< 撒母耳記下 16 >

1 達味剛走過山頂不遠,看,默黎巴耳的僕人漆巴正牽著一對備好鞍子的驢,馱著兩百個餅,一百串葡萄乾,一百鮮果和一皮囊酒,前來迎接君王。
దావీదు కొండ అంచుకు అవతల కొంచెం దూరం వెళ్లినప్పుడు మెఫీబోషెతు సేవకుడు సీబా కళ్ళకు గంతలు కట్టిబడి ఉన్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. గాడిదలపై 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, వంద అంజూర ఫలాలున్న కొమ్మలు, ఒక ద్రాక్షారసపు తిత్తి వేయబడి ఉన్నాయి.
2 君王對漆巴說:「你帶這些東西來作什麼﹖」漆巴說:「驢是為君王的家眷騎的,餅和水果是為僮僕吃的,酒是為在曠野裏疲倦了的人喝的」。
రాజు “ఇవి ఎందుకు తెచ్చావు?” అని సీబాను అడిగాడు. అప్పుడు సీబా “రాజు పరివారం ఎక్కడానికి గాడిదలు, పనివారు తినడానికి రొట్టెలు, అంజూర ఫలాల కొమ్మలు, ఎడారిలో అలసిపోయిన వారు తాగడానికి ద్రాక్షారసం తెచ్చాను” అని చెప్పాడు.
3 君王問說:「你主人的兒子在哪裏﹖」漆巴回答君王說:「他仍留在耶路撒冷,因為他說:今日以色列家會將我父親的王位歸還給我了! 」
అప్పుడు రాజు “నీ యజమాని కొడుకు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగాడు. సీబా “అయ్యా, ఈరోజు ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యాన్ని తనకు తిరిగి ఇప్పిస్తారనుకుని అతడు యెరూషలేములో ఉండిపోయాడు” అని చెప్పాడు.
4 君王對漆巴說:「看,凡屬默黎巴耳的,都歸你所有! 」漆巴答說:「我屈膝叩拜我主一王! 願我在你眼中獲得寵幸」。
అప్పుడు రాజు “మెఫీబోషెతుకు కలిగినదంతా నీకే దక్కుతుంది” అని సీబాతో చెప్పినప్పుడు సీబా “నా ఏలికవైన రాజా, నాపై నీ కనికరం నిలిచి ఉంటుంది గాక. నీకు ఇవే నా నమస్కారాలు” అన్నాడు.
5 達味王來到巴胡陵時看,出來一個撒烏耳家族的人,是革辣的兒子,名叫史米的。他罵著走來,
రాజైన దావీదు బహూరీము దగ్గర కు వచ్చినప్పుడు సౌలు కుటుంబానికి చెందిన గెరా కుమారుడు షిమీ అనేవాడు అక్కడికి వచ్చాడు.
6 投石襲擊達味和達味的眾臣僕,雖然百姓和勇士都圍在王的左右,他毫不畏懼。
అతడు దావీదు పక్కనే నడుస్తూ “నరహంతకుడా, దుర్మార్గుడా ఛీ పో, ఛీ పో. రాజ్యాధికారం కోసం నువ్వు తరిమివేసిన సౌలు కుటుంబంవారి ఉసురు యెహోవా నీపైకి రప్పించాడు.
7 史米這樣罵君王說:「滾吧! 滾吧! 你這個殺人王! 你這個敗類!
నీ కుమారుడు అబ్షాలోము చేతికి యెహోవా రాజ్యాన్ని అప్పగించాడు. నువ్వు హంతకుడివి కాబట్టే ఈ మోసంలో చిక్కుకున్నావు” అని దుర్భాషలాడుతూ వచ్చాడు.
8 上主將撒烏耳一家的血都歸在你身上,你奪了他的王位,現在,上主將王權交在你兒子阿貝沙隆手裏,使你陷入絕境,足見你是個殺人王」。
రాజైన దావీదు ఇరుపక్కలా ప్రజలు, బలాఢ్యులైన వారంతా ఉన్నప్పటికీ అతడు దావీదు మీదా, అతని సేవకుల మీదా రాళ్లు రువ్వాడు.
9 責魯雅的兒子阿彼瑟對君王說:「為什麼讓這死狗辱罵我主大王﹖讓我去砍下他的頭來! 」
అప్పుడు సెరూయా కుమారుడు అబీషై “ఈ చచ్చిన కుక్క నా యజమానివి, రాజువు అయిన నిన్ను శపిస్తాడా? నాకు అనుమతి ఇవ్వు, నేను వాడి తల నరుకుతాను” అన్నాడు.
10 君王說:「責魯雅的兒子,我和我和你們有什麼關係﹖讓他罵吧! 如果上主吩咐他說:你咒罵達味! 誰還敢說:你為什麼這樣做﹖」
౧౦అందుకు రాజు “సెరూయా కొడుకుల్లారా, మీకు నామీద ఎందుకింత అభిమానం? దావీదును శపించమని యెహోవా అతనికి చెప్పి ఉన్నట్టయితే అతణ్ణి శపించయ్యండి. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగేవాళ్ళెవరు?” అని చెప్పాడు.
11 達味對阿彼瑟和他的臣僕說:「唉! 我親生的兒子,尚且謀害我的生命,這個本雅明人更將如何﹖讓他罵吧! 因為上主吩咐了他。
౧౧తరువాత అబీషైతో, తన సేవకులందరితో, ఇలా చెప్పాడు. “నా కడుపున పుట్టిన నా కొడుకే నన్ను చంపాలని చూస్తున్నప్పుడు ఈ బెన్యామీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? వాడి సంగతి వదిలిపెట్టండి. యెహోవా వాడికి సెలవిచ్చాడు, వాడిని తిట్టనివ్వండి.
12 也許上主會憐恤我的困苦,會將他今日的咒罵,變成我的幸福」。
౧౨యెహోవా నా బాధలను పట్టించుకుంటాడేమో, వాడు పెట్టిన శాపాలకు బదులు నాకు మేలు చేస్తాడేమో.”
13 達味與跟隨的人沿路前行,史米也沿著山路與他平排進行,邊走邊罵,向他拋石撒土。
౧౩తరువాత దావీదు, అతని మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. వారు వెళ్తుండగా షిమీ దావీదుకు ఎదురుగా కొండ పక్కనే నడుస్తూ అతని పైకి రాళ్లు రువ్వుతూ, దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు.
14 君王與跟隨他的眾人,來到約旦河岸,非常疲倦,就在那裏暫且休息。
౧౪రాజు, అతనితో ఉన్నవారంతా బాగా అలసిపోయి ఉండడంవల్ల ఒక చోటికి వచ్చి అలసట తీర్చుకున్నారు.
15 阿貝沙隆與跟隨他的眾以色列人進了耶路撒冷,阿希托費耳也同他在一起,
౧౫అబ్షాలోము, అహీతోపెలు, ఇశ్రాయేలువారంతా యెరూషలేము చేరుకున్నారు.
16 當達味的朋友阿爾基人胡瑟來見阿貝沙隆時,便對阿貝沙隆說:「大王萬歲! 「大王萬歲! 」
౧౬దావీదుతో స్నేహంగా ఉన్న అర్కీయుడు హూషై అనేవాడు అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. అబ్షాలోమును చూసి “రాజు సదాకాలం జీవిస్తాడు గాక, రాజు సదాకాలం జీవిస్తాడు గాక” అని చెప్పాడు.
17 阿貝沙隆對胡瑟說:「這是你對你朋友的恩情嗎﹖為什麼沒有去跟隨你的朋友﹖」
౧౭అప్పుడు అబ్షాలోము “నీ స్నేహితునికి నువ్వు చేసే ఉపకారమిదేనా? నీ స్నేహితునితో కలసి ఎందుకు వెళ్ళలేదు?” అని అడిగాడు.
18 胡瑟回答阿貝沙隆說:「不,因為凡上主和這個民族以及全以色列人所揀選的,我就跟隨他,與他住在一起。
౧౮హూషై “యెహోవా, ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులంతా ఎవరు రాజుగా ఉండాలని కోరుకుంటారో నేను అతని పక్షం వహిస్తాను. అతని దగ్గరే ఉంటాను.
19 再者,我要事奉的是誰呢﹖先前我怎樣服事了你父親,也願怎樣服事你」。
౧౯నేనెవరికి సేవ చేయాలి? నీ తండ్రి కుమారుడికి నేను సేవ చేయాలి గదా. నీ తండ్రికి చేసినట్టు నీకు కూడా సేవ చేస్తాను” అని అబ్షాలోముతో చెప్పాడు.
20 阿貝沙隆對阿希托費耳說:「你們商討一下,我們該作什麼?」
౨౦తరువాత అబ్షాలోము అహీతోపెలును పిలిపించాడు. “మనం ఏ ఏ పనులు చెయ్యాలో ఆలోచిద్దాం” అన్నాడు.
21 阿希托費耳對阿貝沙隆說:「你應去親近你父親留下看守宮殿的嬪妃,叫全以色列人知道你已惹下了你父親的仇恨,那些支持你的人,就必更加堅強」。
౨౧అప్పుడు అహీతోపెలు “నీ తండ్రి బయలుదేరినప్పుడు ఇంటికి కాపలా ఉంచిన నీ తండ్రి ఉపపత్నులతో నువ్వు శయనించడం వల్ల నువ్వు నీ తండ్రికి మరింత అసహ్యుడవయ్యావని ఇశ్రాయేలీయులంతా తెలుసుకొంటారు. అప్పుడు నీ పక్షం వహించిన వారందరికీ ధైర్యం పెరుగుతుంది” అన్నాడు.
22 於是人們在屋頂上,給阿貝沙隆支搭了一座帳棚;阿貝沙隆當著眾以色列人的面,親近了他父親的嬪妃。
౨౨తరువాత వారు మేడపైన అబ్షాలోముకు గుడారం వేశారు. ఇశ్రాయేలీయులకందరికీ తెలిసేలా అతడు తన తండ్రి ఉపపత్నులతో లైంగికంగా కలిశాడు.
23 那時,阿希托費耳所出的主意,好像是詢問天主得來的神諭。凡阿希托費耳所出的主意,無論對達味,或對阿貝沙隆,都是如此。
౨౩ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా ఆలోచన చెప్పితే అది దేవుని దగ్గర విచారణ చేయగా వచ్చినట్టుగా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలాగే భావించేవారు.

< 撒母耳記下 16 >