< 以斯帖記 8 >

1 薛西斯王當王就將猶太人的敵人哈曼的家業,賜給了艾斯德爾王后;艾斯德爾同時也說明了摩爾德開與她自己的關係,摩爾德開就來覲見君王。
ఆ రోజు అహష్వేరోషు రాజు యూదుల శత్రువు హామాను ఇంటిని ఎస్తేరు రాణికి ఇచ్చేశాడు. మొర్దెకైతో తన బంధుత్వం గురించి ఎస్తేరు రాజుకు తెలియజేసింది.
2 君王於是取下由哈曼那裏拿回來的指璽,給了摩爾德開,艾斯德爾以後叫摩爾德開管理哈曼的家業。
అతడు రాజు సన్నిధికి వచ్చినప్పుడు రాజు హామాను చేతిలోనుండి తీసుకున్న తన ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిపై అధికారిగా ఉంచింది.
3 艾斯德爾又去向君王求情,俯伏在他足下,含淚哀求他取消阿加格人哈曼所加的禍害,和他為害猶太人所設的陰謀。
ఎస్తేరు రాజు పాదాలపై పడి విన్నపం చేస్తూ “అగగు వంశీకుడు హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన కార్యాన్ని రద్దు చేయండి” అని కన్నీటితో అతణ్ణి వేడుకుంది.
4 王向艾斯德爾伸出金杖,艾斯德爾就起來,站在君王前,
రాజు తన బంగారు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు.
5 說「如果大王喜歡,如果我得陛下寵幸,如果大王認為合理且喜愛我,就請寫一道諭令,把大王為消滅全國各省的猶太人所頒下的文書,即阿加格人哈默大達的兒子哈曼的陰謀廢除。
ఎస్తేరు రాజు ముందు నిలబడి “రాజైన మీకు అంగీకారం అయితే, మీ అనుగ్రహం నాపై ఉంటే, ఈ సంగతి మీకు సమంజసంగా అనిపిస్తే, నేనంటే మీకు ఇష్టమైతే, హమ్మెదాతా కొడుకు, అగగు వంశీకుడు అయిన హామాను రాయించిన శాసనాలు అమలు కాకుండా వాటి రద్దుకు ఆజ్ఞ ఇవ్వండి.
6 事實上,我怎能忍見我的民族遭受迫害﹖我怎能忍見我的親屬消滅﹖」
నా స్వజనం మీదికి రాబోతున్న కీడును, నా వంశ నాశనాన్ని చూసి నేనెలా సహించ గలను” అని మనవి చేసింది.
7 薛西斯王對艾斯德爾后和猶太人摩爾德開說:「我已將哈曼的家業賜給了艾斯德爾,而他本人已被懸在刑架上,因為他竟要對猶太人下毒手。
అహష్వేరోషు రాజు రాణి అయిన ఎస్తేరుకు, మొర్దెకైకి ఇలా చెప్పాడు. “హామాను ఇంటిని ఎస్తేరుకు ఇచ్చాను. అతడు యూదులను హతమార్చడానికి ప్రయత్నించినందు వల్ల అతడు ఉరికొయ్య మీద వేలాడి చనిపోయాడు.
8 如今就照你們的意思,以君王的名義,為保護猶太人寫一道文書,蓋上君王的玉印。凡以君王名義所寫,且蓋有君王玉印的文書,決不得廢除。」
అయితే రాజు పేరున రాసి రాజ ముద్రిక వేసిన శాసనాన్ని మానవ మాత్రుడెవరూ మార్చలేడు. కాబట్టి మీకిష్టమైనట్టు మీరు రాజునైన నా పేర యూదులకు అనుకూలంగా వేరొక శాసనం రాయించి రాజ ముద్రికతో ముద్రించండి.”
9 就在那時候,即在三月──「息汪」月二十三日,召集了眾御史,要依照摩爾德開為保護猶太人提示的一切,用各省的文字,各民族的語言,也給猶太人以他們的文字語言,寫了一道文書,公告由印度至雇士一百二十七省的猶太人、御史大臣、各省省長及首長。
సీవాను అనే మూడో నెలలో ఇరవై మూడో రోజున రాజుగారి లేఖికులను పిలిచారు. మొర్దెకై ఆజ్ఞాపించినట్టు యూదులకు, ఇండియా నుండి ఇతియోపియా వరకూ విస్తరించిన 127 సంస్థానాల్లోని అధిపతులకు, అధికారులకు, వివిధ సంస్థానాలకు వాటి లిపిలో, వాటి భాషల్లో శాసనాలు రాశారు.
10 摩爾德開遂以薛西斯王的名義,寫了這道文書,蓋上君王的玉印,然後派遣驛使,騎著御廄裏的駿馬,傳遞文書。
౧౦మొర్దెకై అహష్వేరోషు పేర శాసనాలు రాయించి రాజముద్రికతో ముద్రించాడు. గుర్రాలపై, అంటే రాచకార్యాలకు వినియోగించే మేలు జాతి అశ్వాలపై అంచెలుగా ప్రయాణించే వార్తాహరులతో ఆ శాసనాలను పంపించాడు.
11 文書上載著:君王恩准在各城市的猶太人,有團結自衛的權利,也准許他們破壞、殺害、消滅那些侵害他們的各族和各省的軍民,也可殺他們的婦孺,搶奪他們的財產;
౧౧“రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో ఒక్క రోజునే అంటే అదారు అనే పన్నెండో నెల పదమూడో తేదీన అన్ని పట్టణాల్లో నివసించే యూదులు సమకూడాలి. తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు అన్ని చోట్లా తమకు విరోధులైన వారి సైనికులందరిని, బాలలను, స్త్రీలను కూడా, హతం చేసి, సర్వనాశనం చెయ్యాలి.
12 且應在十二月「阿達爾」十三日那一天,在薛西斯帝國各省內開始生效。
౧౨వారి సొత్తు అంతటినీ కొల్లగొట్టాలి, అని రాజు యూదులకు ఆజ్ఞాపించాడు” అని దానిలో రాశారు.
13 這道文書應視為法律,公佈在各省內,通告各民族一律遵守,好使猶太人準備在這一天,可向自己的敵人復仇。
౧౩ఈ శాసనాల ప్రతులు రాయించి అన్ని సంస్థానాల ప్రజానీకానికి పంపించాలని, యూదులు తమ శత్రువులపై పగ తీర్చుకొనేందుకు ఒకానొక రోజున సిద్ధంగా ఉండాలనీ ఆజ్ఞ జారీ అయింది.
14 驛使迫於君令,騎著御馬,火速出發。這諭文同時也在穌撒禁城公佈。
౧౪రాచ కార్యాల కోసం వినియోగించే మేలుజాతి అశ్వాలపై అంచె వార్తాహరులు రాజాజ్ఞ పొంది అతివేగంగా బయలుదేరారు. ఆ తాకీదును షూషను కోటలో కూడా ఇచ్చారు.
15 摩爾德開於是拜別君王出來,身穿紫白相間的御袍,戴著大金冠,披著純白和朱紅色的氅衣。此時穌撒城歡欣雀躍。
౧౫అప్పుడు మొర్దెకై నేరేడు, తెలుపు వర్ణాలు గల రాజవస్త్రం, పెద్ద స్వర్ణ కిరీటం, శ్రేష్ఠమైన నారతో చేసిన ఊదా రంగు బట్టలు ధరించి రాజు సముఖం నుండి బయలుదేరాడు. ఈ కారణంగా షూషను నగరంలో సంబరం కలిగింది.
16 猶太人終於得到了光明、喜樂、幸福和榮耀。
౧౬యూదులకు క్షేమం, సంతోషం, ఘనత కలిగాయి.
17 在各省各城中,凡是君令、上諭所到之處,猶太人無不歡欣雀躍,休假宴飲;各地的異民有許多人因為害怕猶太人,而入了猶太籍。
౧౭రాజు చేసిన తీర్మానం, అతని చట్టం అందిన ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణంలో యూదులకు ఆనందం, సంతోషం కలిగాయి. వారంతా పండగ చేసుకున్నారు. అందరికీ యూదులంటే భయం వేసింది. కాబట్టి చాలామంది యూదులయ్యారు.

< 以斯帖記 8 >