以後,我切切願沒有人再煩擾我,因為在我身上,我帶有耶穌的格印。
౧౭నేను యేసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇకనుంచి ఎవరూ నన్ను కష్టపెట్టవద్దు.
18 弟兄們! 願我們的主耶穌基督的恩寵,常與你們的心靈同在! 阿們。
౧౮సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండుగాక. ఆమేన్.